katriyala
-
పాత తూకం యంత్రంతో రైతులకు భారీ టోకరా
రామాయంపేట (మెదక్): మండలంలోని కాట్రియాల గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. దీంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. ఎల్రక్టానిక్ తూకం యంత్రానికి బదులుగా పాత తూకం యంత్రం వినియోగించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రతీ తూకానికి 40 కిలోలకు బదులుగా 48 నుంచి 50 కిలోల వరకు అక్రమంగా తూకం చేసుకొని రైతులను మోసగించారు. కాగా రైతులకు తెలియకుండానే ఒక్కో తూకం (40 కిలోలు)లో ఎనిమిది నుంచి పది కిలోల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు పదివేల బ్యాగుల వరకు తూకం వేయగా, ఇందులో సుమారుగా ఐదు వేల బ్యాగులను పాత కాంటాపై తూకం చేశారు. ఈ లెక్కన రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కాగా ఎవరి ప్రోద్బలంతో తూకం వేసిన హమాలీలు ఈ మోసానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. బయటపడింది ఇలా.. సాయంత్రం మ్యాన్యువల్ కాంటాతో ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో అనుమానించిన కొందరు రైతులు ఈ కాంటాతో తూకం వేసిన బస్తాలను కొన్నింటిని ఎల్రక్టానిక్ తూకం యంత్రంపై తూకం వేయగా, ఈ మోసం బయటపడింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వందలాది మంది కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకొని వచి్చన పోలీసులు రైతులను శాంతపర్చారు. చదవండి: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న -
నీట మునిగిన పంటలు
రామాయంపేట:మండలంలోని కాట్రియాల, దంతేపల్లి గ్రామాల పరిధిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో రెండు గ్రామాల్లో చెరువులు నిండిపోగా, కొన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. భారీ వర్షంతో సుమారుగా 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో చేలల్లో మట్టి మేట వేసింది. కాట్రియాల జైత్య కుంట నీటితో నిండి కళకళలాడుతుంది. చెరువును ఆనుకుని ఉన్న లంబాడి కంలియాకు చెందిన మొక్కజొన్న చేను కొంతమేర నీటిలో మునిగింది. దంతేపల్లినాయకమ్మ కుంట నిండిపోయింది. ఈ చెరువు అలుగు పారుతోంది. చెరువుల కిందగల చెరకు, మొక్కజొన్న పంటల్లో నీరు నిలిచింది. మొక్నజొన్న పంట వేసిన భూమిలో మట్టి మేట వేసింది. తీన్ నంబర్ తండాలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో భూమి కోతకు గురై గండి పడింది. నీటిపారుదలశాఖ ఏఈ శ్యాం, వీఆర్వో ప్రణయిక నిండిన చెరువులతోపాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.