ఖాదరలింగస్వామి ఉరుసు ప్రారంభం
– పదిరోజులపాటు ఉత్సవాలు
కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా మండల కేంద్రం కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 312వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాష చిష్తీలు వారి శిష్యరిక బందం ప్రత్యేక ఫాతెహాల చేసి స్వామి సమాధికి సుగంధ ద్రవ్యలు, పానీయాలతో శుభ్రం చేశారు. ప్రత్యేకంగా తెచ్చిన చాదర్‌ను సమాధిపై వేసి పూలతో అలంకరించారు. అనంతరం నగారా వాయించారు. దీంతో ఉరుసు ప్రారంభమైనట్లు ధర్మకర్త తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరి కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను దర్గా ఆవరణలో ఏర్పాటు చే సినట్లు గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు, అధ్యక్షుడు నజీర్ అహ్మద్, మున్నపాష తెలిపారు.