సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పదవీత్యాగం మంత్రి శ్రీధర్‌బాబుకు కలిసొస్తుందా? పాలపొంగులా ఈ ప్రజాదరణ చల్లారుతుందా? అన్న సందేహాలు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను పట్టిపీడిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఆయనకు ప్లస్సా... మైనస్సా.. అనేది పార్టీ నేతలందరిలో చర్చనీయాంశంగా మారింది. రెండురోజులపాటు రాష్ట్రమంతటా ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం మూడోరోజు నుంచి చల్లారింది.
సంఘీభావం ప్రకటించిన తెలంగాణప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ ముసాయిదా బిల్లుపై చర్చలో మునిగిపోవడంతో రాజీనామా మరుగునపడింది. శ్రీధర్‌బాబు సీఎంకు సన్నిహితుడు కావటం.. రాజీనామా లేఖను సీఎంకే ఇవ్వటంతో... ఇదంతా వట్టి డ్రామా అనే ప్రచారం తోడైంది. మరోవైపు ఆ వేడి తగ్గకుండా మంత్రి వర్గీయులు, అనుచరులు చేపట్టిన వరుస ఆందోళనలు ఇక్కడికే పరిమితమయ్యాయి. కనీసం మంత్రికి మద్దతుగా జిల్లాలోని ఆయన వర్గీయులు నామినేటెడ్ పదవులను వదులుకోవటానికి కూడా ఇష్టపడకపోవటంతో శ్రీధర్‌బాబు ఒంటరయ్యారు.
దీంతో ఆయనకు రాజీనామాతో పొలిటికల్ మైలేజీ వచ్చిం దా... ఇప్పటిదాకా ఉన్న ఇమేజీ తగ్గిందా... పెరిగిందా.. అనే విశ్లేషణలు జోరు గా సాగుతున్నాయి. ఇంత కాలం సీఎంకు సన్నిహితుని గా... తెలంగాణ ప్రాంత మంత్రుల్లో కీలక నేతగా శ్రీధర్‌బాబు జిల్లాలో తిరుగులేని స్థా నాన్ని సొంతం చేసుకున్నారు. ఒక దశలో తె లంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఆయన పేరును అధిష్టానం పరిశీలనకు తీసుకుంద నే ప్రచారం జరిగింది. రాబోయే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతాడనే భవిష్యత్తు రాజకీయ విశ్లేషణలు గుప్పుమన్నాయి.
ఒకవైపు ఆయన ఇమేజీ పెరుగుతుంటే... జిల్లాలో ఆయనకున్న మంచి పేరు కాస్తా మసకబారింది. గత ఎన్నికలప్పటినుంచీ ఆయనకు సొంత సెగ్మెంట్లో ఎదురుగాలి వీస్తూనే ఉంది. అన్నింటా పైరవీలు, అక్రమ దందాలు, పరిపాలనా వ్యవహారా ల్లో మితిమీరిన జోక్యం, సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటా అనుచరుల పెత్తనం కొనసాగింది. మంత్రి సహకారంతోనే జిల్లా లో ఇసుక, గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోం దని ఇటీవల మావోయిస్టు పార్టీ బహిరంగం గా హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం. జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మం థనిలో మంత్రి తన అనుచరుడిని పోటీకి దింపితే.. రాజకీయ ప్రత్యర్థి పుట్ట మధు భార్య శైలజ భారీ మెజారిటీతో గెలుపొం దారు. తనకు ప్రత్యర్థులు లేకుండా మంత్రి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రజల ఆదరణ చూరగొనేందుకు అభివృద్ధి మం త్రం జపించారు. తెలంగాణలోనే ఏ నియోజకవర్గంలో లేనివిధంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులన్నీ సొం త సెగ్మెంట్‌కు మళ్లించారు. ఈలో గా తనకు వ్యతిరేకంగా కరపత్రాలు వేసిన ఓయూ విద్యార్థి జేఏసీ నేత శ్రీరాంను పోలీసులు అరెస్టు చేయటం.. ఆయన భార్య ఫిర్యాదు తో హైకోర్టు నోటీసులు జారీ చేయటం మం త్రిని మరో వివాదంలోకి లాగింది. దీంతో స్థానికంగా మంత్రి వార్తల్లోకెక్కారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు చేరువయ్యేందుకే మంత్రి రాజీనామాకు సిద్ధపడ్డారనే వాదనలున్నాయి. తన కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని అనుకూలం గా మలుచుకునేందుకు మంథనితోపాటు జిల్లా కేంద్రంలో వరుస ఆందోళనలకు తెరలేపారు. కానీ.. అనుకున్నంతగా స్పందన రాకపోవటంతో కరీంనగర్‌లో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. తెలంగాణ కోసం రాజీ నామా చేసి తొలిసారి జిల్లాకు వస్తున్నారని శనిగరం వద్ద ఘనస్వాగతం పలికి.. అక్కణ్నుంచి కరీంనగర్‌లోని డీసీసీ ఆఫీసు వరకు భారీ ఊరేగింపు నిర్వహించేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అనుకున్నంత మైలేజీ సాధించాలని మంత్రి అనుచరగణం ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైంది.
సోనియాకు ద్రోహం చేసిన సీఎం
రాయికల్ : సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎం పీఠంపై కూర్చు న్న కిరణ్ ఆ తల్లికే ద్రోహం చేసిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడని మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శిం చారు. సీఎం అధికారకాంక్షతోనే అధిష్టానా న్ని ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి రావాలంటే సోనియాగాంధీ సీమాంధ్రులకే మద్దతు ఇచ్చేవారని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలతో ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు. సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణపై మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహానేతగా, తెలంగాణ దేవతగా సోనియా చరిత్రలో నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్లస్సా.. మైనస్సా!
Published Sat, Jan 11 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement