Keshari Nath Tripathi
-
బెంగాల్లో రాష్ట్రపతి పాలన??
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలకు మీరే కారణమంటూ టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో డజను మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో బెంగాల్లో పరిస్థితులు ఇంకా దిగజారితే.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంటుందని ఆయన అన్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముందన్న బీజేపీ నేత కైలాశ్ విజయ్వార్గియా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. బెంగాల్లో హింసకు మీరే కారణమంటూ బీజేపీ, టీఎంసీ పరస్పరం వేలెత్తి చూపించుకోవడంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పాటుపడాలని సూచించారు. -
సంబంధాల్లో సువర్ణాధ్యాయం
శాంతినికేతన్: గత కొద్ది సంవత్సరాలుగా భారత్–బంగ్లాదేశ్ దేశాల సంబంధాల్లో సువర్ణాధ్యాయం నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర అవగాహన, సహకారమే ఇరు దేశాలను కలిపాయని పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్ శాంతిని కేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో∙పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ త్రిపాఠి, సీఎం మమతా బెనర్జీతో వేదిక పంచుకున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో హసీనాతో కలసి బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా ఈ భవన్‌ను బంగ్లాదేశ్ నిర్మించింది. స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సొంతగడ్డపై అడుగుపెట్టినందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉందని అన్నారు. యువ మెదళ్లను తీర్చిదిద్దుతున్న విశ్వభారతి వర్సిటీ ప్రయత్నాలను కొనియాడారు. ‘ మీరు 50 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని విన్నా. విశ్వభారతి స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే 2021 నాటికి మరో 50 గ్రామాల్లో విద్యుత్, గ్యాస్ కనెక్షన్, ఆన్లైన్ లావాదేవీలు కల్పించి అభివృద్ధి చేస్తామని ప్రతినబూనండి’ అని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన అన్న సత్యేంద్రనాథ్ ఠాగూర్‌లకు గుజరాత్‌తో ఉన్న సంబంధాల్ని మోదీ గుర్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ వేదిక వద్ద తాగునీటికి కొరత ఏర్పడినందుకు మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. అనుసంధానత జోరు.. గత కొన్నేళ్లుగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో సువర్ణాధ్యాయం కొనసాగుతున్నందున భూ, తీర ప్రాంత సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని మోదీ అన్నారు. రోడ్డు, రైలు, జల రవాణాతో రెండు దేశాల మధ్య అనుసంధానత వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న 600 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాదే 1100 మెగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం మోదీ, హసీనా భేటీ అయ్యారు. -
బెంగాల్ గవర్నర్‌కు బీహార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ప్రకటించింది. బీహార్ ప్రస్తుత గవర్నర్ డీవై పాటిల్ పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్‌ను నియమించేంత వరకు బీహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కైలాస్‌నాథ్‌ను ఆదేశించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది.