టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా..
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. నంద్యాల ప్రజలపై సీఎం ఎన్నడూ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలవలనే ఉద్దేశ్యంతో టీడీపీ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కేశవరెడ్డి అప్పుల్లెగ్గొట్టిన ఫైనాన్షియర్లకు అధికార పార్టీ ఎర వేసింది. నిన్నరాత్రి సీఎం పర్యటన నేపథ్యంలో ఫైనాన్షియర్లతో టీడీపీ నేతలు మంతనాలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ మరో దిగుజారుడు ఫార్ములాను అనుసరించింది.
ఈ విషయంలో టీడీపీ నేతలకు, ఫైనాన్షియర్లకు మధ్య డీల్ కుదిరినట్టు సమాచారం. కేశవరెడ్డి అప్పుల్లెగ్గొట్టిన ఓ కౌన్సిలర్‌కు టీడీపీ నేతలు రూ.50లక్షలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కేశవరెడ్డి బాధితులకు మాత్రం సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదు.
కేశవరెడ్డి సామాన్య ప్రజలకు దాదాపు రూ. 800 కోట్లు ఎగ్గొటారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కావడంతో సామాన్యులను మోసం చేసిన కేశవరెడ్డిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేశవరెడ్డి బాధితులు సీఎంను కలిసి తమ బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వారు సీఎం కు వినతిపత్రం ఇవ్వటానికి సమావేశం దగ్గరకు వెళ్లారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తమ గొడును పట్టించుకోలేదని బాధితులు నిరాశ చెందారు. ఉప ఎన్నికలు ఉన్నందున రాష్ట్ర క్యాబినేట్ మొత్తం నంద్యాలలోనే మకాం వేసింది.