ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందని, దీం తో రైతుల హత్యలు, ఆత్మహత్యలు పెరిగాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ నాయ కులు రాయల చంద్రశేఖర్, తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్ ఆరోపిం చారు.
బుధవారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌లో రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తున్న రైతాంగంపై పోలీసు లు కాల్పులు జరిపి ఏడాదైన సందర్భంగా నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ గద్దెనెక్కిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలను అ నుసరిస్తోందని, దీంతో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని పేర్కొన్నారు.
మంద సోర్‌లో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులు రోడ్డు ఎక్కితే పోలీసులచే ప్రభుత్వం ఆరుగురు రైతులను హత్య చేయించిందని ఆరోపించారు. మందసోర్‌లో జరిగిన హత్యలతో రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్య కార్యాచరణగా ఏర్ప డి రైతుల అప్పులను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని బలమైన ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
మందసోర్‌లో అమరులైన రైతులను స్ఫూర్తిగా తీసుకొని రైతు సమస్యలు పరిష్కారమయ్యే వర కు రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, బండి రమేశ్, తాతా భాస్కర్‌రావు, కట్టా గాంధీ, సిద్దినేని కోటయ్య, బోడెపూడి వీరభద్రం, బి.రామ్మూర్తి, మల్లయ్య, శ్రీనివాస్, హనుమంతరావు, సంఘయ్య తదితరులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment