buy back
-
3600 మందికి 300 కోట్లకు టోకరా..8 మంది నిందితుల అరెస్ట్
-
హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. 3,600 మందిని మోసగించి రూ.300 కోట్లను కేటుగాడు కొట్టేశాడు. నిందితుడు పవన్ కుమార్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కుమార్‌కు సహకరించిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసిన కేటుగాడు.. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశాడు. 25 నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని ప్రారంభించిన పవన్.. కస్టమర్ల చేత ఎనిమిది లక్షలకు రెండు గంటల భూమి కొనుగోలు చేయించాడు.ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుని.. కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేశాడు. మరో వైపు, డబల్ గోల్డ్ స్కీం, గోల్డ్ చిట్స్ స్కీం కింద లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈవోడబ్ల్యూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తాజా సర్వే.. కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్ -
మళ్లీ షేర్లు కొంటున్న వారెన్ బఫెట్
న్యూయార్క్: ప్రపంచ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. తిరిగి ఈక్విటీలవైపు దృష్టి సారించారు. ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో పలు ఫార్మా దిగ్గజాలలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. బఫెట్ ప్రధాన కంపెనీ బెర్క్‌షైర్ హాథవే.. క్యూ3(జులై- సెప్టెంబర్)లో వివిధ కంపెనీలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి సైతం మరో 9 బిలియన్ డాలర్లను వెచ్చించడం గమనార్హం! ఈ అంశాలను బెర్క్‌షైర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తాజాగా వెల్లడించింది. యూటర్న్.. దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న నేపథ్యంలో తొలి రెండు త్రైమాసికాలలోనూ బఫెట్ సంస్ధ బెర్క్‌షైర్ 13 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో గల వాటాలను దాదాపు అమ్మివేసింది. కాగా.. కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 90 శాతం విజయవంతమైనట్లు ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో బఫెట్ రూటు మార్చుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో షేర్ల విక్రయాలకు బదులుగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఫార్మాకు ప్రాధాన్యం బెర్క్‌షైర్ క్యూ3లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో ఫార్మాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జాబితాలో యాబ్వీ ఇంక్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, మెర్క్ అండ్ కో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైజర్‌లో 13.8 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కేవలం కోవిడ్-19 వ్యాక్సిన్లపై దృష్టితో కాకుండా భవిష్యత్‌లో ఫార్మా రంగానికున్న అవకాశాలపై అంచనాలతో బఫెట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో, పీఎన్సీ ఫైనాన్సియల్ సర్వీసెస్‌తోపాటు.. రిటైల్ దిగ్గజం కాస్ట్కో హోల్‌సేల్ కార్ప్లలో వాటాలు తగ్గించుకుంది. క్యూ2లో పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో భారీగా వాటాలు విక్రయించిన సంగతి తెలిసిందే. టీ మొబైల్లో.. స్టాక్ ఎక్స్ఛేంజీల వివరాల ప్రకారం ఈ ఏడాది క్యూ3లో టెలికం సేవల దిగ్గజం టీ మొబైల్ యూఎస్‌లో బెర్క్‌షైర్ అదనపు వాటాలను సొంతం చేసుకుంది. అతిపెద్ద వైర్లెస్ నెట్వర్క్ కలిగిన టీ మొబైల్ 5జీ సేవలవైపు దృష్టి సారించిన నేపథ్యంలో బఫెట్ తాజా పెట్టుబడులు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్నాలజీ రంగ ఐపీవో స్నోఫ్లేక్ ఇంక్లోనూ బెర్క్‌షైర్ ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఇదే సమయంలో 2.5 బిలియన్ డాలర్లతో క్లాస్ ఏ షేర్లను, 6.7 బిలియన్ డాలర్లతో క్లాస్ బీ షేర్లనూ బైబ్యాక్ చేసింది. వెరసి 2020లో బెర్క్‌షైర్ హాథవే షేర్ల బైబ్యాక్‌కు సెప్టెంబర్ చివరికల్లా 15.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లయ్యింది. అయినప్పటికీ కంపెనీ వద్ద దాదాపు 146 బిలియన్ డాలర్ల నగదు నిల్వలుండటం విశేషం! -
మయూర్- వీఎస్టీ టిల్లర్స్ జూమ్
ముంబై: తొలుత వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్నదేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అంచనాలకు తగిన పనితీరు చూపడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించిన వార్తలతో మయూర్ యూనికోటర్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ టిల్లర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ నికర లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 30 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు సైతం 37 శాతం పెరిగి రూ. 220 కోట్లను తాకాయి. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం బలపడి 17.1 శాతానికి చేరాయి. పవర్ టిల్లర్ అమ్మకాలు 41 శాతం అధికంగా 7,924 యూనిట్లను తాకగా.. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 25 శాతం వృద్ధితో 2,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ రూ. 140 కోట్ల నగదును సముపార్జించింది. ఫలితాల నేపథ్యంలో వీఎస్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,939ను తాకింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 1,911 వద్ద ట్రేడవుతోంది. మయూర్ యూనికోటర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో మయూర్ యూనికోటర్స్ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 126 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలపడి 23 శాతానికి చేరాయి. కాగా.. షేరుకి రూ. 400 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు మయూర్ యూనికోటర్స్ తెలియజేసింది. ఇందుకు రూ. 30 కోట్లవరకూ వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో మయూర్ యూనికోటర్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 275ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 267 వద్ద ట్రేడవుతోంది. -
కోవిడ్19- రూటు మార్చిన బఫెట్
న్యూయార్క్: కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫెట్ సైతం రూటు మార్చుకున్నారు. వెరసి ఈ ఏడాది(2020) తొలి 9 నెలల్లో సొంత కంపెనీ షేర్ల బైబ్యాక్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. తద్వారా 16 బిలియన్ డాలర్లను బైబ్యాక్ కోసం వెచ్చించారు. గతేడాదిలో చేపట్టిన బైబ్యాక్ తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంకావడం గమనార్హం. బఫెట్ దిగ్గజ కంపెనీ బెర్క్ షైర్ ఇటీవల చేపట్టిన పెట్టుబడులను సైతం బైబ్యాక్ మించినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 2019లో ఆక్సిడెంటల్ పెట్రోలియం కార్ప్ డీల్, ఏడాది కాలంపాటు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేర్ల కొనుగోలుకి వెచ్చించిన నిధులకంటే ఇవి అధికమని పేర్కొన్నారు. కరోనా కాటు కోవిడ్-19 ప్రభావంతో ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం బఫెట్ పెట్టుబడి ప్రణాళికల్లో కొంతమేర యూటర్న్ తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రికార్డ్ బైబ్యాకులు, జపనీస్ ట్రేడింగ్ సంస్థలలో వాటాలు, నేచురల్ గ్యాస్ ఆస్తుల కొనుగోలు తదుపరి పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేశారు. కొద్ది నెలల క్రితమే ఇన్వెస్ట్ చేసిన యూఎస్ ఎయిర్ లైన్స్ కంపెనీలలో వాటాలను భారీగా విక్రయించారు. నిజానికి కొంతకాలంగా పేరుకుపోతున్న నగదు నిల్వలతో భారీ కొనుగోళ్లకు తెరతీయాలని భావించిన బఫెట్.. కరోనా వైరస్ కారణంగా ప్రణాళికలు మార్చుకున్నట్లు నిపుణులు వివరించారు. 8 శాతం డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో బైబ్యాక్ పై 9 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు బెర్క్ షైర్ తాజాగా వెల్లడించింది. క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లోనూ బైబ్యాక్ కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ కల్లా నగదు నిల్వలు 146 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు పేర్కొంది. బైబ్యాక్స్, స్టాక్స్ లో పెట్టుబడుల నేపథ్యంలోనూ జూన్ మగింపుతో పోలిస్తే 1 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువకావడం విశేషం. క్యూ3లో నిర్వహణ లాభం 32 శాతం క్షీణించి 5.48 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు బెర్క్ షైర్ శనివారం వెల్లడించింది. అయితే ఇంధన విభాగం మిడ్ అమెరికన్ ఎనర్జీ ఆర్జన 21 శాతం ఎగసినట్లు పేర్కొంది. కాగా.. బైబ్యాకులు చేపట్టినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకూ బెర్క్ షైర్ క్లాస్ A షేరు 7.6 శాతం క్షీణించిన విషయాన్ని నిపుణులు గమనించదగ్గ అంశమంటున్నారు. -
హెచ్ పీసీఎల్ బైబ్యాక్- ఎస్ఆర్ఎఫ్ జోష్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్ పీసీఎల్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో విభిన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ పీసీఎల్ ఒక్కో షేరుకి రూ. 250 ధర మించకుండా 10 కోట్ల షేర్లవరకూ కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు హెచ్ పీసీఎల్ తాజాగా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 6.56 శాతం వాటాకు సమానంకాగా.. బైబ్యాక్ కోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ. 1052 కోట్ల నుంచి రూ. 2,477 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ. 66,165 కోట్ల నుంచి రూ. 61,340 కోట్లకు నీరసించింది. క్యూ2లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 5.11 డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్ పీసీఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం జంప్ చేసి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ లాభపడింది. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్ఆర్ఎఫ్ నికర లాభం 57 శాతం పెరిగి రూ. 316 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 21 శాతం బలపడి రూ. 1,738 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్ఆర్ఎఫ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.2 శాతం జంప్ చేసి రూ. 4,763 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4,789 వరకూ లాభపడింది. ఈ కౌంటర్లో సగటు ట్రేడింగ్ పరిమాణం 4,980 షేర్లుకాగా.. తొలి రెండు గంటల్లో రెండు రెట్లు అధికంగా 11,100 షేర్లు చేతులు మారాయి. -
హెచ్‌పీసీఎల్, ఏంజెల్ బ్రోకింగ్.. భేష్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), మరోపక్క ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌పీసీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌పీసీఎల్ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్ బ్రోకింగ్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బల్క్‌డీల్ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే. -
పిడిలైట్ ఇండస్ట్రీస్- అజంతా ఫార్మా.. జోరు
పలు దేశాలలో తిరిగి కరోనా వైరస్ కేసులు తలెత్తుతుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీయంగానూ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా పిడిలైట్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పిడిలైట్ ఇండస్ట్రీస్ హంట్స్‌మన్ గ్రూప్‌నకు చెందిన దేశీ అనుబంధ విభాగాన్ని కొనుగోలు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం పిడిలైట్ ఇండస్ట్రీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు యూఎస్ఏ కంపెనీతో కుదుర్చుకున్న తప్పనిసరి ఒప్పందానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా హంట్స్‌మన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఇందుకు సుమారు రూ. 2,100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. హంట్స్‌మన్ అడ్వాన్స్డ్.. అరాల్డైట్, అరాసీల్ తదితర ప్రొడక్టులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిడిలైట్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,578 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,591 వరకూ పురోగమించింది. అజంతా ఫార్మా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అజంతా ఫార్మా తాజాగా పేర్కొంది. వచ్చే నెల 3న కంపెనీ బోర్డు సమావేంకానున్నట్లు తెలియజేసింది. తద్వారా ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించడంతోపాటు.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం బోర్డు విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అజంతా ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1,650 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,680 వరకూ లాభపడింది. -
బ్రిటానియా- కేఐవోసీఎల్ పతనం
విదేశీ ప్రతికూలతల కారణంగా ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 240 పాయింట్లు జంప్‌చేసి 40,671ను తాకింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 11,932 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను చేరకపోవడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నిర్ణయాలు నిరాశపరచడంతో మెటల్, మైనింగ్ రంగ పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వెరసి ఈ రెండు షేర్లూ లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 3,419 కోట్లను తాకింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చూపనప్పటికీ వ్యయాల నియంత్రణ, తగ్గిన ముడి సరుకుల ధరలు కంపెనీ లాభదాయకత మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్రిటానియా షేరు 5 శాతం పతనమై రూ. 3,583 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3,575 వరకూ వెనకడుగు వేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 110 ధర మించకుండా 1.41 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 156 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఐవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 123 దిగువన ఫ్రీజయ్యింది. -
జెట్- దివాన్- కాస్మో ఫిల్మ్స్.. దూకుడు
విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జెట్ ఎయిర్వేస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కాస్మో ఫిల్మ్స్ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ ప్రతిపాదిత రిజల్యూషన్ ప్రణాళికకు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో ప్రయివేట్ రంగ సంస్థ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 42.20 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి గత 8 రోజుల్లో ఈ షేరు 47 శాతం ర్యాలీ చేసింది. రూ. 1,000 కోట్ల తొలి దశ పెట్టుబడి ద్వారా జెట్ ఎయిర్వేస్ను పూర్తిస్థాయి కార్యకలాపాలతో పునరుద్ధరించాలని కల్రాక్ క్యాపిటల్ ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే రుణదాతలు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, భాగస్వాములతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ ఎన్బీఎఫ్సీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనుగోలుకి నాలుగు కంపెనీలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. బిడ్స్ దాఖలు చేసిన సంస్థలలో పిరమల్, అదానీ గ్రూప్‌లున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ కోసం నాలుగు కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ, పిరమల్ గ్రూప్‌లతోపాటు యూఎస్ కంపెనీ ఓక్ట్రీ క్యాపిటల్, ఎస్సీ లోవీ సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13.85 వద్ద ఫ్రీజయ్యింది. కాస్మో ఫిల్మ్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు ప్యాకేజింగ్ కంపెనీ కాస్మో ఫిల్మ్స్ తాజాగా పేర్కొంది. బైబ్యాక్ అంశంపై ఈ నెల 26న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత కాస్మో ఫిల్మ్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 468కు చేరింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. -
విప్రో లాభం రూ. 2,465 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,465 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ప్రకటించిన రూ. 2,553 కోట్లతో పోలిస్తే లాభం 3.4 శాతం క్షీణించింది. మరోవైపు, ఆదాయం దాదాపు గత క్యూ2 స్థాయిలోనే రూ. 15,114 కోట్లుగా నమోదైంది. ఇక డిసెంబర్ క్వార్టర్లో ఐటీ సేవల విభాగం ఆదాయం 202.2–206.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా చూస్తే 1.5–3.5 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 199.24 కోట్ల డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 3.7 శాతం వృద్ధి సాధించింది. ‘ఆదాయాలు, మార్జిన్లపరంగా ఈ త్రైమాసికం అద్భుతంగా గడిచింది. మా ముందు అనేక ఆసక్తికరమైన వ్యాపారావకాశాలు ఉన్నాయి‘ అని విప్రో సీఈవో థియెరి డెలాపోర్ట్ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలు, మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. కన్జూమర్, ఆర్థిక సేవల విభాగాలు మెరుగైన పనితీరు కనబపర్చగలవని డెలాపోర్ట్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 3,400 మంది సిబ్బందిని తీసుకోవడంతో ఉద్యోగుల సంఖ్య 1,85,243కి చేరింది. అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు 11 శాతంగా ఉంది. ఎగ్జిమియస్ డిజైన్ కొనుగోలు.. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎగ్జిమియస్ డిజైన్‌ను కొనుగోలు చేయనున్నట్లు విప్రో వెల్లడించింది. ఇందుకోసం సుమారు 8 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 586.3 కోట్లు) వెచ్చించనున్నట్లు వివరించింది. తమ ఇంజనీరింగ్‌ఎన్‌ఎక్స్‌టీ విభాగం అందించే సేవలకు ఎగ్జిమియస్ మరింత విలువ చేకూర్చగలదని విప్రో పేర్కొంది. వీఎల్ఎస్ఐ, సిస్టమ్ డిజైన్ సర్వీసుల మార్కెట్లో విప్రో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించేందుకు తోడ్పడగలదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్మీత్ చౌహాన్ తెలిపారు. 2020 డిసెంబర్ 31తో ముగిసే త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని వివరించారు. విప్రోతో చేతులు కలపడం తమ కస్టమర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఎగ్జిమియస్ డిజైన్ సీఈవో జయ్ ఆవుల తెలిపారు. 2013లో అమెరికాలో ఏర్పాటైన ఎగ్జిమియస్ డిజైన్‌కు భారత్‌తో పాటు మలేసియాలో కూడా డిజైన్ సెంటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో సొల్యూషన్స్ అందిస్తోంది. కంపెనీలో 1,100 మంది ఉద్యోగులు ఉండగా, 2019లో 3.52 కోట్ల డాలర్ల ఆదాయం నమోదు చేసింది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు స్వల్పంగా అర శాతం క్షీణించి రూ.375.75 వద్ద ముగిసింది. బైబ్యాక్ రేటు రూ. 400.. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ తరహాలోనే విప్రో కూడా షేర్ల బైబ్యాక్ ప్రణాళిక ప్రకటించింది. ఇందుకోసం రూ. 9,500 కోట్ల దాకా వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 400 ధరను నిర్ణయించింది. సుమారు 23.75 కోట్ల దాకా షేర్లను కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి గల పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 4.16 శాతమని వివరించింది. మంగళవారం బీఎస్ఈలో విప్రో షేరు ముగింపు ధర రూ. 375.75తో పోలిస్తే బైబ్యాక్ రేటు సుమారు 6% అధికం. షేర్హోల్డర్లకు నిలకడగా రాబడులు అందించాలన్న తమ సిద్ధాంతానికి అనుగుణంగా కంపెనీ షేర్ల కొనుగోలు చేపట్టినట్లు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో గతేడాది రూ. 10,500 కోట్లు, 2017లో రూ. 11,000 కోట్లు, 2016లో రూ. 2,500 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు కూడా తాజా బైబ్యాక్‌లో పాల్గొంటాయని విప్రో వివరించింది. షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9నాటి గణాంకాల ప్రకారం ప్రమోటర్, ప్రమోటరు గ్రూప్‌నకు కంపెనీలో 74.02 శాతం వాటాలు ఉన్నాయి. -
విప్రో ఫలితాలు ఓకే! భారీ బైబ్యాక్
సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలలో అంచనాలను అధిగమించింది. మంగళవారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 2466 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకీకృత నికర లాభంలో 3.4 క్షీణించింది.. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,553 కోట్ల రూపాయలు. ఏకీకృత ఆదాయం 2019 సెప్టెంబరులో 15,126 కోట్లతో పోలిస్తే 15,115 కోట్లగా నమోదైంది. ఐటీ సర్వీసుల ద్వారా కంపెనీ ఆదాయం 1.2 శాతం వృద్ధితో రూ.14768.1 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్ 19శాతం నుంచి 19.2 శాతానికి పెరిగింది. ఆదాయాల వృద్ధి, మార్జిన్ల విస్తరణ బలమైన నగదు ఉత్పత్తితో తమకు ఇది అద్భుతమైన త్రైమాసికమంటూ విప్రో సీఎండీ థియరీ డెలాపోర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. బైబ్యాక్ ప్లాన్స్ మరోవైపు షేర్ల బైబ్యాక్ ప్రణాళికలను విప్రో డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరు ధర రూ.400 చొప్పున రూ.9500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తం 23.75 కోట్ల షేర్లను కంపెనీ బైబ్యాంక్ చేయనుంది. రూ.9500 కోట్లకు మించకుండా ఈ బైబ్యాక్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. విప్రో షేర్ ప్రస్తుత మార్కెట్ ధర 375.5 . దీంతో రేపటి (బుధవారం) మార్కెట్లో షేర్ ధర లాభపడే అవకాశం ఉంది. -
టీసీఎస్- విప్రో.. రికార్డ్స్- సెన్సెక్స్ జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 501 పాయింట్లు దూసుకెళ్లి 40,380కు చేరగా.. నిఫ్టీ 137 పాయింట్లు జమ చేసుకుని 11,876 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ విప్రో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టీసీఎస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 4.8 శాతం పెరిగి రూ. 7,475 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికితోడు ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 3,000 ధర మించకుండా 1.42 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 5.33 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 16,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 2,878కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.7 శాతం ఎగసి రూ. 2,866 వద్ద ట్రేడవుతోంది. విప్రో లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 13న సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2 ఫలితాలు సైతం అదేరోజు విడుదల చేసే వీలున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఐటీ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్, మధ్యస్థాయి ఐటీ కంపెనీ మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ బైబ్యాక్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో విప్రో మూడో కంపెనీగా నిలవనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 354కు చేరింది. తద్వారా రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 368 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది! -
శోభా- మజెస్కో.. షేర్ల జోరు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్‌చేసి 39,341కు చేరగా.. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,598 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో రియల్టీ అభివృద్ధి సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. శోభా లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాల పరిమాణం 37 శాతం పెరిగినట్లు శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. దాదాపు 8.92 చదరపు అడుగులను విక్రయించినట్లు పేర్కొంది. విలువ ప్రకారం అమ్మకాలు 41 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఒక్కో చదరపు అడుగుకి సగటున రూ. 7,737 ధర లభించినట్లు తెలియజేసింది. గత ఐదు త్రైమాసిక ధరలతో పోలిస్తే ఇది అధికమని వివరించింది. దీంతో శోభా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 273 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10.3 శాతం లాభంతో రూ. 264 వద్ద ట్రేడవుతోంది. మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు ప్రతిపాదించినట్లు ఐటీ కన్సల్టింగ్ కంపెనీ మజెస్కో లిమిటెడ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు గురువారం(8న) సమావేశంకానున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ సైతం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బైబ్యాక్ ప్రతిపాదనపై బుధవారం(7న) బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు టీసీఎస్ ఇటీవల వెల్లడించింది. కాగా.. బైబ్యాక్ వార్తలతో మజెస్కో షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 861 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం గమనార్హం! -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్లను బైబ్యాక్ చేసే అవకాశాలున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు(బుధవారం) జరిగే బోర్డ్ సమా వేశంలో చర్చించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు నివేదించింది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ వెల్లడించనున్నది. రెండో మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. టీసీఎస్ 2018లో రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఒక్కో షేర్‌ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ బైబ్యాక్ చేసింది. 2017లో కూడా ఇదే రేంజ్లో షేర్లను బైబ్యాక్ చేసింది. ప్రస్తుత బైబ్యాక్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కానప్పటికీ, రూ.20,000 కోట్ల రేంజ్లో షేర్ల బైబ్యాక్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాటా సన్స్ కోసమే షేర్ల బైబ్యాక్ ? ఈ షేర్ల బైబ్యాక్ వల్ల టీసీఎస్ ప్రమోటర్ టాటా సన్స్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగనున్నది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న టాటా మోటార్స్, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి టాటా సన్స్‌కు నిధుల అవసరం ఉందని, దాని కోసమే టీసీఎస్ షేర్ల బైబ్యాక్ చేయనున్నదని విశ్లేషకులంటున్నారు. ఇతర ఐటీ కంపెనీలూ ఇదే బాటలో....! డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కారణంగా పలు కంపెనీలు డివిడెండ్ల చెల్లింపుల కంటే షేర్ల బైబ్యాక్కే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులంటున్నారు. కాగా నిధులు పుష్కలంగా ఉన్న ఇతర ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ బాట పట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయని వారంటున్నారు. -
హెచ్ఎస్ఐఎల్ జూమ్- జీఎంఎం పతనం
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్ఎస్ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్‌కాగా.. నేటి నుంచి ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది. -
త్రివేణీ బైబ్యాక్.. కేఈసీ క్యూ1- షేర్లు జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మౌలిక సదుపాయాల కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో షుగర్ తయారీ కంపెనీ త్రివేణీ ఇంజినీరింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో కేఈసీ ఇంటర్నేషనల్ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం తక్కువగా రూ. 2207 కోట్లను తాకింది. కోవిడ్-19 కారణంగా పనితీరు ప్రభావితమైనప్పటికీ పూర్తిఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నట్లు కేఈసీ యాజమాన్యం పేర్కొంది. ఇబిటా 22 శాతం నీరసించి రూ. 251 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేఈసీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం దూసుకెళ్లి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. త్రివేణీ ఇంజినీరింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో త్రివేణీ ఇంజినీరింగ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 146 శాతం దూసుకెళ్లి రూ. 84 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 921 కోట్ల నుంచి రూ. 1222 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. ఒక్కో షేరుకీ రూ. 105 ధర మించకుండా 2.5 శాతం వాటాకు సమానమైన 61.9 లక్షల షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఓకే చెప్పినట్లు త్రివేణీ వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 65 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో త్రివేణీ ఇంజినీరింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 77.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 82 వరకూ ఎగసింది. -
ఈక్లర్క్స్- శోభా.. హైజంప్
వరుసగా నాలుగో రోజు మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించి 36,400ను తాకగా.. నిఫ్టీ 136 పాయింట్లు బలపడి 10,700ను అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఈక్లర్క్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ఐటీ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రతిపాదించింది. ఈ అంశంపై నేడు బోర్డు నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బైబ్యాక్ కోసం కంపెనీ రూ. 200-250 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్లర్క్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 528కు చేరింది. ఆపై కొంత మందగించింది. ప్రస్తుతం 7.5 శాతం ఎగసి రూ. 513 వద్ద ట్రేడవుతోంది. గతేడాది షేరుకి రూ. 1500 ధరలో 1.75 మిలియన్ షేర్లను ఈక్లర్క్స్ బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 262 కోట్లను వెచ్చించింది. ఈక్లర్క్స్‌లో మార్చికల్లా ప్రమోటర్లకు 50.76 శాతం వాటా ఉంది. శోభా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో అమ్మకాల పరిమాణం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)తో పోలిస్తే 70 శాతం జంప్‌చేసినట్లు రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఆన్లైన్ టెక్నాలజీ, సొంత వ్యాపార విధానాలు, శోభా బ్రాండుపట్ల విశ్వాసం వంటి అంశాలు దోహదం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభా షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. గత క్యూ4లో కంపెనీ నికర లాభం సగానికిపైగా తగ్గి రూ. 51 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు క్షీణించింది. -
టెక్ మహీంద్రా బై బ్యాక్
సాక్షి, ముంబై : సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నామని టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా లిమిటెడ్ బోర్డు బైబ్యాక్‌ప్రతిపాదను ఆమోదం తెలిపింది రూ. 1956 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు ఆమోదం లభించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గురువారం తెలిపింది. షేరుకి రూ. 950 ధర మించకుండా దాదాపు 2.06 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ. 956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత ట్రేడింగ్ రేటుకు 14.59 ప్రీమియం ధరలో బై బ్యాక్ చేపడుతున్నట్టు పేర్కొంది. బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం టెక్ మహీంద్రా 2.1 శాతం లాభాల్లో రూ.830 స్థాయి వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రూ.840 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఎల్ అండ్ టీ బై బ్యాక్‌కు సెబీ నో
ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టుబ్రోకు సెబీ నిరాశను మిగిల్చింది. రూ. 9వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు సెబీ అనుమతినివ్వలేదు. ఈ మేరకు ఎల్ అండ్ టీ శనివారం రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబి నిబంధనలకు అనుగుణంలేని కారణంగా బై బ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించిందని పేర్కొంది. కాగా ఈక్విటీ షేరు రూ. 1475 వద్ద సుమారు 6.1 కోట్ల షేర్లను బై బ్యాక్ చేయనున్నామని గత ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. -
ఆయిల్ ఇండియా షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా షేర్లను బైబ్యాక్ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆయిల్ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది. షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.5,000 కోట్లు ! ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రా -
షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా బైబ్యాక్ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.687 కోట్లకు పెరి గింది. బైబ్యాక్‌కు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో నాల్కో షేర్ స్వల్పంగా లాభపడి రూ.66.95 వద్ద ముగిసింది. -
ఐటీ దిగ్గజాలు.. చలో బైబ్యాక్!
ఈ నెల 20న బోర్డు సమావేశంలో టీసీఎస్ ప్రకటన.. • ఇన్ఫోసిస్, విప్రో కూడా ఇదే బాటలో...! • భారీ నగదు నిల్వలను వాటాదారులకు పంచాలన్న డిమాండ్ల నేపథ్యం • ఇటీవలే 340 కోట్ల డాలర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన కాగ్నిజంట్ న్యూఢిల్లీ: కుప్పలుతెప్పలుగా నగదు నిల్వలతో తులతూగుతున్న ఐటీ దిగ్గజాలు... ఇన్వెస్టర్లను శాంతింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి. పోటాపోటీగా షేర్ల బైబ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ గురువారం బైబ్యాక్ ప్రతిపాదనను బయటపెట్టింది. ఇక ఇన్ఫోసిస్ కూడా దీనికోసం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ఇటీవల కాగ్నిజంట్ టెక్నాలజీస్ 340 కోట్ల డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్దినెలల క్రితం రూ. 2500 కోట్ల విలువైన బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం విప్రో నుంచి కూడా మరో బైబ్యాక్ వుండవచ్చని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి. ఇక భారీగా నగదు నిల్వలు ఉన్న మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 20న టీసీఎస్ బోర్డు సమావేశం... షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 20న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుందని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించనున్నదీ, ఎన్ని షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. దీనిపై బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిర్ధిష్టమైన డివిడెండ్ పాలసీతో పాటు కంపెనీ వద్దనున్న నగదు పంపిణీ కోసం షేర్ల బైబ్యాక్‌పై దృష్టిపెట్టా ల్సిందిగా ఇన్వెస్టర్ల నుంచి సూచనలు వస్తున్నాయంటూ టీసీఎస్ సీఈఓ ఎన్.చంద్రశేఖరన్ కూడా వెల్లడించారు. దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా, గడిచిన కొన్నేళ్లుగా తమ కంపెనీ వాటాదారులకు డివిడెండ్ చెల్లింపులను పెంచుతూనే వస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 2016 డిసెంబర్ నాటికి టీసీఎస్ వద్ద రూ.43,169 కోట్ల విలువైన నగదు నిల్వలు ఉన్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న టీసీఎస్ షేరు.. గురువారం బీఎస్ఈలో 1.3% లాభపడి రూ.2,447 వద్ద ముగిసింది. ఇక ఇన్ఫోసిస్ షేరు కూడా 3% ఎగబాకి రూ.1,012 వద్ద స్థిరపడింది. ఇన్ఫీపై ఒత్తిడి... వేతన ప్యాకేజీల విషయంలో వ్యవస్థాపకులకు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య తీవ్ర విభేదాలు వెలుగుచూసిన ఇన్ఫోసిస్లోనూ చాన్నాళ్లుగా బైబ్యాక్ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ఫీలో కార్పొరేట్ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా కీలక వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో, కంపెనీ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని విషయాల్లో బోర్డుకు, వ్యవస్థాపకులకు అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ... కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు మాత్రం లేవంటూ ఇన్ఫీ చైర్మన్ శేషసాయి, కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా తాజాగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. మరోపక్క, కంపెనీ మాజీ సీఎఫ్ఓలు మోహన్‌దాస్ పాయ్, వి. బాలకృష్ణన్‌లు ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాల్సిందేనంటూ మరోసారి తాజాగా గళం విప్పారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం, వారికి మరింత విలువను చేకూర్చడానికి ఈ చర్యలు తప్పనిసరి అని కూడా వారు చెబుతున్నారు. నిధుల కేటాయింపులపైనా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.. 2014లో ఇన్ఫోసిస్ సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టినప్పుడు(తొలి ప్రమోటర్‌యేతర సీఈఓగా) పాయ్, బాలకృష్ణన్‌లు ఇద్దరూ కంపెనీ 180 కోట్ల డాలర్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ వద్ద సుమారు(2016 డిసెంబర్ నాటికి) రూ.35,697 కోట్ల(525 కోట్ల డాలర్లు) నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల విలువైన షేర్లను ఇన్ఫోసిస్ బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేయొచ్చని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2.32,428 కోట్లుగా ఉంది. దీని ప్రకారం చూస్తే బైబ్యాక్ పరిమాణం ఈక్విటీ క్యాపిటల్‌లో 5 శాతం ఉంటుందని అంచనా. మేం వ్యతిరేకం కాదు ఇన్ఫీ సీఓఓ ప్రవీణ్ రావు ఇన్పోసిస్ నుంచి కూడా బైబ్యాక్ విషయంలో సంకేతాలు వెలువడ్డాయి. బైబ్యాక్‌కు తాము(కంపెనీ బోర్డు) వ్యతిరేకం కాదని ఇన్ఫీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ రావు గురువారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. గడిచిన నాలుగేళ్లుగా తాము డివిడెండ్ చెల్లింపులను పెంచుతూ వస్తున్నామని... తగిన సమయంలో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘వాటాదారుల నుంచి బైబ్యాక్ డిమాండ్లు సమంజసమే. అయితే, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరుచుకోవడం, వాటాదారులను సంతోషపెట్టడం మధ్య సమతుల్యతను సాధించే విషయంలో కంపెనీ వద్దనున్న నగదు నిల్వలను ఎలా వినియోగించుకోవాలన్న కీలకమైన బాధ్యత బోర్డుపైనే ఉంటుంది’ అని రావు వ్యాఖ్యానించారు. ఇన్ఫీ గనుక బైబ్యాక్‌ను ప్రకటిస్తే.. 35 ఏళ్ల కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారి అవుతుంది. ఎందుకు ప్రకటిస్తున్నాయంటే... దేశీ ఐటీ కంపెనీల వద్ద ఇప్పుడు భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీలు నిరుపయోగంగా ఇంత పెద్దమొత్తంలో నగదును అట్టిపెట్టుకుంటూ.. తమకు మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విదేశీ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ 340 కోట్ల డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించడంతో దేశీ ఐటీ కంపెనీలపై మరింత ఒత్తిడి పెరిగింది. మరోపక్క, ఐటీ కంపెనీలు తమ వద్దనున్న నగదు నిల్వలను అవసరం లేకున్నా కంపెనీల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నాయంటూ(ఇన్ఫోసిస్‌పై మాజీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి) ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా బైబ్యాక్ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలాఉండగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటం... యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా దేశీ ఐటీ కంపెనీల షేర్లు దిగజారుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడం, షేరు ధరకు ఊతం ఇచ్చేందుకు కూడా బైబ్యాక్ ఆఫర్లపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బైబ్యాక్ సంగతి ఇదీ.. ఒక కంపెనీ జారీ చేసిన ఈక్విటీ షేర్లను మార్కెట్లో లేదా ఓపెన్ టెండర్ ద్వారా తిరిగి కొనుగోలు చేయడాన్నే బైబ్యాక్‌గా వ్యవహరిస్తారు. బైబ్యాక్ చేపట్టడానికి పలు కారణాలు వుంటాయి. షేరు ధర ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, మిగులు నగదును ఖర్చుచేయడం ద్వారా ఈక్విటీని తగ్గించడం, ఇన్వెస్టర్లకు నగదును పంచడం వంటి అంశాలే కాకుండా పన్ను లాభాల్ని పొందడానికి కూడా ప్రమోటర్లు ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటుంటారు. తర్వాత వ్యాపార అవకాశాలు సన్నగిల్లడం, వృద్ధి మందగించడం వంటి సందర్భాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను బైబ్యాక్ రూపంలో ఖర్చు చేస్తాయి. దీనివల్ల కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్(షేర్లు) తగ్గి.. షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) పెరుగుతుంది. ఓపెన్ టెండర్ లేదా మార్కెట్ బైబ్యాక్ ఈ రెండు పద్ధతుల్లో షేర్లను తిరిగి కొనుగోలు చేస్తారు. బైబ్యాక్‌కు నిర్ధిష్ట వ్యవధి, ప్రస్తుత ధరపై ఎంతవరకు అధికంగా చెల్లించాలి(ప్రీమియం) అనేది కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. ఓపెన్ టెండర్ ద్వారా అయితే, బిడ్డింగ్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే మార్కెట్ బైబ్యాక్ పద్ధతిలో మాత్రం ప్రకటించిన మేరకు బైబ్యాక్‌ను పూర్తి చేయాలన్న నిబంధనేమీ లేదు. -
సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్
ఒక్కో షేర్‌కు రూ.900 బై బ్యాక్ ఆఫర్ ముంబై: సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. గురువారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్ల ను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించామని తెలిపింది. సన్ ఫార్మా,...ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్పెషాల్టీ జనరిక్ ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ ఉత్పత్తులు 150 కు పైగా దేశాల్లో లభిస్తాయి. గత ఆర్థిక సంవత్సం చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.35,400 కోట్లుకా గా, రిజర్వ్‌లు నగదు నిల్వలు రూ.31,100 కోట్లుగా, మొత్తం రుణ భారం రూ.9,750 కోట్లుగా ఉంది. ఈ బై బ్యాక్ వార్తలతో బీఎస్ఈలో కంపెనీ షేర్ ఇంట్రాడేలో 2% వరకూ ఎగసింది. చివరకు 1.5% లాభంతో రూ.752 వద్ద ముగిసింది. -
ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్
త్వరలో నోటిఫికేషన్ విలువ రూ.10,000 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ కంపెనీలు ఆయా కంపెనీల పెయిడప్ క్యాపిటల్(చెల్లించిన మూలధనం)లో 25 శాతం షేర్లను బై బ్యాక్ చేస్తాయని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం-గతంలో డిజిన్వెస్ట్మెంట విభాగం) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బై బ్యాక్ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేర్ 1.6 శాతం లాభపడి రూ.92 వద్ద, ఎంఓఐఎల్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.243 వద్ద ముగిశాయి.