సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్ | Sun Pharma board approves buyback of shares at Rs900 | Sakshi
Sakshi News home page

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

Published Fri, Jun 24 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్

ఒక్కో షేర్‌కు రూ.900 బై బ్యాక్ ఆఫర్

 ముంబై: సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన  షేర్లను బై బ్యాక్ చేయనున్నది.  గురువారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్ల ను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది.  ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించామని తెలిపింది. సన్ ఫార్మా,...ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్పెషాల్టీ జనరిక్ ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ ఉత్పత్తులు 150 కు పైగా దేశాల్లో లభిస్తాయి. గత ఆర్థిక సంవత్సం చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.35,400 కోట్లుకా గా, రిజర్వ్‌లు నగదు నిల్వలు రూ.31,100 కోట్లుగా, మొత్తం రుణ భారం రూ.9,750 కోట్లుగా ఉంది. ఈ బై బ్యాక్ వార్తలతో బీఎస్‌ఈలో  కంపెనీ షేర్ ఇంట్రాడేలో 2% వరకూ ఎగసింది. చివరకు 1.5% లాభంతో రూ.752 వద్ద  ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement