kg
-
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
కేజీ, అతుల్య జంటగా శివరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాదల్ కన్ కట్టుదే’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని ‘ప్రేమ పావురాలు’ పేరుతో నిర్మాత శ్రీరామ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘మా శ్రీరామ్ సినిమా బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘వాసుకి’. ఆ సినిమా తర్వాత వస్తోన్న రెండో చిత్రం ‘ప్రేమ పావురాలు’. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నాం. ఒరిజినల్ అంత ఫ్రెష్‌గా ఔట్పుట్ రాదని డబ్ చేస్తున్నాం. శివరాజ్ కథ, కథనాలతో పాటు లీడ్ యాక్టర్స్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పవన్ సంగీతం, ఆర్.ఆర్. సినిమాకి హైలెట్. స్ట్రయిట్ తెలుగు సినిమా తరహాలో క్వాలిటీగా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాని వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
వహ్వా వంకాయ్!
శ్రీకాకుళం, వీరఘట్టం: వంకాయల కూర తింటే ఆహా.. అనని వారు బహు తక్కువ. కానీ కూర చేయకుండానే ఈ వంకాయ వహ్వా అనిపించేస్తోంది. వీరఘట్టం మార్కెట్లో ఒక్కో వంకాయ 1.5 కేజీల బరువు ఉండడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా వంగ పంట సాగు లేకపోవడంతో పార్వతీపురం నుంచి దిగుమతి చేస్తున్నామని వ్యాపారులు అంటున్నారు. పెద్ద సైజులో ఉండడంతో కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులంటున్నారు. -
కిలో గంజాయి స్వాధీనం
భట్టిప్రోలు : అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి నుంచి పోలీసులు ఆదివారం రాత్రి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భట్టిప్రోలులోని రైల్వే గేటు వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రేపల్లె సీఐ పి. ఆంజనేయులకు సమాచారం రావడంతో ఆయన ఎస్ఐ ఈ. బాలనాగిరెడ్డిని అప్రమత్తం చేశారు. వెంటనే ఆయన ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ తచ్చాడుతున్న నల్లబోతుల ఇమ్మానియేల్, గుత్తి రమేష్‌ను అదుపులోకి తీసుకొని వారి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీరిని రేపల్లె కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండుకు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్బిట్రేటర్ ముందుకు ఆర్ఐఎల్-ఓఎన్జీసీ వివాదం
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదం మధ్యవర్తిత్వ పరిష్కారానికి (ఆర్బిట్రేషన్) వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఖరారు చేసే పనిలో ఉంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిటీ వివాదాన్ని ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టు (పీఎస్సీ) కింద పరిష్కరించాలని సూచించిన విషయం తెలిసిందే. పీఎస్సీ కింద ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టర్ మధ్య వివాదం తలెత్తితే పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చమురు మంత్రిత్వ శాఖకు న్యాయనిపుణులు సూచించినట్టు తెలిసింది. కాగా, ఆర్ఐఎల్ చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేసే పనిలో డీజీహెచ్ ఉందని, కొన్ని రోజుల్లో దీన్ని వెల్లడించనున్నట్టు ఆ శాఖ అధికారి తెలిపారు. -
పేరేచర్లలో కేజీ గంజాయి పట్టివేత
ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు పేరేచర్ల : మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్లలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి.సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని పేరేచర్ల నరసరావుపేట రోడ్డులోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో తంగస్వామి పెరియాస్వామి అనే వ్యక్తి ఒక సంచిలో గంజాయిని తరలిస్తుండగా దాడి చేసి, అతని నుంచి సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సత్తెనపల్లి ఎక్సైజ్ సీఐ ఎం.రమేష్, ఎస్ఐలు ప్రసన్నలక్ష్మి, రవికుమార్ పాల్గొన్నారు. వీఆర్వో వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. రూ.1.50 లక్షల ఖైనీ, గుట్కాల స్వాధీనం సత్తెనపల్లి: నిషేధిత ఖైనీ, గుట్కాల నిల్వలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదుట ఎల్.హనుమంతరావు అనే వ్యాపారికి చెందిన గోదాములో నిషేధిత ఖైనీ, గుట్కాలు పెద్ద మొత్తంలో ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ పీఎస్ఐ పి.అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు 20 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఖైనీ, గుట్కాల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిలో ఉల్లి రూ.1
బెంగుళూరు : ఎంకామర్స్ రంగంలోని నింజాకార్ట్ సంస్థ వినియోగదారుల కోసం కిలో ఉల్లిపాయలను రూ.1కే అందజేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు తిరుకుమారన్ నాగరాజన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆయన బెంగళూరులో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి శనివారం వరకూ ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు. తమ సంస్థ రూపొందించిన నింజాకార్ట్ మొబైల్ యాప్ నుంచి మాత్రమే ఉల్లిపాయలు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కిలో మాత్రమే అందజేస్తారు. -
పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం
నరసాపురం రూరల్ : ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్, బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం లక్ష్మణేశ్వరం గ్రామం నక్కావారిపూటలో మహాత్మా జ్యోతిరావ్ పూలే ఏపీ గురుకుల బాలికల పాఠశాల నూతన ప్రాంగణాన్ని ఆయన డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పేద విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు గురుకుల విద్యాలయాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. పతి నిరుపేదకూ చదువును అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థల సేకరణ చేయాల్సిందిగా స్థానిక ఎమ్యెల్యే బండారు మాధవనాయుడుకు సూచించారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌కు అంచనాలు రూపొందిస్తే సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన విద్యాసామగ్రిని మంత్రి అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులందరికీ ఫీజురీయింబర్స్‌మెంటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ యువత విలువైన కాలాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని దేశానికి మంచి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ రత్నమాల, ఆర్డీవో జె. ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు.