కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కీసరగుట్ట నుంచి వన్నిగూడ వైపు దట్టమైన పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు, చర్లపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. కీసరగుట్ట రెసిడెన్షియల్ పాఠశాల వెనక వైపు నుంచి టీటీడీ వేద పాఠశాల వెనుక వైపు వరకు ఉన్న కీసరగుట్ట అటవీప్రాంతంలో సోమవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
50 ఎకరాల వరకు వ్యాపించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు నీలగిరి చెట్లను పెద్ద ఎత్తున పెంచారు. ఈ మంటలకు చాలా వరకు నీలగిరి చెట్లు దగ్ధమయ్యాయి. గతంలోనూ రెండు సార్లు ఈ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.
వేసవికి ముందే ఫారెస్టు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫారెస్టు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్లపల్లి ఫైర్‌స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అటవీ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది