సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... తాజాగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి, ఇతర పార్టీలతో పొత్తులు, సాధ్యాసాధ్యాలపై గత మూడు రోజులుగా పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి హైకమాండ్ పరిశీలకుడిని నియమించింది. కర్ణాటక రాష్ట్రం రాణీబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్‌ను దూతగా పంపింది.
సంక్రాంతి అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశాలుండడం... శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 23 తర్వాత చేవెళ్ల పార్లమెంటరీ సీటు పరిధిలోని నేతలతో భేటీకి తేదీలు ఖరార య్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుపై పలువురు కన్నేశారు. ఈ నేపథ్యంలో పరిశీ లకుడి ముందు ఆశావహులు బలప్రదర్శన జరిపే వీలుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకూ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిశీలకుడిగా కోలివాడ్
Published Sun, Jan 12 2014 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement