కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘సార్వత్రిక’ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై వివరాల ఆరాతీసే విషయంలో అధికారులు దూకుడు పెంచారు. చాలా మంది తప్పుడు లెక్కల్ని సమర్పిస్తున్నారనే ఉద్దేశంతో వెంటనే ఖర్చులు తెలపాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. వాటిని కలెక్టరేట్‌లోని నోటీసు బోర్డుపై సైతం అతికించారు.
48గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి హైద్రాబాద్ దక్కన్ క్రానికల్ పేపరల్లో రూ.8లక్షల విలువైన ప్రకటన వేసుకొన్నారని, అదే విధంగా జైపాల్ రెడ్డి నామినేషన్ వేసే రోజు రూ. 97వేల విలువైన ప్రకటన వేయించుకున్నా అందుకు సంబంధించి తమకు లెక్కలు సమర్పించల్లేదని అధికారులు వారిపై అభియోగాన్ని మోపారు. ఇక ప్రతీ మూడు రోజులకోమారు వ్యయం వివరాలు సమర్పించాలని సూచించినా అభ్యర్థులనుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది వరకు సమర్పించిన వ్యయ వివరాలిలా...
టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి రూ. 2.20లక్షలు, జైపాల్ రెడ్డి రూ.3.99లక్షలు, బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి రూ.3.24లక్షలు, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హెచ్‌ఏ రహమాన్ రూ.67వేలు, స్వతంత్ర అభ్యర్థులు సయ్యద్ ఇబ్రహీం రూ.3.70లక్షలు, కదిరె కృష్ణ రూ.39వేలు, శివశంకర్ రూ.29వేలు, ఎస్‌ఆర్ రామయ్య రూ.26వేలు వంతున ఖర్చుచేసినట్లు లెక్కలు సమర్పించారు. ఇక నాగర్‌కర్నూల్‌కు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థుల లెక్కలు జేసీ చాంబర్‌కు అందాల్సి ఉంది. ఇంత వరకు ఏఒక్కరు పూర్తిస్థాయిలో అందించకపోవడంతో, వారందరికీ నోటీసులు జారీ చేసి వెంటనే సమర్పించాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు.
‘లెక్కల్లో’..స్పీడ్
Published Wed, Apr 23 2014 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement