సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. 3,600 మందిని మోసగించి రూ.300 కోట్లను కేటుగాడు కొట్టేశాడు. నిందితుడు పవన్ కుమార్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కుమార్‌కు సహకరించిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసిన కేటుగాడు.. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశాడు. 25 నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని ప్రారంభించిన పవన్.. కస్టమర్ల చేత ఎనిమిది లక్షలకు రెండు గంటల భూమి కొనుగోలు చేయించాడు.
ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుని.. కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేశాడు. మరో వైపు, డబల్ గోల్డ్ స్కీం, గోల్డ్ చిట్స్ స్కీం కింద లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈవోడబ్ల్యూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: తాజా సర్వే.. కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్
Comments
Please login to add a commentAdd a comment