‘తెలాంగాణ’ ఇచ్చిన క్రెడిట్‌ను కొట్టేసి ఎన్నికల్లో ఓట్లు కొల్లగొడదామనుకుంటున్న జిల్లా కాంగ్రెస్ పెద్దలకు వర్గాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. వాస్తవాలేమిటో...గెలుపు గుర్రాలేవో తెలుసుకునేందుకు నెలాఖరులో ఏఐసీసీ పరిశీలకులు వస్తున్నారని తెల్సి అదిరిపడుతున్నారు. వారు ఏమీ ఆరా తీస్తారో.. స్వపక్షంలోనే ఉన్న ప్రత్యర్థులు ఎలాంటి బాణాలు వేసి తమ అవకాశాలకు తూట్లు పొడుస్తారోనని తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారు ముందు జాగ్రత్తగా తమ మద్ధతును కూడగట్టుకొని పార్టీ పరిశీలకులను ఆకట్టుకునేందుకు పథక రచన చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:జిల్లా కాం గ్రెస్ నెత్తిన పిడుగుపడినట్లైంది. వర్గాల నె గళ్లతో రగులుతున్న నేతలకు పాలమూ రు వాకిటకు ఏఐసీసీ (అఖిల భారతీయ కాం గ్రెస్ కమిటీ) పరిశీలకులు రానున్నారని తె లిసి ఏ శిబిరానికి ఆ శిబిరం అప్రమత్తమవుతోంది. సాధారణ ఎన్నికల నే పథ్యంలో ప రిశీలకులు వచ్చి ఇక్కడి పరి స్థితిని అధ్యయనం చేయనుండడంతో నే తల నోట్లో ప చ్చి వెలక్కాయపడినట్లవుతోందని రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు.
యాత్రలతో ఆజ్యం....
యూపీఏ చైర్‌పర్సన్ సోనియా నిర్ణయం మేరకు జరిగిన తెలంగాణ ప్రకటనను కాం గ్రెస్‌కు అనుకూలంగా మార్చేలా చూడాల ని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఆ ముసుగు లో జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు తమ గ్రూ పులను బలపర్చుకునే ప్రయత్నం చేశారు. తొలుత యాత్రల పేరిట జిల్లాకు చెందిన మంత్రి డి.కె.అరుణ శ్రీకారం చుట్టి తన బ లాన్ని నిరూపించే ప్రయత్నం చేయగా దా న్ని దెబ్బతీసేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మద్ధతుదారులు, జిల్లాకే చెందిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అనుయాయులు కూడా దా నికి మొహం చాటేశారు. ఇక తాజాగా ఎం పీ వీహెచ్ చేపట్టిన రథయాత్ర ఈ గ్రూపుల ను మరింత రాజేసింది. ఆయన కార్యక్రమానికి చిన్నారెడ్డే ప్రధాన భూమిక పోషిం చి నడిపించారు. దీనికి తమకున్న కారణాలు చెప్తూ అరుణ అనుచరులు హాజరు కాలేదు. దీన్ని అధిగమించేందుకు మళ్లీ ఆమె కూడా మరో యాత్రకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పుడేమయ్యేనో...
ఇక ఏఐసీసీ పరిశీలకు క్షేత్రస్థాయికి వెళ్తే ఈ విబేధాలన్నీ బయటపడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నారు.ఏఐసీసీ పరిశీలకుల ఎదుటే ఈ రచ్చ బహిర్గతమయ్యే సూచనలున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే అంతర్గత సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
అన్ని కోణాల్లోనుంచీ...
ఏఐసీసీ పరిశీలకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులతో భేటీ జ రిపి విజ్ఞాపనలు స్వీకరించనున్నారు. వా రు నెలాఖరులోగా జిల్లాలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే లు మంజు, వాసును జిల్లా పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన అసెంబ్లీ, పార్లమెంటు స్థానా ల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉ న్న అభ్యర్థుల నుంచి వారు దరఖాస్తులు స్వీకరిస్తారు. పొరుగునే ఉన్న ర ంగారెడ్డి, నల్గొండతో పాటు తెలంగాణ జిల్లాలో ఇ ప్పటికే పార్టీ పరిశీలకులు కాంగ్రెస్ ఔత్సాహిక అభ్యర్థుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఓ వైపు రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండటం, మ రోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశాల నే పథ్యంలో జిల్లాకు పరిశీలకుల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు పరిశీలకులు జిల్లాకు వచ్చేఅవకాశముందని జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థా నాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా పార్టీ నేతలకు ఏఐసీసీ పరి శీలకులు భేటీ కానున్నారు.
గిప్పుడే రావాలా !
Published Thu, Jan 23 2014 4:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement