kb koliwad
-
బలప్రదర్శనలో పోటాపోటీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడి ముందు ఆశావహులు బలప్రదర్శనలో పోటీ పడుతున్నారు. తమ వర్గానికే టిక్కెట్ ఇవ్వాలంటూ అనుచరగణంతో చెప్పకనే చెప్పిస్తున్న ఆశావహులు.. వైరివర్గాన్ని తూర్పారపట్టే ఎత్తుగడతో వ్యూహా త్మకంగా సాగుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అభిప్రాయ సేకరణ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, తాండూరు, శేరిలింగంపల్లి అసెం బ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై పరిశీలకుడు కె.బి.కోలివాడ్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో భాగంగా పరిశీలకుడి ముందు బలప్రదర్శన చేపట్టిన ఆశావహులు.. అనుచరగణంతో కార్యాలయంలో హడావుడి సృష్టిం చారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాట్ హాట్‌గా వికారాబాద్.. వికారాబాద్ నియోజకవర్గం ఈ సారి ఆసక్తికర పోటీకి కేంద్రబిందువు కానుంది. నిన్నటివరకు టీఆర్ఎస్లో కీలక భూమిక పోషించిన ఎ.చంద్రశేఖర్ ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జి.ప్రసాద్‌కుమార్ కూడా బరిలో ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయం లో ఏఐసీసీ పరిశీలకుడి ముందు వేరువేరుగా తమ వాదాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టత ప్రకటించడంతో రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని, దీంతో తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చంద్రశేఖర్ పేర్కొ ంటూ నివేదిక సమర్పించారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కార్తిక్‌రెడ్డికి ఇస్తే బాగుం టుందని సూచించారు. చంద్రశేఖర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి ప్రసాద్‌కుమార్ భారీ అనుచరగణంతో డీసీసీ కార్యాలయానికి వచ్చారు. అనుచరులు మంత్రి ప్రసాద్‌కుమార్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, సోనియా, రాహుల్‌కు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. మంత్రి ప్రసాద్‌కుమార్ పరిశీలకుడు కోలివాడ్‌ను కలిసి నివేదికను సమర్పించారు. నియోజకవర్గంలో తా ను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఈ దఫా కూడా టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. ఎంపీగా జైపాల్‌రెడ్డికి మద్దతు పలికారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ప్రసాద్‌కు వంతపాడారు. తాండూరు.. జోరు.. తాండూరు నియోజకవర్గం నుంచి ఆశావహుల సంఖ్య హెచ్చుగానే ఉంది. మహరాజ్ కుటుం బం నుంచి తండ్రికొడుకులు నారాయణరావు, రమేష్ ఇరువురు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్త ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథగౌడ్ కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికివారు తమ అనుచరులను వెంటబెట్టుకుని ఆదివారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. నారాయణరావు, రమేష్‌లు జైపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని, లేని సందర్భంలో కార్తిక్‌రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు. కాగా ప్రసాద్‌రెడ్డి మాత్రం కార్తిక్‌రెడ్డికి మద్దతు పలికారు. శేరిలింగంపల్లిలో.. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్ పోటీలో ఉండగా.. స్థానిక నేత రాగం నాగేందర్‌యాదవ్ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు మైనార్టీ నాయకురాలు షహీదాబేగం కూడా టికెట్ ఆశిస్తున్నారు. పరిశీలకుడు కోలివాడ్‌ను వేర్వేరుగా కలిసి తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే భిక్షపతి యాదవ్ ఒక్కరే పరిశీలకుడితో భేటీ కాగా, మిగిలిన వారంతా అనుచరులతో వెళ్లి కలిశారు. రాగం నాగేందర్ యాదవ్ తనకు ఎమ్మెల్యే టికెట్, తన సతీమణి సుజాతకు మహిళల కోటాలో ఎంపీ టికెట్ ఇవ్వాలని పరిశీలకుడిని కోరారు. -
రేసులో నిలిచేదెవరో?
అధికారపార్టీలో అలజడి మొదలైంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం దూత ఆదివారం జిల్లాకు రానుండడంతో రాజకీయవాతావరణం వేడెక్కనుంది. గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుడి ముందు బలప్రదర్శనకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులకు పార్టీ టికెట్లు దక్కకుండా వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్న నేతలు.. సీటు ఎగురేసుకుపోయేందుకు ఎత్తులు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానంతోపాటు దాని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణకు పార్టీ పరిశీలకుడు, కర్ణాటక రాణిబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్ ఆదివారంనుంచి డీసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల నుంచి ఈ సారి పోటీకి దిగేందుకు మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్య ఉత్సాహం చూపుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కూడా ఈ సీటు రేసులో ఉన్నారు. జైపాల్ రెడ్డి పోటీనుంచి తప్పుకుంటే మాత్రమే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వీరందరూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం సీటుపై గురి పెట్టారు. మరోవైపు అసెంబ్లీలో ప్రవేశించేందుకు కుతూహలం చూపుతున్న నాయకులు కూడా వేగును ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ స్థానానికి ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన రమేశ్ సహా మాజీ ఎమ్మె ల్యే నారాయణరావు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మహారాజ్ కుటుంబం నుంచి వీరిరువురిలో ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశముంది. మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, సబిత సోదరుడు నర్సింహరెడ్డి కూడా తాండూరు నుంచి పోటీకి యత్నిస్తున్నారు. ఈ శాసనసభ స్థానం నుంచి ఎన్నికల గోదాలో దిగేందుకు అధికారపార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కాలె యాదయ్య సహా ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి ఈసారి టికెట్ రేసులో ఉన్నారు. వీరేగాకుండా మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి పోటీచేస్తారని రాజకీ యవర్గాల్లో చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ప్రసాద్‌కుమార్ మళ్లీ బరిలో దిగనున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈయన కూడా ఏఐసీసీ దూతకు తన అంతరంగాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి సబిత అండదండలతో టికెట్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సీటుపై ప్రధానంగా ఇద్దరు నేతలు కన్నేశారు. మాజీ మంత్రి కమ తం రాంరెడ్డి మరోసారి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతుండగా.. 2009లో రెబల్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన పీసీసీ ప్రధాన కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతోంది. ఈసారి పొరుగున ఉన్న రాజేంద్రనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంతో ఉన్న పాత పరిచయాలు తనకు కలిసివస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. సబిత మాత్రం మహేశ్వరం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతున్నారు. సబిత ఇక్కడి నుంచి తప్పుకుంటే చల్లా నర్సింహరెడ్డి, గుర్రం నర్సింహరెడ్డిలు టికెట్ రేసులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈసారి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మొదట్లో సబిత అనుచరుడిగా మెలిగి.. ప్రస్తుతం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పంచన చేరిన జ్ఞానేశ్వర్ ఆయన ఆశీస్సులతో బీ ఫారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మద్దతు కూడా కూడగడుతున్నారు. మరోవైపు ఈ సీటుపై మాజీ మంత్రి సబిత కూడా కన్నేశారు. ఒకవేళ తన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ దక్కని పక్షంలో ఇక్కడి నుంచి బరిలో నిలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మరోసారి పోటీకి ఉవ్విళ్లురుతున్నారు. ఒకవేళ ఆయన కాదనుకుంటే తన కుమారుడు రవికుమార్‌ను తెరమీదకు తెచ్చే అవకాశముంది. రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ రాగం నాగేందర్, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ టికెట్ రే సులో ఉన్నారు. ఎమ్మెల్యేకు దీటుగా పరిశీలకుడి ఎదుట బలప్రదర్శన చేసేందుకు ఈ ఇరువురు నేతలు సన్నద్ధమవుతున్నారు. -
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిశీలకుడిగా కోలివాడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... తాజాగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి, ఇతర పార్టీలతో పొత్తులు, సాధ్యాసాధ్యాలపై గత మూడు రోజులుగా పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి హైకమాండ్ పరిశీలకుడిని నియమించింది. కర్ణాటక రాష్ట్రం రాణీబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్‌ను దూతగా పంపింది. సంక్రాంతి అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశాలుండడం... శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 23 తర్వాత చేవెళ్ల పార్లమెంటరీ సీటు పరిధిలోని నేతలతో భేటీకి తేదీలు ఖరార య్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుపై పలువురు కన్నేశారు. ఈ నేపథ్యంలో పరిశీ లకుడి ముందు ఆశావహులు బలప్రదర్శన జరిపే వీలుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకూ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.