Keyboard Playing
-
‘బిట్ బోర్డ్’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!
ఎలక్ట్రానిక్ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్ డిజైనర్ చెన్ సిన్ ఈ పరికరాన్ని ‘బిట్ బోర్డ్’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్స్’ పోటీల్లో ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అవార్డును కూడా సాధించారు. ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్‌ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
కీబోర్డుతో గిన్నిస్ రికార్డు
బెంగళూరు(బనశంకరి) : వీణావాణి సంగీత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా కీబోర్డ్ వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆదివారం బనశంకరి రెండో స్టేజ్‌లో ఉన్న శ్రీ వీణావాణి సంగీత పాఠశాల 41 వ వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా విద్యార్ధులు ఒకేసారి కీబోర్డు వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లో చేరారు. ఇది లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే సమక్షంలో సాగింది. 1974 లో విద్వాన్ సంపత్‌కుమార్‌శర్మ నేతృత్వంలో వీణావాణి సంగీత పాఠశాల ఏర్పాటైంది. గత 15 ఏళ్లుగా గిరీశ్‌కుమార్ సారథ్యంలో వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఆదివారం 400 మందికి పైగా విద్యార్థులతో కీబోర్డు వాయించే కార్యక్రమం ఒకటిగా ఉంది. ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు 12 వేలకు పైగా విద్యార్థులు సంగీత విద్యను అభ్యసించారు. 2011లో 126మంది సంగీత కళాకారులతో ఒకేసారి వాయిద్యగోష్టి నిర్వహించడం ప్రథమంగా గిన్నిస్ రికార్డుల్లోకి చేరారు. అంతేగాక ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన కార్యక్రమంలో 175 మంది వాయిద్య కళాకారులతో వాయిద్యగోష్టి నిర్వహించడం విశేషం. 2014లో 229 మంది విద్యార్థులతో చెన్నైలో ఈ వాయిద్యగోష్టి నిర్వహించారు. వీణావాణి సంగీత పాఠశాల విద్యార్థులు ఈ మూడు రికార్డులను నెలకొల్పి గిన్నిస్ రికార్డుల్లో గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణగురూజీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవీంద్ర ప్రసాద్, ఉదయగరుడాచార్ తదితరులు పాల్గొన్నారు.