district congress
-
రాజకీయ కుట్రతోనే జనగామకు అన్యాయం
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలు∙ పట్టణాలను వదిలి గ్రామాలను జిల్లా చేస్తారా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి రఘునాథపల్లి : జనగామ జిల్లా కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కుట్రతో అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కోసం చేపట్టిన 8వ రోజు దీక్ష శిబిరాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జిల్లా కోసం ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌పై జిల్లా ఏర్పాటుకు ఒత్తి డి తెచ్చి ప్రజల పక్షాన ఉండాలన్నారు. శాస్త్రీయంగా భౌగోళికంగా జిల్లా కేంద్రం అయ్యేం దుకు అన్ని హంగులు జనగామకు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి విజయరామరావు మాట్లాడుతూ కొత్త జిల్లాల పునర్విభజన ఏకపక్షంగా అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యం లో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిం చారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, డీసీసీబీ వై స్ చైర్మన్ పుల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నా గేష్, జేఏసీ గౌరవ అధ్యక్షుడు కైలాసం, జే ఏసీ నాయకులు యాదవరెడ్డి, జోగారెడ్డి, హ ర్యానాయక్, రవి, బాలస్వామి, చిన్న నగేష్, లిం గాజీ, రమేష్, జయరాములు, చందన, మూ డ్ధర్మ, అశోక్, శ్రీను, నర్సింహ పాల్గొన్నారు. -
51 మందితో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ
37 మండలాలకు మహిళా కమిటీలు జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ వరంగల్ : జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ జాబితాను విడుదల చేశారు. పీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆమోదంతో జిల్లా కమిటీలో 51మందికి స్థానం కల్పించినట్లు తెలిపారు. 13 మంది ఉపా««దl్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులను నియమించామని పేర్కొన్నారు. ఉపా««దl్యక్షురాళ్లుగా రాజమల్లమ్మ, కాసారపు నర్మద, ఇర్సవడ్ల ఝూన్సీరాణి, కొమురం ధనలక్ష్మి, కామటి పార్వతి, గుండాల అరుణారెడ్డి, ఎడబోయిన మంగమ్మ, బొమ్మగాని రమ, పసునూరి సువర్ణ, లాలిగాపు లక్ష్మి, తోట విజయ, జాలిగపు లక్ష్మి, వనజారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా రామగిరి విజయ, గుర్రం జ్యోతి, సింగారపు అరుణ, జక్కుల విజయ, కౌడగాని ఉమ, వజ్జ వెంకటలక్ష్మి, కొంగరి సుమలత, తుమ్మల సుధారాణి, బండారి కళ్యాణి, ఐలాపురం పారిజాతం, యాల పుష్పలీల, జన్ను ప్రమీల, నసీం జహాం, శోభ, పులి వెంకటలక్ష్మీ, ఆకారపు నర్మద, గడ్డం జ్యోతి, యారపు లల్లీపుష్పతోపాటు మరో 10మంది కార్యదర్శులకు కార్యవర్గంలో చోటు కల్పించినట్లు వివరించారు. జిల్లా కమిటీతోపాటు జిల్లాలోని 37 మండలాలకు అధ్యక్షులను నియమించినట్లు లె లిపారు. సమావేశంలో మద్దెల శోభారాణి, నసీంజాహా, బండారు కళ్యాణి, కాస్క లక్ష్మి, పార్వతమ్మ, యాకూబీ, ప్రమీల, మేరీలు పాల్గొన్నారు. మండల మహిళా అధ్యక్షులు వీరే... తాళ్లపెల్లి నీలారాణి (హసన్‌పర్తి), ఎలమకంటి అరుణ (వర్ధన్నపేట), జన్ను మంజుల (హన్మకొండ), బొమ్మెర జ్యోతి (పర్వతగిరి), తూనం రోజా (తొర్రూరు), ఎడ్ల హరిత(దేవరుప్పుల), అంబటి జయశ్రీ (రాయపర్తి), మల్లమ్మ (పాలకుర్తి), నేతి ఉమ (కొడకండ్ల), తాటిపర్తి నాగేంద్ర (ములుగు), పసునూటి జయక్క (వెంకటాపురం), పన్నాల పూలమ్మ (గోవిందరావుపేట), పాయం కవిత (తాడ్వాయి), పినగాని సంతోష (ఏటూరునాగారం), ఆళ్ల రాధారాణి (మంగపేట), సిద్దబోయిన రాధ (కొత్తగూడ), దారావత్ అమ్మి (చెన్నారావుపేట), మొడగాని స్వరూప (నెక్కొండ), ఇడ్ల నాగమణి (ఖానాపురం), వాంకుడోతు కవిత (నర్సంపేట రూరల్), చెల్పూరి జ్యోతి (నల్లబెల్లి), వజినపల్లి శారద (నర్సంపేట అర్బన్), ముండ్రాతి రాగమణి (ఆత్మకూరు), గంట కళావతి (పరకాల), చొప్పరి స్వరూప (పరకాల), గుర్రం గీత (సంగెం), బోడ సుమిత్ర (గూడూరు), గట్ల సునీత (మహబూబాబాద్), వలబోజు పద్మ (రఘునాథపల్లి), చింబుల స్వాతి (స్టేçÙన్ఘనపురం), బత్తిని పావని (జఫర్‌గఢ్), ఎర్ర పూలమ్మ (ధర్మసాగర్), రేకులపల్లి రాజేశ్వరీ (చేర్యాల), నాంపల్లి సరోజన (మద్దూరు), కళ్యాణం లలిత (నర్మెట్ట), గిరిబోయిన భాగ్యలక్ష్మి (బచ్చన్నపేట), టి.రాధిక (జనగామ టౌన్) నియమితులయ్యారు. -
రైతు ఆత్మహత్యలు పట్టవా?
- బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి - ప్రజాసమస్యల్ని గాలికొదిలారు.. - జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైర్ - కలెక్టరేట్ ఎదుట ధర్నా సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చివేతలు, కట్టడాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే.. వాటి గొంతు నొక్కేయడం దారుణమని మండిపడింది. కరువుతో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం హేయమని విమర్శిం చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుం బాలకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో వారిని అరెస్టు చేశారు. పలువుర్ని నాంపల్లి స్టేషన్‌కు తరలించిన తర్వాత విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు. నియంత పాలన సాగుతోంది: ప్రసాద్‌కుమార్ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శించారు. ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రజాప్రతినిధులను అణచివేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రజాసమస్యలపై అన్నిపార్టీలతో కలిసి ఉద్యమించి టీఆర్ఎస్ మెడలు వంచుతామన్నారు. డిజైన్ మారిస్తే యుద్ధం చేస్తాం : టీఆర్ఆర్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణ హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, బృహత్తర లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం పూటకోమాట మారుస్తోందన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని, ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిజైన్ మారిస్తే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందు చూపు లేదా?
సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాల ధ్వజం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అనంతపురం క్రైం : జిల్లాలో ఎంతమంది రైతులున్నారు..? ఎన్ని క్వింటాళ్లు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలు కా వాలి..? గతంలో ఎన్ని క్వింటాళ్లు దిగు మతి అయ్యేవి..? అనే విషయాలపై ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ యం త్రాంగానికి ముందు చూపు లేదా..? అని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ప్రశ్నిం చారు. విత్తన వేరుశనగ పంపిణీపై ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో రైతులకు విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాకు దాదాపు 5 లక్షల క్వింటాళ్లు వరకు వేరుశనగ కాయలు అవసరం కాగా, ప్రభుత్వం 2 లక్షల 11 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించి రైతులకు సరఫరా చేసిందన్నారు. సగం మంది రైతులు విత్తనం అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. పైగా సబ్సిడీ తగ్గించి అధిక ధరతో ప్రభుత్వం రైతులపై భారం మోపిందన్నారు. రైతులకు ఇప్పటి వరకు సరఫరా చేసిన విత్తన కాయల్లో దాదాపు 35 శాతం నాసిరకం కాయలున్నాయని పేర్కొన్నారు. విత్తన కాయల కోసం మూడు మాసాల కిందటే కలెక్టర్, వ్యవసాయాధికారులు సమావేశమై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో విత్తన కాయలపై కమిటీ సమావేశం నిర్వహిస్తారన్నారు. వీటిని నిర్వహించకుండా, సరిపడు విత్తన కాయలు సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రతి రైతుకు అవసరమైన మేరకు విత్తనకాయలు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అనంతపురం అర్బన్ : ప్రజా సంక్షేమ, రాజ్యాంగపర పాలనలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. వేరుశనగ విత్తనకాయ పంపిణీలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా వైఫలం చెందిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఇవ్వడంలోనూ, రుణామాఫీ విషయంలోనూ రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇందుకు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ అధికార పార్టీ నాయకునిలా వ్యహరిస్తూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. గవర్నర్ వ్యవస్థ, రాజ్యాంగంపై గౌరవం లేని ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
పొన్నాల.. చూడాల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్గపోరుతో కునారిల్లుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం మరో ప్రయత్నం చేస్తోంది. కమ్యూనిస్టులను దీటుగా ఎదుర్కొని జిల్లాలో నిలదొక్కుకన్న ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం ఒకింత ఇబ్బంది అయినా దీన్ని విజయవంతం చేసి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆశయం గొప్పదే అయినా వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని ఒకతాటిపైకి తీసుకురావడానికి పొన్నాల ఏం మాయచేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. కొలిక్కిరాని అధ్యక్ష ఎన్నిక డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి వనమా వెంకటేశ్వరరావు వైదొలిగినప్పటి నుంచి నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఖమ్మం నుంచి మొదలైన సమావేశాలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయికి చేరినా ఇంత వరకు అధ్యక్షున్ని ఎన్నుకోలేకపోయారు. డీసీసీ కమిటీ ఎన్నిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారీ తమ వర్గీయుడంటే తమ వర్గీయుడినే అధ్యక్షున్ని చేయాలని ఆయా వర్గాలు పట్టుబడుతున్నాయి. చివరికి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగడం గమనార్హం. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే పరస్పర దూషణలకు దిగడంతో అధ్యక్షుని వ్యవహారం ఓ కొలిక్కి రాకుండానే సమావేశాన్ని ముగించారు. ఆ సమావేశం ఆధిపత్య పోరులా సాగింది తప్ప అధ్యక్షున్ని నిర్ణయించేలా సాగకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏకాభిప్రాయం ఎప్పటికి సాధ్యమో... ఢిల్లీలో సమావేశమై 15 రోజులకు పైగా అవుతున్నా ఇంత వరకు ఆ పార్టీ జిల్లా నేతలు ఒక అవగాహనకు రాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీకి, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండే వ్యక్తినే నాయకున్ని చేయాలని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం ఆకాంక్షిస్తోంది. ఢిల్లీ సమావేశంలో తగిన నాయకుని పేరు సూచించాలని దిగ్విజయ్ కోరారు. ఖమ్మం, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మల్లు భట్టివిక్రమార్క ఒక పేరును, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో పేరును, రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి వేరొక పేరును సూచించారు. ఈ సమావేశంలో ఎవరికి వారు తమ వర్గానిదే పైచేయి కావాలని ప్రయత్నించారు తప్ప సమస్యను ఓ కొలిక్కి తేవాలనే ఉద్దేశం ఎవరిలో కనిపించలేదని ఆ సమావేశం తర్వాత వెలువడిన సమాచారం. ఇలా ఏ విషయంలోనూ ఒకతాటిపైకి రాలేని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవటం మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ కేడర్ ఉంది. టీఆర్ఎస్ వైపు చూపు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో విసిగివేసారిన పలువురు పార్టీని వీడి వెళ్తున్నారు. వారంతా అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. వారిని నిలువరించే చొరవ తీసుకునే నాయకుడే కాంగ్రెస్‌కు కరువయ్యారనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సభ్యత్వ నమోదు కోసం జిల్లాకు వస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు తమ ఆవేదన తెలిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్న జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడం, సభ్యత్వ నమోదును విజయవంతం చేయడం పొన్నాలకు సవాల్‌గా మారనుంది. -
ఢిల్లీలోనూ ‘ఢీ’సీసీయే..!
* తెగని జిల్లా కాంగ్రెస్ పంచాయితీ * దిగ్విజయ్ సమక్షంలో మాటలయుద్ధం * అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా * రేసులో రాంరెడ్డి, ఐతం సత్యం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఢిల్లీ పెద్దల సాక్షిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రతిష్ట మరోసారి మసకబారింది. డీసీసీ అధ్యక్షుని వ్యవహారం తేల్చడానికి జిల్లా కాంగ్రె స్ నేతలను ఆ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వారితో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను చూసి దిగ్విజయ్ నివ్వెర పోవాల్సి వచ్చిందట. జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగిన మాటల యుద్ధంతో అధ్యక్షుని ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ‘నోటితో పలుకరించుకుని నొసటితో వెక్కిరించుకున్నట్లు’గా వ్యవహరించారట. అందుకే ఢిల్లీ పెద్దలు వీరిమధ్య సయోధ్య కుదర్చటం తమవల్ల కాదని అసహనం వ్యక్తం చేస్తూ.. హెచ్చరించినట్లు సమాచారం. ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి జట్టి కుసుమకుమార్, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం వచ్చే సరికి జిల్లా నేతల్లో కొందరు పరస్పర ఆరోపణలు, పత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలు, దూషణల పర్వానికి దిగేసరికి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారని సమాచారం. పెద్దలు నచ్చజెప్పినా పెడచెవినే..! జిల్లా కాంగ్రెస్‌ను మరింత పరిష్ట పరిచేందుకు నేతలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సమావేశం ఆరంభంలోనే ఉద్బోధించారట. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించటం సామాన్య విషయం కాదని దిగ్విజయ్ మాట్లాడారని తెలిసింది. జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని దిగ్విజయ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, జిల్లా నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వ్యవహారం కొలిక్కిరాలేదని సమాచారం. ఎవరికి వారు తమదే పైచేయి కావాలనే రీతిలో జిల్లా పార్టీని ప్రత్యర్థివర్గం ఏరకంగా ఇబ్బంది పెట్టింది, దాని వల్ల వచ్చిన ప్రతికూల ఫలితాలేమిటో సమావేశంలో ఏకరువు పెట్టినట్లు తెలిసింది. రగడ ఇలా మొదలైంది.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించడంతో రగడ మొదలైందట. రేణుక- సుధాకర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిందని సమాచారం. రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును రేణుకాచౌదరి బహిరంగంగానే వ్యతిరేకించగా జిల్లాకు చెందిన ఇతర నేతలు వారి వాదప్రతివాదాల్లో తలదూర్చకుండా తటస్థంగానే వ్యవహరించారని తెలిసింది. వెంకటరెడ్డి పేరుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తాను ఈ వయసులో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడలేనని, అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే అధ్యక్షుడిగా ఉంటానని ఆయన సమావేశంలో అన్నట్లు సమాచారం. సమావేశంలో ఏకగ్రీవ ప్రతిపాదన వచ్చేలా లేదని, జిల్లా నేతలు పార్టీ పతిష్టను దృష్టిలో ఉంచుకొని కొంత సమయమనంతో వ్యవహరించాలని దిగ్విజయ్ కోరినా ఆశించిన ఫలితం రాలేదట. ఈ సమావేశంలో ఒక వర్గం మరో వర్గానికి చెక్ పెట్టగలిగామన్న సంతృప్తి మినహా అధ్యక్ష ఎన్నిక విషయాన్ని ఓ కొలిక్కి తేలేకపోవడంపై ఆ పార్టీ కేడర్ నుంచి విమర్శలు వస్తున్నాయి. రేణుకాచౌదరి వర్గం జిల్లా అధ్యక్ష స్థానం కోసం పలు పేర్లను సూచిస్తుందని రాంరెడ్డి వర్గీయులు భావించారు. కానీ ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎటువంటి ప్రతిపాదనలు చేయకుండా సుధాకర్‌రెడ్డి సూచించిన వెంకటరెడ్డి పేరును తిప్పికొట్టేందుకే ప్రాధాన్యం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఐతం సత్యాన్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలనే విషయమై ఈ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగిందని తెలిసింది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సైతం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా సత్యంను నియమించడమే సబబని వాదన వినిపించినట్లు తెలిసింది. అయితే సత్యం విషయంలోనూ ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎవరి పేరు సూచిస్తారో సాయంత్రంలోగా తెలపాలని, వారిలో ఒకరిని అన్ని కోణాల్లో పరిశీలించి ఎంపిక చేస్తామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. చివరికి ఇలా... రేణుక, వెంకటరెడ్డి వర్గీయులతో పాటు మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్ ఢిల్లీలో విడివిడిగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన జాబితాను దిగ్విజయ్ ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు రాంరెడ్డి పేరును పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించగా, ఐతం సత్యం పేరును రేణుక, వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి మినహా ఇతర నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు సూచించారు. పూర్తిస్థాయి అధ్యక్షున్ని నియమించే వరకు సత్యాన్ని జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడిగా కొనసాగించాలన్న ప్రతిపాదననూ సైతం సదరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరికి నోటీసులు జారీ చేయడంపైనా వాడీవేడిగా చర్చ సాగినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని ఒక వర్గం, పార్టీ అధినేతలపై నోరు పారేసుకోవడం వల్లే నోటీసులు వచ్చాయని మరో వర్గం వాదప్రతివాదనలకు దిగినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో లొల్లి
►పొన్నాల సమక్షంలోనే బాహాబాహీ ►ఫ్లెక్సీలో ఫొటో పెట్టలేదంటూ ఫారూక్ వర్గం రచ్చ ►వేదికపైనే ఫారూక్, జానారెడ్డి వాగ్వాదం ►దుబ్బాకలో కార్యకర్తల సమావేశం రసాభాస సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుబ్బాక రూరల్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి. అయితే ఈసారి దుబ్బాక వేదిక కావడం గమనార్హం. ఐక్యంగా ఉండి అభ్యర్థిని గెలిపించుకుని, సోనియమ్మకు బహుమతిగా ఇద్దామంటూనే సీనియర్ నేతలు వాగ్వాదానికి దిగటం.. కార్యకర్తలు కూడా రెచ్చిపోవడం విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకుడు కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దుర్భాషలాడుతూ బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. గొడవకు కారణమైన బిజ్జ సత్తయ్య అనే కార్యకర్తను సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వేదిక మీదనే జానారెడ్డితో గొడవపడ్డారు. వీరి గొడవను చూస్తూ పొన్నాల లక్ష్మయ్య మిన్నకుండిపోవడం గమనార్హం. వివరాలలోకి వెళ్తే.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంతో సోమవారం దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. స్థానిక నీలకంఠ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ సమావేశం వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ ఫొటో, పేరు లేకపోవడంతో ఆయన వర్గం నాయకులైన బిజ్జ సత్తయ్యతో పాటు మరికొంత మంది సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఫారూక్ హుస్సేన్ ఫొటోను పెట్టకుండా అవమానపరిచారంటూ బిజ్జ సత్తయ్య సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సమావేశం వేదిక రసాభాసగా మారింది. నాయకుల ఎదుటే సమావేశంలో గొడవ జరగడం విశేషం. గొడవ చేస్తున్న ఫారూక్ హుస్సేన్ వర్గాన్ని సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కల్పించుకుని బిజ్జ సత్తయ్యను సమావేశం నుండి బయటకు తీసుకుపోయవారు. కేవలం తన వర్గం వారిని మాత్రమే బయటి పంపడంపై ఎమ్మెల్సీ ఫారూఖ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయన జానారెడ్డి వద్దకు వెళ్లి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయగా, జానారెడ్డి తీవ్రంగానే స్పందించారు, దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చూసి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. పోలీసుల రంగప్రవేశంతో ఇరు వర్గాలు శాంతించాయి. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
నేడు కోదాడలో కాంగ్రెస్ సమావేశం ఇంకా ఏకతాటిపైకి రాని జిల్లా నాయకులు పార్టీ భవిష్యత్‌పై చర్చ ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పెరిగిన వలసలు సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా కాంగ్రె స్ తొలిసారి భేటీ కాబోతోంది. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్, మూడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, మెజారిటీ ఎంపీపీలు వెరసి... జిల్లాలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవులను మినహాయిస్తే, ఒకవిధంగా అధికార టీఆర్ఎస్ కంటే కూడా బలంగానే ఉంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మున్ముందు మరింతగా పెరిగే వీలుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరాన్ని ఆలస్యంగానైనా పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. పార్టీ శ్రేణులనుఓ చోట చేర్చేందుకు శుక్రవారం కోదాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, సమావేశం ఏర్పాటు చేసిన నియోజకవర్గాన్ని బట్టి కొంత ప్రతికూలత ఉంది. జిల్లా కాంగ్రెస్‌లో బలమైన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డి సోదరులకు అటు టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌తో పేచీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జిల్లా కాంగ్రెస్ ఏకతాటిపైన లేనే లేదు. టీసీఎల్పీ నేతగా ఉన్న పార్టీ సీనియర్ కె.జానారెడ్డి సైతం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టీపీసీసీ నాయకత్వం ఇప్పటిదాకా కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదన్న విమర్శ పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే భువనగిరి నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నకిరేకల్ నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కావాల్సినంత బలం ఉన్నా, సభ్యులను కాపాడుకోలేక సూర్యాపేటను కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని మండలాల్లోనూ ఎంపీపీలను ఇదే తరహాలో కోల్పోయారు. చూడడానికి పదవుల రీత్యా బలంగా కనిపిస్తున్నా, టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడంలో మాత్రం ఇక్కడి నాయకులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్‌ప్రెసిడెంట్ ఉత్తమ్, జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు ఇలా ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. మరి ఈ సమావేశంలో పార్టీని బతికించుకునే దిశలో ఏమైనా చర్చిస్తారా..? కేవలం మొక్కుబడిగా కలిసి చేతులు కలిపేసుకుని వెళ్లిపోతారా..? అన్న ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్తల మదిని వేధిస్తున్నాయి. -
ఆధిపత్య కాంగిరేసు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానవర్గంగా కొనసాగుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రధాన కేంద్రంగా తయారయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దిశలో చాలా దూరమే ప్రయాణించారు. ఇద్దరు మంత్రులు, తన వ్యతిరేక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చిన కోమటిరెడ్డి ఆ కార్యక్ర మాన్ని విజయవంతం చేసి, జిల్లా కాంగ్రెస్‌లో తన పట్టును నిరూపించుకున్నారు. ఓ వైపు తెలంగాణ స్థాయి పది జిల్లాల హాకీ టోర్నమెంటు.. మరోవైపు నల్లగొండ పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, కోమటిరెడ్డి అనుకూల నినాదాలతో సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇద్దరు ఎంపీలు సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇలా.. అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన కోమటిరెడ్డి ఒక విధంగా బలప్రదర్శన చేసినట్లే కనిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే భారీగా జనాన్ని సమీకరించి క్లాక్‌టవర్ బహిరంగ సభను విజయవంతం చేశారు. చానాళ్లుగా జిల్లా కాంగ్రెస్‌లో ప్రధానమైన వర్గంగా కొనసాగుతున్న కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యక్రమం ద్వారా కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గానికి స్పష్టమైన సంకేతాన్ని పంపించాలనే ఎత్తుగడ ను పక్కాగా అమలు చేశారు. కోమటిరెడ్డి సభను ఓసారి విశ్లేషిస్తే.. దీని ద్వారా ఏ అంశాలకు ప్రాచుర్యం కల్పించాలని భావించారో ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది.. చివరికంటా కొట్లాడింది తామేనన్న విషయాన్ని మరోమారు జిల్లా ప్రజలకు వివరించడం. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలు, ఉద్యోగ, విద్యార్థి, ఇతర తెలంగాణ వాద సంఘాల్లో తాను చేసిన మంత్రిపదవి త్యాగాన్ని గుర్తు చేయడం, కాంగ్రెస్‌లో పట్టు నిలపుకోవడం. పార్లమెంటులో తెలంగాణ కోసం గళమెత్తడం, అధికార పార్టీ సభ్యుడై ఉండి కూడా సస్పెండ్ అయిన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ పోరాటాన్ని మరో మారు వివరించడం. ఇక, తెలంగాణ ఏర్పాటైతే..కాబోయే సీఎం రేసులో చాలా మంది నాయకులే ఉండడం, వారిలో జిల్లాకు చెందిన సీనీయర్ మంత్రి జానారెడ్డి ఉండడం, అదే రేసులో ఉన్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను సీఎం చేయాల్సిందేనని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఎస్సీ,ఎస్టీల మనసులు చూరగొనడం. రాబోయే తెలంగాణలో ఓ ముఖ్యనేత వర్గంలో తాముంటున్నామన్న సంకేతాన్ని ఇవ్వడం. మంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేయలేక పోయానని, తెలంగాణ పునర్నిర్మాణలో.. నవ నల్లగొండ నిర్మాణానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరడం. మొత్తంగా జిల్లాలో ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన కోమటిరెడ్డి సోదరులు పార్టీలోని ప్రత్యర్థి వర్గ నేతలపైనా త్రీవమైన విమర్శలే చేశారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సీఎం కిరణ్కుమార్రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. నల్లగొండ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి తెర ఎత్తారు. -
గిప్పుడే రావాలా !
‘తెలాంగాణ’ ఇచ్చిన క్రెడిట్‌ను కొట్టేసి ఎన్నికల్లో ఓట్లు కొల్లగొడదామనుకుంటున్న జిల్లా కాంగ్రెస్ పెద్దలకు వర్గాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. వాస్తవాలేమిటో...గెలుపు గుర్రాలేవో తెలుసుకునేందుకు నెలాఖరులో ఏఐసీసీ పరిశీలకులు వస్తున్నారని తెల్సి అదిరిపడుతున్నారు. వారు ఏమీ ఆరా తీస్తారో.. స్వపక్షంలోనే ఉన్న ప్రత్యర్థులు ఎలాంటి బాణాలు వేసి తమ అవకాశాలకు తూట్లు పొడుస్తారోనని తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారు ముందు జాగ్రత్తగా తమ మద్ధతును కూడగట్టుకొని పార్టీ పరిశీలకులను ఆకట్టుకునేందుకు పథక రచన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:జిల్లా కాం గ్రెస్ నెత్తిన పిడుగుపడినట్లైంది. వర్గాల నె గళ్లతో రగులుతున్న నేతలకు పాలమూ రు వాకిటకు ఏఐసీసీ (అఖిల భారతీయ కాం గ్రెస్ కమిటీ) పరిశీలకులు రానున్నారని తె లిసి ఏ శిబిరానికి ఆ శిబిరం అప్రమత్తమవుతోంది. సాధారణ ఎన్నికల నే పథ్యంలో ప రిశీలకులు వచ్చి ఇక్కడి పరి స్థితిని అధ్యయనం చేయనుండడంతో నే తల నోట్లో ప చ్చి వెలక్కాయపడినట్లవుతోందని రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు. యాత్రలతో ఆజ్యం.... యూపీఏ చైర్పర్సన్ సోనియా నిర్ణయం మేరకు జరిగిన తెలంగాణ ప్రకటనను కాం గ్రెస్‌కు అనుకూలంగా మార్చేలా చూడాల ని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఆ ముసుగు లో జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు తమ గ్రూ పులను బలపర్చుకునే ప్రయత్నం చేశారు. తొలుత యాత్రల పేరిట జిల్లాకు చెందిన మంత్రి డి.కె.అరుణ శ్రీకారం చుట్టి తన బ లాన్ని నిరూపించే ప్రయత్నం చేయగా దా న్ని దెబ్బతీసేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మద్ధతుదారులు, జిల్లాకే చెందిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అనుయాయులు కూడా దా నికి మొహం చాటేశారు. ఇక తాజాగా ఎం పీ వీహెచ్ చేపట్టిన రథయాత్ర ఈ గ్రూపుల ను మరింత రాజేసింది. ఆయన కార్యక్రమానికి చిన్నారెడ్డే ప్రధాన భూమిక పోషిం చి నడిపించారు. దీనికి తమకున్న కారణాలు చెప్తూ అరుణ అనుచరులు హాజరు కాలేదు. దీన్ని అధిగమించేందుకు మళ్లీ ఆమె కూడా మరో యాత్రకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడేమయ్యేనో... ఇక ఏఐసీసీ పరిశీలకు క్షేత్రస్థాయికి వెళ్తే ఈ విబేధాలన్నీ బయటపడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నారు.ఏఐసీసీ పరిశీలకుల ఎదుటే ఈ రచ్చ బహిర్గతమయ్యే సూచనలున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే అంతర్గత సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనుంచీ... ఏఐసీసీ పరిశీలకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులతో భేటీ జ రిపి విజ్ఞాపనలు స్వీకరించనున్నారు. వా రు నెలాఖరులోగా జిల్లాలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే లు మంజు, వాసును జిల్లా పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన అసెంబ్లీ, పార్లమెంటు స్థానా ల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉ న్న అభ్యర్థుల నుంచి వారు దరఖాస్తులు స్వీకరిస్తారు. పొరుగునే ఉన్న ర ంగారెడ్డి, నల్గొండతో పాటు తెలంగాణ జిల్లాలో ఇ ప్పటికే పార్టీ పరిశీలకులు కాంగ్రెస్ ఔత్సాహిక అభ్యర్థుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఓ వైపు రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండటం, మ రోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశాల నే పథ్యంలో జిల్లాకు పరిశీలకుల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు పరిశీలకులు జిల్లాకు వచ్చేఅవకాశముందని జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థా నాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా పార్టీ నేతలకు ఏఐసీసీ పరి శీలకులు భేటీ కానున్నారు. -
కాంగ్రెస్‌లో.. రచ్చ.. రచ్చ!
అసలేం జరుగుతోంది..? ఇంటిపోరు ఇంతింతై, ఎందుకిలా రచ్చకెక్కుతోంది..? సిట్టింగులపై ‘కూటములు’ కయ్యానికి కాలుదువ్వుతున్నాయెందుకు..? కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించే వారి మదిలో ఈ ప్రశ్నలు ఉదయించక మానవు.. ఏఐసీసీ పరిశీలకులుగా.. రాహుల్ దూతలుగా జిల్లాకు వస్తున్న నాయకులు చివరకు ఇక్కడ అగ్నిలో ఆజ్యం పోసి వెళుతున్నారు..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: వారం రోజుల వ్యవధిలో రెండు చోట్లా అవే దృశ్యాలు. నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జరిగిన సంఘటనలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘గుంపుల కుమ్ములాటలకు’ అద్దం పట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గుంపుల లొల్లి మరింత ఎక్కువైంది. మెజారిటీ నాయకులు కలిసి ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా జిల్లా కాంగ్రెస్ నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంటు సీట్లనూ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ స్థానాలూ దక్కాయి. ఇంకేం జిల్లా కాంగ్రెస్‌కు తిరుగులేదన్నంత బలం కనిపించింది. కానీ, తెలంగాణ రాష్ట్రం కోసమంటూ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో అసలు రాజకీయం మొదలైంది. ఆయన జిల్లా అంతా విస్తరించి అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ వర్గం తయారు చేసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం బలంగా తన గొంతు విని పించిన ఎంపీ రాజగోపాల్‌రెడ్డితోపాటు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు కోమటిరెడ్డికి అండగా నిలిచారు. జిల్లా కోటాలో ఖాళీ అయిన బెర్తు కోసం సీనియర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అనంతర పరిణామాలతో జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా రెండు గుంపులు స్పష్టంగా కనిపించాయి. సీఎం... పాచిక జిల్లా కాంగ్రెస్‌ను తన గుప్పిట పెట్టుకునేం దుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొందరు ఎమ్మెల్యేలను బాగానే దువ్వారు. ఆయన అండతో కొందరు నాయకులు కోమటిరెడ్డి సోదరులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఏకంగా సీఎంతో తన నియోజకవర్గంలో కార్యక్రమం ఏర్పాటు చేయించి, పలు పనుల కోసం నిధులు ప్రకటింపజేసుకున్నారు. అప్పటివరకు తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించిన ఆయన చివరకు సీఎం సభలో కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయలేనంతగా ఆత్మరక్షణలో పడిపోయారు. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాక, సీఎం సమైక్యవాదాన్ని భుజాన వేసుకోవడంతో ఈ నాయకులంతా సీఎంకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, కోమటిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పావులు కదపడం మాత్రం మానలేదు. చివరకు సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డికి, కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే మండేంత స్థాయికి చేరాయి. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరి మితమైనట్లే కనిపిస్తోంది. కానీ, దామోదర్‌రెడ్డి తన తనయుడి రాజకీయ అరంగేట్రానికి భువనగిరి పార్లమెంటు స్థానమే సరైన వేది కని భావించడంతోనే గొడవంతా వచ్చిపడిం దన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న దామోదర్ రెడ్డి, తన పాత నియోజకవర్గం తుంగతుర్తిపైనా ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్రయత్నిం చారు. కానీ, ఈ సెగ్మెంటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడంతో ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఇక్కడ తనవర్గాన్ని తయారు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలే ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మధ్య విభేదాలకు ప్రధాన కారణమయ్యాయన్న అభిప్రా యం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనను కాదనడానికి, తనకు వ్యతిరేకంగా కూటమిని తయారు చేసి, తప్పుడు ప్రచారం చేయడానికి దామోదర్‌రెడ్డి పావులు కదపడంతో రాజగోపాల్‌రెడ్డి సైతం ఒకింత తీవ్రమైన ఆరోపణలే చేశారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చింతల వెం కటేశ్వర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతివిద్యాసాగర్, మరికొందరు నాయకులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి తన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డికి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. దూతల... పనేంటి..? రాహుల్ దూతలుగా వస్తున్న ఏఐసీసీ పరిశీల కులు సైతం స్థానిక రాజకీయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా ప్రస్తావించాల్సిన అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, తమ పని తీరు గురించి వీరికి వివరించాల్సి ఉండడం, ఎవరైనా టికెట్ కోరుతూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల అంతా గందరగోళంగా మారుతోంది. రాహుల్ దూతల ముందు ‘బాగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకునిగా’ ముద్ర వేసేందుకు వ్యూహాత్మకంగా గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండలో ఎమ్మెల్యే వెంకటరెడ్డికి వ్యతిరేకంగా, భువనగిరిలో ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇలా ఓ గ్రూపు నేతలు పక్కా ప్లానింగ్‌తోనే గొడవ సృష్టించారని చెబుతున్నారు. అసలు అభిప్రాయ సేకరణ చేస్తున్నారా..? పనితీ రును మదింపు చేస్తున్నారా..? టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారా..? అన్న స్పష్టత అధినాయకత్వం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో వరసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేను పక్కన పెట్టి తమకు టికెట్ కేటాయిం చాలని కోరుతున్న వారు తయారవుతున్నారని ఉదహరిస్తున్నారు. ‘నల్లగొండ, భువనగిరిలో జరిగిన సంఘటనలను గమనిస్తే కాం గ్రెస్‌లోని ఒకవర్గం కోమటిరెడ్డి సోదరులను లక్ష్యంగా చేసుకుని గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయమే బలపడుతోంది...’ అని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, అక్కడి ప్రజలతో సిట్టింగులకు ఉన్న సంబంధాలు, పట్టు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పరిశీలకుల ముందు గొడవలు చేస్తే నిర్ణయాలు జరిపోతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ప్లస్సా.. మైనస్సా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పదవీత్యాగం మంత్రి శ్రీధర్‌బాబుకు కలిసొస్తుందా? పాలపొంగులా ఈ ప్రజాదరణ చల్లారుతుందా? అన్న సందేహాలు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను పట్టిపీడిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఆయనకు ప్లస్సా... మైనస్సా.. అనేది పార్టీ నేతలందరిలో చర్చనీయాంశంగా మారింది. రెండురోజులపాటు రాష్ట్రమంతటా ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం మూడోరోజు నుంచి చల్లారింది. సంఘీభావం ప్రకటించిన తెలంగాణప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ ముసాయిదా బిల్లుపై చర్చలో మునిగిపోవడంతో రాజీనామా మరుగునపడింది. శ్రీధర్‌బాబు సీఎంకు సన్నిహితుడు కావటం.. రాజీనామా లేఖను సీఎంకే ఇవ్వటంతో... ఇదంతా వట్టి డ్రామా అనే ప్రచారం తోడైంది. మరోవైపు ఆ వేడి తగ్గకుండా మంత్రి వర్గీయులు, అనుచరులు చేపట్టిన వరుస ఆందోళనలు ఇక్కడికే పరిమితమయ్యాయి. కనీసం మంత్రికి మద్దతుగా జిల్లాలోని ఆయన వర్గీయులు నామినేటెడ్ పదవులను వదులుకోవటానికి కూడా ఇష్టపడకపోవటంతో శ్రీధర్‌బాబు ఒంటరయ్యారు. దీంతో ఆయనకు రాజీనామాతో పొలిటికల్ మైలేజీ వచ్చిం దా... ఇప్పటిదాకా ఉన్న ఇమేజీ తగ్గిందా... పెరిగిందా.. అనే విశ్లేషణలు జోరు గా సాగుతున్నాయి. ఇంత కాలం సీఎంకు సన్నిహితుని గా... తెలంగాణ ప్రాంత మంత్రుల్లో కీలక నేతగా శ్రీధర్‌బాబు జిల్లాలో తిరుగులేని స్థా నాన్ని సొంతం చేసుకున్నారు. ఒక దశలో తె లంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఆయన పేరును అధిష్టానం పరిశీలనకు తీసుకుంద నే ప్రచారం జరిగింది. రాబోయే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతాడనే భవిష్యత్తు రాజకీయ విశ్లేషణలు గుప్పుమన్నాయి. ఒకవైపు ఆయన ఇమేజీ పెరుగుతుంటే... జిల్లాలో ఆయనకున్న మంచి పేరు కాస్తా మసకబారింది. గత ఎన్నికలప్పటినుంచీ ఆయనకు సొంత సెగ్మెంట్లో ఎదురుగాలి వీస్తూనే ఉంది. అన్నింటా పైరవీలు, అక్రమ దందాలు, పరిపాలనా వ్యవహారా ల్లో మితిమీరిన జోక్యం, సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటా అనుచరుల పెత్తనం కొనసాగింది. మంత్రి సహకారంతోనే జిల్లా లో ఇసుక, గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోం దని ఇటీవల మావోయిస్టు పార్టీ బహిరంగం గా హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం. జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మం థనిలో మంత్రి తన అనుచరుడిని పోటీకి దింపితే.. రాజకీయ ప్రత్యర్థి పుట్ట మధు భార్య శైలజ భారీ మెజారిటీతో గెలుపొం దారు. తనకు ప్రత్యర్థులు లేకుండా మంత్రి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రజల ఆదరణ చూరగొనేందుకు అభివృద్ధి మం త్రం జపించారు. తెలంగాణలోనే ఏ నియోజకవర్గంలో లేనివిధంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులన్నీ సొం త సెగ్మెంట్‌కు మళ్లించారు. ఈలో గా తనకు వ్యతిరేకంగా కరపత్రాలు వేసిన ఓయూ విద్యార్థి జేఏసీ నేత శ్రీరాంను పోలీసులు అరెస్టు చేయటం.. ఆయన భార్య ఫిర్యాదు తో హైకోర్టు నోటీసులు జారీ చేయటం మం త్రిని మరో వివాదంలోకి లాగింది. దీంతో స్థానికంగా మంత్రి వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు చేరువయ్యేందుకే మంత్రి రాజీనామాకు సిద్ధపడ్డారనే వాదనలున్నాయి. తన కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని అనుకూలం గా మలుచుకునేందుకు మంథనితోపాటు జిల్లా కేంద్రంలో వరుస ఆందోళనలకు తెరలేపారు. కానీ.. అనుకున్నంతగా స్పందన రాకపోవటంతో కరీంనగర్లో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. తెలంగాణ కోసం రాజీ నామా చేసి తొలిసారి జిల్లాకు వస్తున్నారని శనిగరం వద్ద ఘనస్వాగతం పలికి.. అక్కణ్నుంచి కరీంనగర్‌లోని డీసీసీ ఆఫీసు వరకు భారీ ఊరేగింపు నిర్వహించేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అనుకున్నంత మైలేజీ సాధించాలని మంత్రి అనుచరగణం ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైంది. సోనియాకు ద్రోహం చేసిన సీఎం రాయికల్ : సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎం పీఠంపై కూర్చు న్న కిరణ్ ఆ తల్లికే ద్రోహం చేసిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడని మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శిం చారు. సీఎం అధికారకాంక్షతోనే అధిష్టానా న్ని ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి రావాలంటే సోనియాగాంధీ సీమాంధ్రులకే మద్దతు ఇచ్చేవారని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలతో ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు. సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణపై మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహానేతగా, తెలంగాణ దేవతగా సోనియా చరిత్రలో నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. -
నువ్వా.. నేనా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్‌లో సరి కొత్త వర్గపోరుకు తెరలేచింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవి వేదికగా రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పదవీ కాలం ముగియకున్నా రషీద్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించడంపైనా.. తన వర్గీయుడైన బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి పదవి కట్టబెట్టడంలో శైలజానాథ్ వ్యవహరించిన తీరుపై మంత్రి రఘువీరా, అనంత వెంకట్రామిరెడ్డి మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ రఘువీరా వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో రఘువీరా వర్గానికి చెక్ పెట్టడం కోసం సీఎం కిరణ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ను దగ్గరకు తీశారు. శైలజానాథ్ మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రషీద్ అహ్మద్ ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 18 నాటికి రషీద్ అహ్మద్ పదవీకాలం ముగిసింది. అప్పట్లో తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలన్న రషీద్ అహ్మద్ అభ్యర్థనను ప్రభుత్వం మన్నించింది. రషీద్ అహ్మద్ పదవీకాలం 2014 జనవరి 18తో ముగియనుంది. కానీ.. మంత్రి శైలజానాథ్ ఇవేవీ పట్టించుకోలేదు. తన శాఖ పరిధిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి కట్టబెట్టాలని సీఎం కిరణ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం.. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి రఘువీరా, ఎంపీ అనంత.. సీఎం కిరణ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రషీద్ అహ్మద్ పదవీకాలం ముగియకున్నా ఎందుకు తొలగించారంటూ సీఎంను నిలదీశారు. ఇది పసిగట్టిన మంత్రి శైలజానాథ్ డిసెంబర్ 21నే తన నివాసంలోనే బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డితో రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తమ మాటలు లెక్క చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రషీద్ అహ్మద్‌కు రఘువీరా, అనంత సూచించారు. జిల్లాలో కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 26 మంది సజీవ దహనమైన రోజే.. అనంతపురంలో ఘనంగా బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సభ నిర్వహించారు. రఘువీరా సూచన మేరకు రషీద్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ కాలం ముగిసే వరకూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో రషీద్ అహ్మద్ కొనసాగేలా చూడాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తానని రషీద్ అహ్మద్ ‘సాక్షి’కి తెలిపారు. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో క్విడ్‌ప్రోకో జరిగిందని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. అనంతపురం మున్సిపాల్టీ పరిధిలో వివాదంలో ఉన్న సర్వే నెంబరు 342లోని 25.50 సెంట్ల భూమిని మంత్రి శైలజానాథ్‌కు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ముట్టజెప్పిన తర్వాతనే.. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి రఘువీరా వర్గం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
అది నాదే.. ఇదీ నాదే
పదవంటే ఎవరికి చేదు...? ఈ నిజం తెలిసి నందుకే కాబోలు, కొందరు కాంగ్రెస్ నేతలు పదవులపై తెగ ఆశపెట్టుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో ‘నాకో టికెట్..మా ఇంట్లో వారికి మరో టికెట్’ అన్న ధోరణితో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో ఎన్నికల్లో బాగా కలిసి వస్తుందన్న ఆశతో.. అపుడే తొందరపడి పోతున్నారు..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: నిజం నిష్టూరంగా ఉంటుంది కానీ.. జిల్లా కాంగ్రెస్‌లో నాయకులు ఎవరికి వారుగా గిరిగీసుకునే ఉన్నారు. ఒక్కో సీనియర్ నాయకుడు తన సొంత నియోజకవర్గంతో పాటు, పక్క నియోజకవర్గంపై నజర్ పెట్టినోళ్లే. దీనికి భిన్నంగా కోమటిరెడ్డి సోదరులు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మాత్రం జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో తమ సొంతవర్గాన్ని తయారు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా ఇతర నాయకులంతా జట్టుకట్టినట్టు కనిపిస్తున్నా, ‘ఎవరికి వారు..’ అన్న రీతిలోనే ఉన్నారు. ఎవరి ఆశలు వారికున్నాయి. సీనియర్ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, మరో సీనియర్ నాయకుడు, సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రానికి ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతారన్న వార్త ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తన కూతురు స్రవంతిని మునుగోడు నుంచి పోటికి దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇక, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య తాను ఈసారి భువనగిరి ఎంపీ టికెట్‌ను తీసుకుని, తన కోడలు పొన్నాల వైశాలిని జనగామ నుంచి పోటీకి పెట్టాలని పావులు కదుపుతున్నారని సమాచారం. అంటే జిల్లా నేతలు, వారి వారసులు కలిసి ఆరు సీట్లు తీసేసుకుందామన్న వ్యూహంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జునసాగర్, మిర్యాలగూడలలో చెరో చోటు నుంచి పోటీ చేయాలన్నది మొదటి ఆలోచన. అయితే, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈసారి తాను మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పడంతో ఈ నాయకుల మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. ఇదే కనుక కార్యరూపం దాలిస్తే, జానారెడ్డి, ఆయన తనయుడు ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ సీటుకు పోటీపడేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మంత్రి ఉత్తమ్ దంపతులు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి చెరొక చోటు నుంచి పోటీకి పడాలన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారమూ ఉంది. ఇక, దామోదర్‌రెడ్డి తన సిట్టింగ్ స్థానం నుంచి, ఆయన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డిని భువనగిరి ఎంపీ స్థానానికి పోటీ పెట్టాలని నాలుగైదు నెలల కిందటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏడాడి కిందటే రాజ్యసభ సీటు దక్కించుకున్న పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తన కూతురు స్రవంతిని ఎమ్మెల్యే చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలా మొత్తంగా నేతలే తమ వారసులకోసం సీట్లు తీసేసుకునే ప్రయత్నాల్లో ఉంటే, ఇక మిగిలిన నేతల పరిస్థితి ఏమిటన్న విషయం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు, పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అంటే మిగిలిన తొమ్మిది స్థానాలే. అందులోనూ తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు స్థానంలో తన అనుచురునికే అవకాశం ఇప్పించుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పైచేయి కోసం.. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం మరోవైపు ఈ నేతలందరికీ చెక్ పెట్టేందుకు, తమ వర్గీయులకు టికెట్లు ఇప్పించుకుని పైచేయి సాధించేందుకు కోమటిరెడ్డి సోదరులు ముందు నుంచీ ఎత్తుగడలు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అవసరాలకు ఆదుకుంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచుకున్నారు. గత ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను టికెట్ ఇప్పించుకున్న వారిని గెలిపించారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి భువనగిరి ఎంపీ, మరో అనుచరుడు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, ఇతర నేతలు టికెట్ ఇప్పించిన చోట పార్టీకి అపజయమే మిగిలింది. ఇలా, తుంగతుర్తి, కోదాడ, భువనగిరి టీడీపీ వశమయ్యాయి. ఇక, మునుగోడులో పాల్వాయి ఓటమి పాలయ్యారు. జానారెడ్డి కనుసన్నల్లో ఉండే మిర్యాలగూడలోనూ ఓడిపోయారు. ఈ కారణాలను చూపి, ఈసారి ఈ వర్గం ప్రయత్నాలు అడ్డుకోవాలన్న వ్యూహంతో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు. ‘‘ఎవరికి వారు, తమ వారసులను పోటీకి పెట్టాలని చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని, బీసీ వర్గాలకు చెందిన నాయకుల గురించి ఎవరూ ఆలోచించరా..? నా సిట్టింగ్ స్థానంలో తన తనయుడికి టికెట్ ఇప్పించుకోవాలని దామోదర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ల పాటు ఎన్నో పదవులు అనుభవించి, ఇపుడూ రాజ్యసభ సీటు దక్కించుకున్న పాల్వాయికి ఇంకా ఆశ ఎందుకు ఇక్కడ బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే, అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవాలి. దీనికోసం అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసే అభ్యర్థులు, సమీకరణలూ కీలకమే. తుంగతుర్తి, మునుగోడు, భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో ప్రజాధరణ ఉన్న వారిని పోటీకి పెడితేనే సత్ఫలితాలు వస్తాయి..’’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.