chevella parliamentary constituency
-
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
ఓటమితో కుంగిపోవద్దు.. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. qసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని, ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆరెస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లని.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని పార్టీ శ్రేణులకు రంజిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. -
చేవెళ్లలో.. హోరాహోరీ
చేవెళ్ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కె.శ్రీకాంత్‌రావు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధించాలన్నా.. నగర శివార్లలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల ఓటర్లున్నారు. బరిలో కొత్త ముఖాలు కాంగ్రెస్ నుంచి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, తెలుగుదేశం నుంచి మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి మనువడు కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ పక్షాన కొండా రాఘవరెడ్డి రంగంలో ఉన్నారు. వారంతా మొదటిసారి పోటీ చేస్తున్న వారే. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులపైనే వీరు ఆధారపడి ఉన్నారు. ప్రధానంగా తాండూరు, రాజేంద్రనగర్‌లలో మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. అసెంబ్లీ అభ్యర్థులదే భారం ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఏడుగురిలో సబితా ఇంద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం తో మిగిలిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే మినహా ఐదుగురు తీవ్ర పోటీ ఎదుర్కొం టున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు హరీశ్వర్‌రెడ్డి(పరిగి), మహేందర్‌రెడ్డి(తాండూరు), కె .ఎస్.రత్నం(చేవేళ్ల), వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, శేరిలిం గంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావంతో పార్లమెంట్‌కు క్రాస్ ఓటింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఎంీపీ అభ్యర్థిని విస్మరించి తమ వరకు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. సెగ్మెంట్ల వారీగా బలాబలాలు పరిగి సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి రాంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి హరీశ్వర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే వరుస విజయాలు సాధించిన హరీశ్వర్‌రెడ్డిపై ఈసారి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కమతం రాంరెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీనితో కాంగ్రెస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి సైతం ప్రచారంలో దీటుగా వెళ్తున్నారు. - తాండూరులో మహేందర్‌రెడ్డి(టీడీపీ), నారాయణరావు(కాంగ్రెస్), నరేష్(టీడీపీ), ప్రభుకుమార్(వైఎస్సార్సీపీ) బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రభుకుమార్ మిగిలిన అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. - వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి సం జీవరావు, వైఎస్సార్సీపీ నుంచి క్రాంతికుమార్, బీజేపీ నుంచి పుష్పలీల పోటీ చేస్తున్నారు. - చేవేళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య రంగంలో ఉండగా, టీడీపీ నుంచి వెంకటేష్ రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంది. - రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్(టీడీపీ), మజ్లిస్, జ్ఞానేశ్వర్(కాంగ్రెస్), ముజ్తాబా అహ్మద్(వైఎస్సార్సీపీ) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం మజ్లిస్, టీడీపీ మధ్యనే నెలకొంది. - శేరిలింగంపల్లిలో వైఎస్సార్సీపీ నుంచి ముక్కా రూపానందరెడ్డి(వైస్సార్సీపీ), భిక్షపతియాదవ్(కాంగ్రెస్),అరికెపూడి గాంధీ(తెలుగుదేశం) బరిలో ఉన్నారు. - మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ నుంచి తీగెల కష్ణారెడ్డి, సీపీఐ నుంచి అజీజ్‌పాషా మధ్య పోటీ నెలకొంది. -
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిశీలకుడిగా కోలివాడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... తాజాగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి, ఇతర పార్టీలతో పొత్తులు, సాధ్యాసాధ్యాలపై గత మూడు రోజులుగా పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి హైకమాండ్ పరిశీలకుడిని నియమించింది. కర్ణాటక రాష్ట్రం రాణీబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్‌ను దూతగా పంపింది. సంక్రాంతి అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ సమావేశాలుండడం... శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 23 తర్వాత చేవెళ్ల పార్లమెంటరీ సీటు పరిధిలోని నేతలతో భేటీకి తేదీలు ఖరార య్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుపై పలువురు కన్నేశారు. ఈ నేపథ్యంలో పరిశీ లకుడి ముందు ఆశావహులు బలప్రదర్శన జరిపే వీలుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకూ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.