స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి
కిషోడ్(గుజరాత్): స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు చిన్నపిల్లలతో పాటూ మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన గుజరాత్లోని కిషోడ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.