jai pal reddy
-
అన్ని వర్గాల ఆత్మబంధువు కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, తమ పార్టీ నేతృత్వంలోనే దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నేతలు ఉద్ఘాటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ దీక్ష’జరిగింది. దీక్షకు హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. దేశంలో దళితుల హక్కులను నీరుగార్చే కుట్ర జరుగు తోందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ తానే ఆ కుర్చీలో కూర్చుని అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దళితులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలను ప్రశ్నించాలి: ఉత్తమ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విధ్వంసకర ఘటనల్లో చాలా మంది దళితులు చనిపోయారని, తెలంగాణలోనూ కేసీఆర్ నేతృత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దాడులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల అనుసరిస్తున్న విద్వేషకర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసమే రాజ్యాంగం అట్రాసిటీ చట్టాన్ని ఇచ్చిందని, ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల వైఖరిని ఎదుర్కొనేందుకు పోరాడతామన్నారు. మతకల్లోలాలతోనే బీజేపీ గెలుపు: జైపాల్ కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ మతకల్లోలాలు జరిగిన చోటే బీజేపీ గెలుస్తుందని, అవి జరగకపోతే బీజేపీ ఎక్కడా గెలవదని అన్నారు. ప్రభుత్వ లాయర్లు సరిగా వాదించకపోవడం వల్లనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగారేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీలో బీజేపీకి మిత్రుడిగా, గల్లీలో శత్రువుగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాకముందు కేసీఆర్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారని, అధికారం వచ్చాక మాట తప్పారని అన్నారు. ఒక్క సంవత్సరంలో ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పిన భారీ అంబేడ్కర్ విగ్రహం ఎక్కడని ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ మార్కు రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ మార్కు రాజ్యాంగం నడుస్తున్నాయని ఆరోపించారు. నాటి అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను కదలించిన మహానేత వైఎస్ మహాపాదయాత్ర చేపట్టి 15 ఏళ్లు అవుతోందని, ప్రజల అడుగుల్లో అడుగేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్‌తోనే సమాన హక్కులు: రఘువీరా దీక్షకు హాజరైన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచమని, అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లా డుతూ దళితులను ఇసుక ట్రాక్టర్ల కింద నలిపేసిన చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్ట పరచాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తాను చేపట్టిన దీక్షను సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తమ్ విరమించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. 23న ఢిల్లీలో.. దేశంలోని దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 23న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే ఈ సమ్మేళనానికి రాష్ట్రంలోని దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. -
‘లెక్కల్లో’..స్పీడ్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘సార్వత్రిక’ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై వివరాల ఆరాతీసే విషయంలో అధికారులు దూకుడు పెంచారు. చాలా మంది తప్పుడు లెక్కల్ని సమర్పిస్తున్నారనే ఉద్దేశంతో వెంటనే ఖర్చులు తెలపాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. వాటిని కలెక్టరేట్లోని నోటీసు బోర్డుపై సైతం అతికించారు. 48గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి హైద్రాబాద్ దక్కన్ క్రానికల్ పేపరల్లో రూ.8లక్షల విలువైన ప్రకటన వేసుకొన్నారని, అదే విధంగా జైపాల్ రెడ్డి నామినేషన్ వేసే రోజు రూ. 97వేల విలువైన ప్రకటన వేయించుకున్నా అందుకు సంబంధించి తమకు లెక్కలు సమర్పించల్లేదని అధికారులు వారిపై అభియోగాన్ని మోపారు. ఇక ప్రతీ మూడు రోజులకోమారు వ్యయం వివరాలు సమర్పించాలని సూచించినా అభ్యర్థులనుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకు సమర్పించిన వ్యయ వివరాలిలా... టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి రూ. 2.20లక్షలు, జైపాల్ రెడ్డి రూ.3.99లక్షలు, బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి రూ.3.24లక్షలు, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ఏ రహమాన్ రూ.67వేలు, స్వతంత్ర అభ్యర్థులు సయ్యద్ ఇబ్రహీం రూ.3.70లక్షలు, కదిరె కృష్ణ రూ.39వేలు, శివశంకర్ రూ.29వేలు, ఎస్ఆర్ రామయ్య రూ.26వేలు వంతున ఖర్చుచేసినట్లు లెక్కలు సమర్పించారు. ఇక నాగర్‌కర్నూల్‌కు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థుల లెక్కలు జేసీ చాంబర్‌కు అందాల్సి ఉంది. ఇంత వరకు ఏఒక్కరు పూర్తిస్థాయిలో అందించకపోవడంతో, వారందరికీ నోటీసులు జారీ చేసి వెంటనే సమర్పించాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. -
నువ్వా.. నేనా..!
నిన్న మిడ్జిల్‌లో రగిలిన ‘ఫ్లెక్సీలు’, మొన్న రథం రగడ, యాత్రల పేరిట నేతల హంగామా. సాక్షాత్తూ జిల్లా కాంగ్రెస్‌లో ప్రముఖులనుకున్నవారే ఎడమొహం, పెడమొహం. క్షేత్ర స్థాయిలో పోటా పోటీ కార్యక్రమాలు. వెరసి సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలు. చాపకింద నీరులా కిందివారిని ఎగదోసి తమ వారికి టికెట్ల కోటాలో పెద్దపీట వేయించుకొని తాము రాష్ట్రంలోనో, కేంద్రంలోనో చక్రం తిప్పాలన్న తపన..ఇదీ ‘హస్తం’ పెద్దల తీరు. వర్గాల పెంచుతున్న వైనం. -సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డీకే అరుణ కేంద్రంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం లేదా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి డీకే అరుణ ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ఇద్దరు నేతలు తెలంగాణ రాష్ట్రంలో ‘కీలకమైన పదవి’ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో వారు వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి ప్రాపకం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశీస్సులు లేనిదే టికెట్ దక్కడం అసాధ్యమనే భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల రెండు వర్గాలకు చెందిన నాయకులు టికెట్ల వేటలో ఉండటంతో ఎన్నికలకు ముందే ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నారు. డీకే అరుణతో సఖ్యత లేకపోవడంతో ఇటీవల కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ఇటీవల గురునాథ్‌రెడ్డి కలిసి వచ్చినట్లు సమాచారం. డీసీసీ అధికార ప్రతినిధి సలీం, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ముదిగండ్ల కృష్ణ, మాజీ జడ్పీటీసీ మల్కిరెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్న వారిలో వున్నారు. అవకాశం కలిసి వస్తే డీకే అరుణ సోదరుడు నారాయణపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా రు. మాజీ పీసీసీ చీఫ్ డీఎస్, మాజీ ఎంపీ విఠల్‌రావు త దితరుల సహకారంతో మరోమారు టికెట్ దక్కించుకునేందుకు సూగప్ప ఆరాట పడుతున్నారు. మాజీ ఎమ్మె ల్యే వీరారెడ్డి కూడా టికెట్ ఆశించే అవకాశం వుంది. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, 2010 ఉప ఎన్నికలో పోటీ చేసిన ముత్యాల ప్రకాశ్ మహబూబ్‌నగర్ టికెట్ ఆశిస్తున్నారు. విద్యా సంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. డీకే అరుణ సహకారంతో మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. స్థానిక నినాదాన్ని తెరమీదకు తెస్తున్న బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సాదు వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి వర్గీయులుగా టికెట్ ఆశిస్తున్నారు. దేవరకద్రలో కాంగ్రెస్ అనధికార ఇంచార్జిగా డీకే అరుణ ఆశీస్సులతో డోకూరు పవన్‌కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. కొత్తకోటకు చెందిన విశ్వేశ్వర్, దేవరకద్రకు చెందిన ప్రదీప్ కుమార్ గౌడ్ కూడా టికెట్‌పై ఆశతో వున్నారు. మక్తల్ నుంచి డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి లేదా అతని భార్య సుచరిత టికెట్ కోరే అవకాశం వుంది. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపైనా చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మళ్లీ టికెట్ ఖాయమనే ధీమాతో నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి డీకే అరుణ గద్వాల నుంచి మరోమారు పోటీ కి సిద్దమవుతున్నారు. గతంలో చల్లా వెంకట్రాంరెడ్డి మద్దతుతో అలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్రహాం ప్రస్తుతం ఒంటరిపోరు చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ విఠల్‌రావు పీఏ సంపత్‌కుమార్ కూడా టికెట్‌ను ఆశించే అవకాశం ఉంది. నాగర్‌కర్నూలు నుంచి జడ్పీ మాజీ చైర్మన్ కూచకుళ్ల దామోదర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి దిలీపాచారి తమ వంతు ప్రయత్నాల్లో వున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పోటీగా అచ్చంపేట ఎస్సీ స్థానం నుంచి ఎవరూ టికెట్ అడిగే అవకాశం కనిపించకపోవడంతో గ్రూపుల ప్రభావం లేదు. జైపాల్‌రెడ్డి స్వయంగా కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. జైపాల్‌రెడ్డి మద్దతుతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, డీకే అరుణ సహకారంతో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి వున్నా కొత్తూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీర్లపల్లి శంకర్, మాజీ సర్పంచ్‌లు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొందూటి నరేందర్ టికెట్ ఆశిస్తుండటంతో విభేదాలు లోలోన భగ్గుమంటున్నాయి. కొల్లాపూర్‌లో డీకే ఆరుణ మద్దతుతో మరోమారు విష్ణువర్దన్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నా, విలీనమైనా కొల్లాపూర్ రాజకీయం మరోమారు ఉత్కంఠగా మారనుంది. -
గిప్పుడే రావాలా !
‘తెలాంగాణ’ ఇచ్చిన క్రెడిట్‌ను కొట్టేసి ఎన్నికల్లో ఓట్లు కొల్లగొడదామనుకుంటున్న జిల్లా కాంగ్రెస్ పెద్దలకు వర్గాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. వాస్తవాలేమిటో...గెలుపు గుర్రాలేవో తెలుసుకునేందుకు నెలాఖరులో ఏఐసీసీ పరిశీలకులు వస్తున్నారని తెల్సి అదిరిపడుతున్నారు. వారు ఏమీ ఆరా తీస్తారో.. స్వపక్షంలోనే ఉన్న ప్రత్యర్థులు ఎలాంటి బాణాలు వేసి తమ అవకాశాలకు తూట్లు పొడుస్తారోనని తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారు ముందు జాగ్రత్తగా తమ మద్ధతును కూడగట్టుకొని పార్టీ పరిశీలకులను ఆకట్టుకునేందుకు పథక రచన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:జిల్లా కాం గ్రెస్ నెత్తిన పిడుగుపడినట్లైంది. వర్గాల నె గళ్లతో రగులుతున్న నేతలకు పాలమూ రు వాకిటకు ఏఐసీసీ (అఖిల భారతీయ కాం గ్రెస్ కమిటీ) పరిశీలకులు రానున్నారని తె లిసి ఏ శిబిరానికి ఆ శిబిరం అప్రమత్తమవుతోంది. సాధారణ ఎన్నికల నే పథ్యంలో ప రిశీలకులు వచ్చి ఇక్కడి పరి స్థితిని అధ్యయనం చేయనుండడంతో నే తల నోట్లో ప చ్చి వెలక్కాయపడినట్లవుతోందని రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు. యాత్రలతో ఆజ్యం.... యూపీఏ చైర్పర్సన్ సోనియా నిర్ణయం మేరకు జరిగిన తెలంగాణ ప్రకటనను కాం గ్రెస్‌కు అనుకూలంగా మార్చేలా చూడాల ని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఆ ముసుగు లో జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు తమ గ్రూ పులను బలపర్చుకునే ప్రయత్నం చేశారు. తొలుత యాత్రల పేరిట జిల్లాకు చెందిన మంత్రి డి.కె.అరుణ శ్రీకారం చుట్టి తన బ లాన్ని నిరూపించే ప్రయత్నం చేయగా దా న్ని దెబ్బతీసేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మద్ధతుదారులు, జిల్లాకే చెందిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అనుయాయులు కూడా దా నికి మొహం చాటేశారు. ఇక తాజాగా ఎం పీ వీహెచ్ చేపట్టిన రథయాత్ర ఈ గ్రూపుల ను మరింత రాజేసింది. ఆయన కార్యక్రమానికి చిన్నారెడ్డే ప్రధాన భూమిక పోషిం చి నడిపించారు. దీనికి తమకున్న కారణాలు చెప్తూ అరుణ అనుచరులు హాజరు కాలేదు. దీన్ని అధిగమించేందుకు మళ్లీ ఆమె కూడా మరో యాత్రకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడేమయ్యేనో... ఇక ఏఐసీసీ పరిశీలకు క్షేత్రస్థాయికి వెళ్తే ఈ విబేధాలన్నీ బయటపడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నారు.ఏఐసీసీ పరిశీలకుల ఎదుటే ఈ రచ్చ బహిర్గతమయ్యే సూచనలున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే అంతర్గత సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనుంచీ... ఏఐసీసీ పరిశీలకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులతో భేటీ జ రిపి విజ్ఞాపనలు స్వీకరించనున్నారు. వా రు నెలాఖరులోగా జిల్లాలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే లు మంజు, వాసును జిల్లా పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన అసెంబ్లీ, పార్లమెంటు స్థానా ల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉ న్న అభ్యర్థుల నుంచి వారు దరఖాస్తులు స్వీకరిస్తారు. పొరుగునే ఉన్న ర ంగారెడ్డి, నల్గొండతో పాటు తెలంగాణ జిల్లాలో ఇ ప్పటికే పార్టీ పరిశీలకులు కాంగ్రెస్ ఔత్సాహిక అభ్యర్థుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఓ వైపు రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండటం, మ రోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశాల నే పథ్యంలో జిల్లాకు పరిశీలకుల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు పరిశీలకులు జిల్లాకు వచ్చేఅవకాశముందని జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థా నాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా పార్టీ నేతలకు ఏఐసీసీ పరి శీలకులు భేటీ కానున్నారు. -
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిశీలకుడిగా కోలివాడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... తాజాగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి, ఇతర పార్టీలతో పొత్తులు, సాధ్యాసాధ్యాలపై గత మూడు రోజులుగా పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి హైకమాండ్ పరిశీలకుడిని నియమించింది. కర్ణాటక రాష్ట్రం రాణీబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్‌ను దూతగా పంపింది. సంక్రాంతి అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశాలుండడం... శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 23 తర్వాత చేవెళ్ల పార్లమెంటరీ సీటు పరిధిలోని నేతలతో భేటీకి తేదీలు ఖరార య్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుపై పలువురు కన్నేశారు. ఈ నేపథ్యంలో పరిశీ లకుడి ముందు ఆశావహులు బలప్రదర్శన జరిపే వీలుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకూ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
విన్నపాలు వినవలే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏఐసీసీ పరిశీలకుడు గెడెం ఆనందరావు శుక్రవారం జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆనందరావు హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డితో సమావేశమై.. జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారు, మన పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందుతారు అనే వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాంభద్రయ్యతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడు జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, షేక్‌సాబేర్ ఏఐసీసీ పరిశీలకునికి స్వాగతం పలికారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి సన్మానం చేశారు. ఎంపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ జహీరాబాద్ ఎంపీ స్థానం కోసం ముగ్గురు నేతలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట పోటీ పడినట్టు తెలిసింది. సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డిలు తమ మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఎంపీ షెట్కార్ పేరును డిప్యూటీ సీఎం దామోదర, మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి బలపర్చినట్లు సమాచారం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ పరిశీలకులు గెడెం ఆనందరావు విడివిడిగా సమావేశమయ్యారు. మొదట అందోలునియోజకవర్గం నాయకులతో ఆనందరావు భేటీ అయ్యారు. మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, నియోజకవర్గ నేత జగన్మోహన్రెడ్డి తదితరులు ఏఐసీసీ పరిశీలకులు ఆనందరావును కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి డిప్యూటీ సీఎం దామోదర పోటీ చేయాలని, ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఉంటే పార్టీకి బాగుంటుందని వివరించినట్లు సమాచారం. షెట్కార్, కిష్టారెడ్డి పరస్పరం మద్దతు జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని మరోమారు ఆశిస్తున్న సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిలు తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. సురేష్ షెట్కార్ ఎంపీ టికెట్ కోరగా అందుకు కిష్టారెడ్డి మద్దతు తెలిపినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే టికెట్ కిష్టారెడ్డికి ఇస్తే బాగుటుందని షెట్కార్ ఏఐసీసీ పరిశీలకునికి చెప్పినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి వద్దు? జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు గ్రూపులకు చెందిన నాయకులు విడివిడిగా ఏఐసీసీ పరిశీలకుడు ఆనందరావును కలిశారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ వర్గానికి చెందిన నాయకులు శేరి ఆశోక్, విజయ్‌కుమార్ తదితరులు ఎమ్మెల్యే టికెట్ మంత్రి గీతారెడ్డికి కేటాయించవద్దని, ఆమెకు ఇస్తే పార్టీ ఓటమిపాలవుతుందని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గ నాయకులు హన్మంతరావుపాటిల్, అల్లాడి నర్సింలు, తదితరులు మాత్రం మంత్రి గీతారెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మాజీ జడ్పీటీసీ మాణిక్యమ్మ, కాంగ్రెస్ జిల్లా నాయకులు సామ్యుయేల్, ఎన్ఎస్యుఐ నాయకుడు నవీన్ తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఏఐసీసీ పరిశీలకున్ని కోరారు. నేడు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ రాక మెదక్పార్లమెంట్కు సంబంధించిన ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ శనివారం సంగారెడ్డికి రానున్నారు. మెదక్ పార్లమెంట్పరిధిలోని సిద్దిపేట, మెదక్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, బ్లాక్ కాంగ్రెస్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షులతో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశం కానున్నారు.