రేవంత్ రెడ్డికి టోకరా వేయబోయి..
ఇదే విధంగా మహబూబ్ నగర్ జడ్పీ సీఈవో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. ‘రేవంత్ సార్ నాకు తెలిసినవారి ద్వారా రూ. 2 కోట్లు ఇప్పిస్తా’అని ఆశ చూపాడు. మే 31వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపాడు.
అనుమానం రావడంతో ఫోన్‌కాల్‌పై రేవంత్ పీఏ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు వలపన్ని సోమవారం కుమార్‌ను పట్టుకున్నారు. అతడు ఎవరెవరి నుంచి ఎంత డబ్బు వసూలు చేశాడో తెలియాల్సి ఉంది.