kenal
-
కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణమ్మ జలాలు
-
వాగులో యువకుడి గల్లంతు
మాచర్ల: వాగును దాటే ప్రయత్నంలో ఓ యువకుడు నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. మాచర్లలోని అజాద్ నగర్ వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు..పట్టణంలోని 24వ వార్డు నివాసి తంగెళ్ల నరేష్‌రాజు(24) తన స్నేహితులైన బొల్లేపల్లి గోపిరాజు, దార్ల యేసుదాసులతో కలసి అమరావతి వెళ్దామని బయలుదేరాడు. బస్సులో వెళ్దామనుకుని అజాద్ నగర్ వద్ద చంద్రవంక వాగు వద్ద చప్టా దాటే ప్రయత్నంచేశారు. మొదట నరేష్‌రాజు చప్టా దాటాలని ప్రయత్నించాడు. ఇటీవలి భారీ వర్షాల వల్ల చప్టాకు చెందిన మట్టికట్ట కొట్టుకుపోయింది. గుంటలు పడి నీరు ఉధతంగా ప్రవహిస్తోంది. నరేష్‌రాజు చప్టా మీదకు దిగగానే కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది చూసి భయపడిన గోపిరాజు, యేసుదాసు వెనుదిరిగి వెళ్లి తెలిసిన వారికి సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. పట్టణ సీఐ సత్యకైలాష్నా«ద్, ఎసై ్సలు సింగయ్య, జయకుమార్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీధర్ గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను, మత్య్సకారులను పిలిపించి వెతికించారు. అయినా నరేష్ ఆచూకీ లభించలేదు. వ్యాపారం చేస్తూ జీవనం సాగించే తంగెళ్ల నారాయణరాజు, పద్మావతీలకు ఇద్దరు కుమారులుండగా వారిలో చిన్నకుమారుడు పవన్(22) రెండు నెలల కిందట పోలియోతో పాటు అనారోగ్యంతో మతిచెందాడు. ఈ సంఘటనను మరువక ముందే పెద్ద కుమారుడైన నరేష్‌రాజు గల్లంతుకావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
కాల్వలో పడి విద్యార్థిని మృతి
తెనాలి రూరల్ (గుంటూరు) : కాల్వలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన దామర్ల భవాని లక్ష్మి (16) పట్టణ టీజే కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బుధవారం కళాశాలకు వెళ్లిన ఆమె రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కనబడడం లేదంటూ తండ్రి భరతరావు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం జగ్గడిగుంటపాలెం సమీపంలోని తూర్పు కాలువలో విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నదిలోమునిగి గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయపురిసౌత్(గుంటూరు): స్నానానికి నదిలో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణవేణి ఘాట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వృద్ధుడు(85) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కృష్ణవేణి ఘాట్‌కు కొద్దిదూరంలో నదిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ లోతైన ప్రదేశంలోకి జారిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన సమీపంలోని కొందరు మత్స్యకారులు హుటాహుటిన వృద్ధుడిని నీటిలోంచి ఒడ్డుకు చేర్చారు. కొనప్రాణంతో ఉన్న వృద్ధుడు ఆ తరువాత కొద్దిసేపటికే మృతి చెందాడు. మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుడి జేబులో మాచర్ల నుంచి హిల్‌కాలనీకి తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్ ఉంది. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, తెల్ల పంచె ఉన్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురి సౌత్ ఎస్ఐ వై.కోటేశ్వరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.