khammmam
-
వీళ్లు మనుషులు కాదు రాక్షసులు
సాక్షి, ఖమ్మం : మూగ జీవాల పట్ల ప్రేమగా వ్యవహరించాల్సింది పోయి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన కోతిని చంపిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో సాదు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న తొట్టిలో నీటిని తాగేందుకు వచ్చిన కోతి ప్రమాదవశాత్తు అందులో పడిపోగా దానిని రక్షించాల్సింది పోయి రాళ్లతో, కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. సమీపంలోనే ఉన్న కోతుల గుంపు అక్కడకు రాగా వాటిని పారదోలేందుకు మరో కోతిని పట్టుకొని చెట్టుకు ఉరివేసి, కుక్కలను వదిలి దారుణంగా హింసించి చంపారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! ) ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. దీంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించి సాదు వెంకటేశ్వరరావు, జోసెఫ్‌రాజా, జి.గణపతి అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మండల అటవీశాఖ సెక్షన్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ( కొండెంగకు గోరుముద్దలు తినిపించిన మహిళ) -
తహసీల్దార్ వేధింపులు భరించలేకపోతున్నాం
కూసుమంచి,ఖమ్మం : తహసీల్దార్ కృష్ణ వేధింపులను భరించలేకపోతున్నామని గురువారం మండలంలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు సామూహికంగా విధులను బహిష్కరించారు. అనంతరం ఖమ్మం వెళ్లి ఆర్డీఓ పూర్ణచంద్రకు వినతిపత్రం రూపంలో తమ గోడును చెప్పుకున్నారు. తహసీల్దార్ తీరు మారేంత వరకు తాము విధులకు రాబోమని తేల్చి చెప్పారు. తొలుత వీరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం మండల అధ్యక్షుడు షేక్ నాగులుమీరా విలేకరులతో మాట్లాడుతూ.. కూసుమంచి తహసీల్దార్ కృష్ణ వీఆర్ఓలు, వీఆర్ఓలను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. తమకు జీతాలు కూడా సక్రమంగా అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. పని ఉన్నా లేకున్నా అర్థరాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సిబ్బంది పట్ల తహసీల్దార్ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదన్నారు. గతంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం సమయంలో తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు రేయింబవళ్లు కష్డపడి పనిచేశామని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకున్నా రాత్రి వరకు ఆఫీసులోనే ఉంచుతున్నారని వాపోయారు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళతామని విన్నవించుకున్నా ససేమిరా అంటున్నారన్నారు. ఉదయం 6 గంటలకే కార్యాలయానికి వచ్చి రాత్రి 10 వరకు ఉండాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. అనంతరం వీఆర్ఓల ఆందోళనకు మద్దతు తెలిపిన సంఘం రాష్ట్ర నాయకుడు గరికె ఉపేందర్‌రావు మాట్లాడుతూ.. తహసీల్దారు తీరును తప్పుబట్టారు. తమకు కూడా ఇతర ఉద్యోగుల వలె అన్ని హక్కులూ ఉంటాయన్నారు. ప్రభుత్వ పాలనలో తామే కీలకం కాబట్టి కొన్ని సమాయా ల్లో అదనంగా పనిచేయాల్సి వస్తోందన్నారు. దా న్ని అడ్డుపెట్టుకుని తహసీల్దారు కావాలని పనివత్తిడి పెంచి వీఆర్ఓలను, వీఆర్ఏలను మానసికం గా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తహసీల్దారు తీరుపై ఉన్నతాధికారులకు విన్నవిస్తామని అన్నారు. తీరు మార్చుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
మోదీది రైతు వ్యతిరేక పాలన
ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందని, దీం తో రైతుల హత్యలు, ఆత్మహత్యలు పెరిగాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ నాయ కులు రాయల చంద్రశేఖర్, తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్ ఆరోపిం చారు. బుధవారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తున్న రైతాంగంపై పోలీసు లు కాల్పులు జరిపి ఏడాదైన సందర్భంగా నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ గద్దెనెక్కిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలను అ నుసరిస్తోందని, దీంతో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. మంద సోర్‌లో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులు రోడ్డు ఎక్కితే పోలీసులచే ప్రభుత్వం ఆరుగురు రైతులను హత్య చేయించిందని ఆరోపించారు. మందసోర్లో జరిగిన హత్యలతో రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్య కార్యాచరణగా ఏర్ప డి రైతుల అప్పులను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని బలమైన ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మందసోర్లో అమరులైన రైతులను స్ఫూర్తిగా తీసుకొని రైతు సమస్యలు పరిష్కారమయ్యే వర కు రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, బండి రమేశ్, తాతా భాస్కర్‌రావు, కట్టా గాంధీ, సిద్దినేని కోటయ్య, బోడెపూడి వీరభద్రం, బి.రామ్మూర్తి, మల్లయ్య, శ్రీనివాస్, హనుమంతరావు, సంఘయ్య తదితరులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు -
బొంద పెడతాం.. పెట్టనీయం
పోలేపల్లి ఫోర్త్‌క్లాస్ కాలనీలో హైడ్రామా కాలనీ పక్కనే శవ దహనంపై స్థానికుల ఆందోళన మరోసారి ఇలా జరగనీయమన్న యూనియన్ నేతలు ఖమ్మం రూరల్: పోలేపల్లి నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో బుధవారం సాయంత్రం హైడ్రామా చోటుచేసుకుంది. రాజీవ్‌గృహకల్పకు చెందిన రిటైర్డ్ ఫోర్త్‌క్లాస్ ఉద్యోగి భిక్షపతి మృతదేహాన్ని కాలనీ చెంతనే ఉన్న మున్నేరు ఒడ్డున పూడ్చివేసేందుకు బంధువులు, యూనియన్ నాయకులు సిద్ధమయ్యారు. జనావాసాల మధ్య ఎట్టి పరిస్థితిలో శవాన్ని పూడ్చనీయమని కాలనీ వాసులు ఆందోళనకు పూనుకున్నారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది అక్కడికి వచ్చారు. యూనియన్ నాయకులు, కాలనీ వాసులతో చర్చించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య జోక్యం చేసుకొని..‘ ఇప్పటికే మృతదేహాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఈ శవం ఒక్కదాన్ని మాత్రమే ఇక్కడ ఖననం చేస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలకు తావివ్వం. మీకు కావాలంటే హామీ పత్రం ఇస్తాను.’ అని స్థానికులకు నచ్చజెప్పడంతో శాంతించారు. హామీపత్రం ఇస్తేనే ఖననానికి అంగీకరిస్తామనడంతో గురువారం రాసిస్తానని అంగీకరించారు.