kesava reddy
-
ప్రత్యర్థులను మట్టుబెట్టడమే 'పరిటాల' పని
ఆత్మకూరు: ‘గత 30 ఏళ్లుగా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎవరితో అయినా తగాదాలు ఉంటే వాళ్లను చేరదీసుకొని రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయించడమన్నది పరిటాల కుటుంబానికి వెన్నతోపెట్టిన విద్య.. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబమని సినిమాలే తీశారు. గ్రామాల్లో ఆధిపత్యం కోసం వర్గ పోరు రాజేసి రాజకీయ హత్యలు చేయిస్తున్నారు. ప్రస్తుతం మాకు మండలంలో పట్టు తగ్గుతుందన్న భయంతో కేశవరెడ్డిని హతమార్చారు. మండలంలో టీడీపీ ఇన్చార్జ్ బాలాజీకి తెలియకుండా ఏ పని జరగదు. కనీసం పింఛన్, లోన్, ఇళ్లు వంటి ఏ పనులూ జరగవు. కానీ ఈ హత్య బాలాజీకి తెలియకుండా జరిగిందంటే ప్రజలు నమ్ముతారా?’ అని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆత్మకూరు మండల సీనియర్ నాయకులు కేశవరెడ్డి(67)బుధవారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం కేశవరెడ్డి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ప్రకాష్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కేశవరెడ్డి ఒకసారి సర్పంచుగా, మరోసారి సింగల్‌విండో ప్రసిడెంట్‌గా ఉండి మండల ప్రజలకు ఎనలేని సేవలను అందించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక బలమైన నాయకుడు, అందరికీ అండగా ఉన్న వ్యక్తిని హత్య గావించడం వెనుక రాజకీయ కోణం ఉందని కేశవరెడ్డి బంధువులు, అభిమానులు చెబుతున్నారన్నారు. మంత్రి సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్చార్జ్ బాలాజీ హస్తంతోనే కేశవరెడ్డితో విభేదాలు ఉన్న నరసింహారెడ్డి చేత హత్య చేయించారని ఆరోపించారు. గతంలో ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య వెనుక మంత్రి కుటుంబం ప్రోత్సాహం ఉందని, ఆ విషయం ప్రసాద్‌రెడ్డి సోదరుడు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కందుకూరు శివారెడ్డి, తగరకుంట కొండారెడ్డి హత్య వెనుక మంత్రి హస్తం ఉందని మృతుల బంధువులు ఆరోపించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చెప్పుచేతుల్లో అధికార యంత్రాంగం నడుస్తోందని, ఎనిమిదేళ్లుగా ఎలాంటి సమస్యలు లేవని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరులో ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రోజే ఈ హత్య జరిగినా ఆయన స్పందించకపొవడం హత్య రాజకీయాలకు పోత్సహించేలా ఉందని ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేశవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ప్రజాదరణ పొందిన వ్యక్తి కేశవరెడ్డి కేశవరెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేక ఈ హత్య చేయించారు. కేవలం టీడీపీకి అడ్డుగా ఉంటాడని ఈ హత్య చేసి వైఎస్సార్సీపీకి మంచి నాయకుడిని దూరం చేశారు. -తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఇది ప్రభుత్వ హత్యే ఎప్పటికప్పుడు సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కేశవరెడ్డిది ప్రభుత్వ హత్యగానే భావించాలి. హత్యలు చేయడం ద్వారా అందర్ని భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం మూర్ఖత్వం. బాధితులు తప్పు చేసిన వారు పేర్ల ఫిర్యాదులో తెలిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం అన్యాయం.’ -వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ మంత్రి సునీతకు ప్రకాష్‌రెడ్డి ప్రశ్నలు అనంతపురం: కేశవరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం మంత్రి పరిటాల సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. నాలుగేళ్లలో జరిగిన హత్యలు, ఇతర ఘటనలపై ఆయన మంత్రిని నిలదీశారు. ప్రశ్నల పర్వం ఇలా.. - కేశవరెడ్డి హత్య కేసులో అధికారులకు ఆదేశిలిచ్చామని మంత్రి చెబుతున్నారు. బహుశా ఆమె ఆదేశాలతోనే హతుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు తొలగించాలంటూ పోలీసులు మృతుడి బంధువులపై ఒత్తిడి తేలేదా?. ప్రజలు తిరగబడితే పోస్టుమార్టం చేయించారు. ఇదేనేమో మంత్రి గారి ఒత్తిడి. - స్వయంగా హతుడు కేశవరెడ్డి భార్య తన ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు పెడితే ఈరోజు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు? ఇదేనా మంత్రి ఆదేశం. మీ తమ్ముడిని తప్పించేందుకే సాయంత్రం ఆరు గంటలకే ముద్దాయిని సరెండర్ చేయించారు. అతడిచ్చిన వాంగ్మూలం మేరకే బాలాజీ పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా చేశామంటూ క్రియేట్ చేయడం వాస్తవం కాదా? - అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీలో ధనుంజయయాదవ్కి ఈడిగ వెంకటేష్ మధ్య వ్యక్తిగత కక్షలే. మీ దగ్గర వెంకటేష్ ఉండి, మావద్ద‡ ధనుంజయయాదవ్ ఉన్నంత వరకు అతడిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. ధనుంజయయాదవ్ భయపడి మీ దగ్గరికి వస్తే ఇప్పుడు వారిద్దరూ ఒకే బండిపై తిరగడం లేదా? - ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, ఉప్పెర శ్రీనివాసులుకు కూడా వ్యక్తిగత కక్షలేనని మీరే వారిద్దరని రాజీ చేయలేదా? మీకు రాజకీయంగా నష్టం జరగనంతవరకు వారికి ఇబ్బంది లేదు. రాజకీయంగా అడ్డుపడతాని భావించినప్పుడు ప్రసాద్‌రెడ్డిని హత్య చేయించారు. ఈరోజు మళ్లీ శ్రీనివాసులు తదితరులకు రాజకీయ పదవులిచ్చి మీదగ్గర ఉంచుకున్నారు. - కందుకూరు శివారెడ్డివి కూడా వ్యక్తిగత కక్షలే. ప్రత్యర్థులు మిమ్మల్ని కలవడం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే బాలకృష్ణ తదితరులు హత్య చేశారు. ఈరోజు వారిని మీ వద్దే ఉంచుకోవడం వాస్తం కాదా? - తగరకుంట కొండారెడ్డిది రాజకీయ హత్యే. ఆయనను తుద ముట్టించకపోతే రాజకీయ ంగా ఇబ్బంది తప్పదనే హత్య చేయించారు. - ఆత్మకూరు కేశవరెడ్డి హత్య వెనుక వ్యక్తిగత కక్షలే కారణం అంటున్నారు. 8 ఏళ్లుగా కేశవరెడ్డి, నరసింహారెడ్డి కుటుంబాలు అనేక కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నాయి. మొన్నటిదాకా తటస్థంగా ఉన్న కేశవరెడ్డి ఇటీవల వైఎస్సార్సీపీలో బలంగా ఎదుగుతున్నాడు. తీరా ఎన్నికల ముందు ఎందుకు చంపారు?. నరసింహారెడ్డి ఒక్కడే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోలేడనే విషయం మండలమంతా కోడై కూస్తోంది. - ఈరోజు అధికారం అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ధర్మం, న్యాయం ప్రజలకు తెలుస్తుందనే విషయం మంత్రి గుర్తు పెట్టుకోవాలి. -
రాప్తాడులో రాజకీయ హత్య
అనంతపురం సెంట్రల్: రాప్తాడు నియోజకవర్గంలో హత్యారాజకీయాలకు అంతులేకుండా పోతోంది. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తుండగానే విపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన ప్రముఖ నేతను దారుణంగా హతమార్చడం సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకులు ఎంతటికి బరితెగిస్తున్నారని చెప్పేందుకు బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యనే నిదర్శనం. దృష్టి మళ్లించి.. బుధవారం ఉదయం 11 గంటలకు గుమ్మఘట్ట మండలం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ వద్ద సీఎం చంద్రబాబు పైలాన్ ఆవిష్కరణకు వచ్చారు. ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సీఎం కార్యక్రమానికి ఆత్మకూరు మీదుగానే తరలించారు. సీఎం చంద్రబాబు బీటీపీలో కాలు పెట్టే గంట ముందు అంటే పది గంటల సమయంలో ఆత్మకూరులో కాపు కాచి వైఎస్సార్ సీపీ సీనియర్ నేత జి.కేశవరెడ్డిని హతమార్చారు. పథకం ప్రకారం జరిగిన ఈ దాడిలో తాము ఎంతకైనా తెగిస్తామంటూ టీడీపీ నేతలు చెప్పకనే చెప్పినట్లేంది. పరిటాల కుటుంబం ప్రమేయంతోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు శ్రుతిమించిపోయాయి. ఆధిపత్యం నిలుపుకునేందుకు విపక్ష వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ప్రమేయంతోనే నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ విపక్ష పార్టీలే ఏక కంఠంతో నినదిస్తున్నాయి. గతంలోనూ ఇలానే.. రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి విషయంలోనూ ఇలానే జరిగింది. పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయానికి రప్పించుకుని అతన్ని అధికార పార్టీ నాయకులు హత్య చేశారు. వైఎస్సార్ సీపీలో ముఖ్య నేతలకు ప్రత్యర్థులను పరిటాల కుటుంబం చేరదీస్తూ.. వారిద్వారా హత్యారాజకీయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్లరి మూకలు, కిడ్నాపర్లు, నేరాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారిని శ్రీరాం తన కోటరీలో చేర్చుకుంటూ దారుణాలకు తెగబడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్‌చేసి రామగిరి మండలం కొత్తపల్లి బంధించిన ఘటనలోనూ పరిటాల కుటుంబం హస్తమున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యలోనూ మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ ప్రమేయమున్నట్లు హతుడి బార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తండ్రి బాటలో తనయుడు తన తండ్రి పరిటాల రవీంద్ర బాటలోనే హత్యారాజకీయాలతో ఆధిపత్యం చెలాయించేందుకు శ్రీరాం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని విపక్ష వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలను హతమారుస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు కొనసాగిస్తున్నట్లు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2004కు ముందు శత్రుశేషం లేకుండా జిల్లాలో పరిటాల రవీంద్ర మారణకాండను సృష్టించారు. వందల సంఖ్యలో విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. పదుల సంఖ్యలో మృతదేహాలు వెలుగు చూశాయి. ఇదంతా పరిటాల రవి కనుసన్నల్లోనే జరిగాయనేది బహిరంగ రహస్యం. శ్రీరాం అదే బాటలో పయనిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ► 2015 ఏప్రిల్ 29న రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులను పరామర్శిం చేందుకు ఆస్పత్రికి చేరుకున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై హత్యాయత్నం. ► 2017 నవంబర్‌లో గొందిరెడ్డిపల్లిలో సర్పంచ్ కుమారుడు బాబయ్యపై టీడీపీ వర్గీయుల దాడి. ► 2017 నవంబర్ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త సుబ్బుకృష్ణపై దాడి. ► 2018 మార్చి 30 అనంతపురం రూరల్ మండలం కందుకూరులో శివారెడ్డి హత్య. ► అనంతరం రూరల్ మండలంలో ఎంపీటీసీ ధనుంజయయాదవ్ హత్యకు కుట్ర. టీడీపీలోకి చేర్చుకునేలా పథక రచన. -
వైఎస్ఆర్సీపీ నేత కేశవరెడ్డి హత్య
-
టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా..
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. నంద్యాల ప్రజలపై సీఎం ఎన్నడూ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలవలనే ఉద్దేశ్యంతో టీడీపీ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కేశవరెడ్డి అప్పుల్లెగ్గొట్టిన ఫైనాన్షియర్లకు అధికార పార్టీ ఎర వేసింది. నిన్నరాత్రి సీఎం పర్యటన నేపథ్యంలో ఫైనాన్షియర్లతో టీడీపీ నేతలు మంతనాలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ మరో దిగుజారుడు ఫార్ములాను అనుసరించింది. ఈ విషయంలో టీడీపీ నేతలకు, ఫైనాన్షియర్లకు మధ్య డీల్ కుదిరినట్టు సమాచారం. కేశవరెడ్డి అప్పుల్లెగ్గొట్టిన ఓ కౌన్సిలర్‌కు టీడీపీ నేతలు రూ.50లక్షలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కేశవరెడ్డి బాధితులకు మాత్రం సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. కేశవరెడ్డి సామాన్య ప్రజలకు దాదాపు రూ. 800 కోట్లు ఎగ్గొటారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కావడంతో సామాన్యులను మోసం చేసిన కేశవరెడ్డిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేశవరెడ్డి బాధితులు సీఎంను కలిసి తమ బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వారు సీఎం కు వినతిపత్రం ఇవ్వటానికి సమావేశం దగ్గరకు వెళ్లారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తమ గొడును పట్టించుకోలేదని బాధితులు నిరాశ చెందారు. ఉప ఎన్నికలు ఉన్నందున రాష్ట్ర క్యాబినేట్ మొత్తం నంద్యాలలోనే మకాం వేసింది.