ke krishna murti
-
వెంకన్నను దర్శించుకున్నజేపీ నడ్డా
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి వచ్చిన వారికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. -
మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ
మహనంది: కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాతి నంది విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన కేఈ దంపతులకు ఈవో చంద్రశేఖర్రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు కేఈ దంపతులకు ఆశీర్వచనం చేశారు.