Sun Pharma Company
-
టెస్టింగ్‌లో ఫెయిలైన సన్‌ఫార్మ హైబీపీ జెనరిక్ డ్రగ్: భారీ రీకాల్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. అధిక రక్తపోటు చికిత్సలో వాడే జనరిక్ మందు అమెరికా మార్కెట్లో డిసల్యూషన్ టెస్టింగ్‌లో విఫలమైంది. దీంతో 34వేలకు పైగా జెనరిక్ మందుల బాటిళ్లను రీకాల్ చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని సన్ ఫార్మాకు చెందిన ఏంజినా అధిక రక్తపోటు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ సమస్యకు చికిత్స చేయడానికి ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని వాడటంతో తాత్కాలిక లేదా వైద్యపరంగా రివర్సిబుల్ ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణం కావచ్చు లేదా తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య పరిణామాల సంభవించవచ్చని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరించింది. "స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ(డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్, ఎఫ్‌డీఏ ల్యాబ్‌లో డిసోల్యూషన్ టెస్టింగ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రభావితమైన లాట్‌ను రీకాల్ చేస్తోంది. ముంబైకి చెందిన డ్రగ్ మేజర్ గుజరాత్‌లోని ప్లాంట్లోవీటిని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 13న క్లాస్ II దేశవ్యాప్తంగా రీకాల్ (అమెరికా)ను ప్రారంభించింది. కాగా మల్టిపుల్ మైలోమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల విక్రయాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్టు సన్‌ఫార్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 శాతం ఎగసి రూ. 2,262 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,047 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,626 కోట్ల నుంచి రూ. 10,952 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,562 కోట్ల నుంచి రూ. 8,625 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీ ఫార్ములేషన్ల అమ్మకాలు 8 శాతంపైగా పుంజుకుని రూ. 3,460 కోట్లను తాకాయి. యూఎస్ విక్రయాలు 14 శాతం ఎగసి 41.2 కోట్ల డాలర్ల(రూ. 3,400 కోట్లు)కు చేరాయి. గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు మరింత అధికంగా 27 శాతం జంప్‌చేసి 20 కోట్ల డాలర్లను అందుకున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి ఫార్ములేషన్ల విక్రయాలు 7 శాతం బలపడి 25.9 కోట్ల డాలర్లను(రూ. 2,140 కోట్లు) తాకాయి. అయితే ఇతర దేశాల నుంచి ఆదాయం 4 శాతం క్షీణించి 18.1 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం లాభంతో రూ. 1,033 వద్ద ముగిసింది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
రాష్ట్రంలో సన్ ఫార్మా ప్లాంట్
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సంఘ్వీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి జగన్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం తెలిపారు. అనంతరం సమావేశం వివరాలను దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. ఆ వివరాలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం ముఖ్యమంత్రిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల మీద ఆయనకున్న అవగాహనకు నేను ముగ్థుడినయ్యాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ముఖ్యమంత్రి విధానంగా స్పష్టమవుతోంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవ వనరులను తయారుచేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఆయనున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మా కంపెనీ తరఫున మేం కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పాం. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని.. తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పాం. కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటుచేయడానికి అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామన్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యాల్లో భాగం. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు. -
ఏపీలో మరో భారీ పెట్టుబడి
-
కరోనాకు అతిచవక మందు వచ్చేసింది
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19 కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటినిచ్చే వార్తను సన్ ఫార్మా అందించింది. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను ప్రారంభించినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది. ఈ ఔషధం ఒక్కో టాబ్లెట్ ధరను కేవలం 35 రూపాయలుగా నిర్ణయించింది. అతి తక్కువ ధరలో ఎక్కువమంది బాధితులకు తమ మందును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్లూగార్డ్‌ను అవిష్కరించామని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. తద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనేది లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం, ఇతరులతో కలిసి పనిచచేయనున్నామని ప్రకటించారు. ఈ వారంలో ఫ్లూగార్డ్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందన్నారు. తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు సంభావ్య చికిత్స కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక నోటియాంటీ-వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ అని ఫార్మా సంస్థ తెలిపింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఫావిపిరవిర్‌ను అభివృద్ధి చేస్తున్న లేదా విక్రయించే ఇతర భారతీయ ఫార్మా కంపెనీల్లో గ్లెన్‌మార్క్ ఫార్మా, సిప్లా, హెటెరో ల్యాబ్‌లు ఉన్న సంగతి విదితమే. -
సన్ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం, సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1,387 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,057 కోట్ల నికర లాభం ఆర్జించామని సన్ ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం గత క్యూ1లో రూ.7,224 కోట్లు, ఈ క్యూ1లో రూ.8,374 కోట్లుగా నమోదయ్యాయని సన్ ఫార్మా ఎమ్డీ దిలిప్ సంఘ్వి తెలిపారు. జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీ ఈ ఏడాది జనవరి 1 నుంచి తమ అనుబంధ కంపెనీగా మారిందని, అందుకే గత క్యూ1, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఆర్ అండ్ డీ పెట్టుబడులు రూ.422 కోట్లు ... పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులు ఈ క్యూ1లో రూ.422 కోట్లని దిలీప్ సంఘ్వి తెలిపారు. ఇది మొత్తం అమ్మకాల్లో 5 శాతమని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు గత క్యూ1లో రూ.500 కోట్లని, మొత్తం అమ్మకాల్లో 7 శాతమని వివరించారు. అన్ని మార్కెట్లలో మంచి వృద్ధి సాధించామని, పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలకు అనుగుణంగానే తమ పనితీరు ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన మోలిక్యూల్స్ పరిశోధనలో ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. అగ్రస్థానంలో సన్ ఫార్మా.... ఈ క్యూ1లో భారత బ్రాండెడ్ ఫార్ములేషన్స్ వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ.2,314 కోట్లకు పెరిగిందని దిలీప్ సంఘ్వి తెలిపారు. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 28 శాతమని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 36 శాతం వాటా ఉన్న అమెరికా అమ్మకాలు 12 శాతం వృద్ధితో 42 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. మరో అనుబంధ సంస్థ టారో నికర అమ్మకాలు 4 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరగ్గా, నికర లాభం మాత్రం స్వల్పంగా తగ్గి 6.6 కోట్ల డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో అమ్మకాలు 19 కోట్ల డాలర్లుగా ఉన్నాయని, ఎలాంటి వృద్ధి లేదని వివరించారు. రూ.1,32,000 కోట్ల భారత ఫార్మా మార్కెట్లో 8.2 శాతం వాటాతో సన్ ఫార్మాదే అగ్రస్థానమని ఏఐఓసీడీ అవాక్స్ జూన్–2019 నివేదిక వెల్లడించిందని దిలిప్ సంఘ్వి పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్భారీగా పతనమైనా,సన్ ఫార్మా మాత్రం లాభపడింది. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3.7 శతం లాభంతో రూ.438 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో లాభపడిన రెండే షేర్లలో ఇది కూడా ఒకటి. -
సన్‌ఫార్మాకు మరో భారీ షాక్ : షేరు పతనం
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా షేరు శుక్రవారం భారీగా పతనాన్ని నమోదు చేసింది. అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీ కార్పొరేట్ పాలనపై తాజా ఆందోళనల నేపథ్యంలో ఇంట్రాడేలో సన్‌ఫార్మా ఏకంగా 13 శాతానికి పైగా నష్టపోయి, టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతో 6 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. సన్ ఫార్మా షేరు పడిపోవడంతో ఫార్మా ఇండెక్స్ కూడా పతనమైంది. సెబీకి అందిన ఫిర్యాదు మేరకు ప్రకారం సంస్థకు సంబంధించి అనేక కీలకమైన అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటికే ప్రమోటర్లపై నమ్మకం కోల్పోతున్న తరుణంలో మరో వార్త సన్ ఫార్మాపై కోలుకోలేని దెబ్బగా పరిణమించబోతోంది. మనీలైఫ్ మేగజైన్ ప్రకారం.. ఆదిత్య మెడీసేల్స్ అనే సోల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను సన్ ఫార్మా ప్రమోటర్లు దిలీప్ సంఘ్వీ, సునీల్ వాడియా ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తేలింది. 2014 నుంచి 2017 మధ్యకాలంలో ఆదిత్య మెడిసేల్స్ కంపెనీ.. సన్ ఫార్మా సహ వ్యవస్థాపకుడు సుధీర్ విలియాకు నియంత్రణలోని సురక్ష రియల్టీ మధ్య రూ.5,800 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటికి తోడు ఆదిత్య మెడీ ద్వారా సురక్షా రియాల్టీ అనే సంస్థతో కలిసి సుమారు ఐదారువేల కోట్ల లావాదేవీలు జరిపినట్టు మనీ లైఫ్ ప్రచురించింది. సంస్థ ప్రమోటర్లుగా సన్ ఫార్మాను అడ్డం పెట్టుకుని ప్రమోటర్లు వ్యక్తిగత వ్యాపారాలను కొనసాగిస్తున్నారంటూ ఒక వ్యక్తి సెబీకి ఫిర్యాదు చేశారు. ర్యాన్‌బాక్సీ ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సెబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తే సన్ ఫార్మాపై తాజాగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ సంఘ్వీ సహా అతని బావమరిది సుధీర్ వాలియాపై సెబీకి 172 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో అనేక సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో సెబీ దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం. -
సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్
ఒక్కో షేర్‌కు రూ.900 బై బ్యాక్ ఆఫర్ ముంబై: సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. గురువారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్ల ను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించామని తెలిపింది. సన్ ఫార్మా,...ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్పెషాల్టీ జనరిక్ ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ ఉత్పత్తులు 150 కు పైగా దేశాల్లో లభిస్తాయి. గత ఆర్థిక సంవత్సం చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.35,400 కోట్లుకా గా, రిజర్వ్‌లు నగదు నిల్వలు రూ.31,100 కోట్లుగా, మొత్తం రుణ భారం రూ.9,750 కోట్లుగా ఉంది. ఈ బై బ్యాక్ వార్తలతో బీఎస్ఈలో కంపెనీ షేర్ ఇంట్రాడేలో 2% వరకూ ఎగసింది. చివరకు 1.5% లాభంతో రూ.752 వద్ద ముగిసింది. -
ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్
ముంబై: ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ షేర్ల ట్రేడింగ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో వచ్చే నెల 6 నుంచి ఆగిపోనున్నది. ఈ కంపెనీ సన్‌ఫార్మా కంపెనీలో విలీనమవుతున్నందున ఆ రోజు నుంచి ర్యాన్‌బాక్సీ షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ కావు. వచ్చే నెల 1వ తేదీ వీటి ట్రేడింగ్‌కు చివరి తేదీ. (వచ్చే నెల 2న మహావీర్ జయంతి, 3న గుడ్‌ఫ్రైడ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు) ర్యాన్‌బాక్సీ కంపెనీని 400 కోట్ల డాలర్లకు సన్ ఫార్మా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనానికి అన్ని రకాలైన అనుమతులు లభించడంతో ర్యాన్‌బాక్సీని స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి సన్ ఫార్మా డీలిస్ట్ చేయనున్నది. ర్యాన్‌బాక్సీ వాటాదారులకు షేర్ల కేటాయింపుకు ఏప్రిల్ 7వ తేదీని రికార్డ్ డేట్‌గా సన్‌ఫార్మా నిర్ణయించింది. రూ.5 ముఖ విలువ గల 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు రూ.1 ముఖ విలువ గల సన్ ఫార్మా షేర్లు ఎనిమిదింటిని కేటాయిస్తారు. ఈ విలీనం కారణంగా సన్‌ఫార్మా ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఫార్మా కంపెనీగా అవతరించనున్నది. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా 1.4 శాతం వృద్ధితో రూ.1,052 వద్ద, ర్యాన్‌బాక్సీ కూడా 1.4 శాతం వృద్ధితో రూ.831 వద్ద ముగిశాయి. ఆర్అండ్డీపై మరింత దృష్టి...: సంఘ్వీ ర్యాన్‌బాక్సీ విలీనం పూర్తి కావడంతో ఇకపై పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ చెప్పారు. ఇరు సంస్థల కలయికవల్ల రాబోయే మూడేళ్లలో 250 మిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరగలదన్నారు. అయిదు ఖండాల్లో 150 పైగా దేశాల్లో తమ ఉత్పత్తుల విక్రయం జరుగుతుందని సంఘ్వీ తెలిపారు. -
ఎస్బీఐను దాటేసిన సన్‌ఫార్మా
మార్కెట్ క్యాప్‌లో ఎనిమిదో స్థానానికి ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సన్ ఫార్మా కంపెనీ దాటేసింది. సన్ ఫార్మా షేర్ మంగళవారం ఎన్ఎస్ఈలో 1 శాతం లాభపడి 1,040 వద్ద ముగియడంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,15,333 కోట్లకు పెరిగింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,11,131 కోట్లకు చేరింది. టాప్‌టెన్ మార్కెట్ క్యాప్ కంపెనీల్లో సన్ ఫార్మా 8 వస్థానాన్ని సాధించింది. ఎస్బీఐ తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. కాగా అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా రూ.5,04,069 కోట్లతో టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు నిలిచాయి. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ షేర్ల సంఖ్యతో గుణిస్తే, మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది, షేర్ ధరలో మార్పు వల్ల ఈ విలువ ప్రతి రోజూ మారుతూ ఉంటుంది.