ఫ్యాబ్ ఇండియాకు షాక్: భారీ నష్టపరిహారం డిమాండ్
సాక్షి, ముంబై: పాపులర్ రీటైల్ చైన్ నకిలీ ఖాదీ దుస్తులను అమ్ముతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలను బలాన్నిస్తున్నాయి. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవీఐసీ) ఫ్యాబ్ ఇండియాకు ట్రేమ్ మార్క్ వివాదం కింద నోటీసులు పంపించింది. ఫ్యాబ్ ఇండియా రీటైల్ ఔట్లెట్లలో అనుమతి లేకుండా తమ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించి వందలకోట్లు దండుకుందని ఆరోపించింది. ఇందుకుగాను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. చేనేత వస్త్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందంటూ మండిపడిన సంస్థ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఖాదీ మార్క్ ట్యాగ్ కింద నకిలీ ఖాదీ వస్త్రాలను (కర్మాగారంలో తయారైన పత్తి వస్త్రాలను)విక్రయిస్తోందనీ, తద్వారా ఖాదీ ప్రతిష్టకు తీవ్ర నష్టంతోపాటు కూడా రా వినియోగదారులను తప్పుదారి పట్టిసతోందని తన నోటీసులో పేర్కొంది. తన చట్టబద్ధమైన "చర్ఖా" ను అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖాదీ ట్యాగ్ తో దుస్తుల అక్రమ విక్రయాలు చేపట్టిందని కమిషన్ ఆరోపించింది. ఇందుకుగాను నష్టపరిహారంగా రూ. 525 కోట్లను చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా హెచ్చరించింది.
అయితే కేవీఐసీ, ఫ్యాబ్ ఇండియా మధ్య ట్రేడ్ మార్క వివాదం ఇప్పటిదికాదు. గతంలోనే కేవీఐసీ ఫ్యాబ్ ఇండియాకు నోటీసులు పంపించింది. 2015 ఆగస్టులో అక్రమ, అనధికారిక ఖాదీ మార్క్ వస్త్రాల విక్రయాలను నిలిపివేయాలని కోరింది. అలాగే వార్తాపత్రిల్లో తప్పుదారి పట్టించే ప్రకటనలు కూడా ఆపేయాలని కూడా హెచ్చరించింది. దీనికి ఫ్యాబ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. అయితే మళ్లీ 2017, జనవరి లో ఫ్యాబ్ ఇండియా మళ్లీ రీతిలో వ్యవహరిస్తుండటంతో షాక్ అయిన కేవీఐసీ మరోసారి నోటీసులిచ్చింది. వీటికి స్పందించిన ఫ్యాబ్ ఇండియా కమిషన్ ప్రతినిధులతో చర్చలను కోరుతూ గతేడాది ఫిబ్రవరి 10న సమాధానం చెప్పింది. అయితే తాజాగా ఈ ఆరోపణలను మాత్రం అవాస్తవాలు, నిరాధారాలంటూ ఫ్యాబ్ ఇండియా ప్రతినిధి తిరస్కరించారు. తాము కేవీఐసీ చట్ట అతిక్రమణలకు పాల్పడటం లేదనే విషయాన్ని గత కొన్నాళ్లుగా పదే పదే సంస్థ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. చట్టపరమైన చర్యలకు దిగితే.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం విశేషం.