Kharif crop loan
-
రైతుబంధుకు రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. చెక్కులిస్తే నగదెట్లా? చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు. కందుల సొమ్ములోనూ.. ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. -
పంటరుణ లక్ష్యం చేరేనా?
నల్లగొండ అగ్రికల్చర్ : ఖరీఫ్ పంటరుణం పొందడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత పంటరుణాలను మాఫీ చేస్తామని చెప్పి 25 శాతం నిధులను మాత్రమే విడుదల చేసిన విషయం విదితమే. వెంటనే ఖరీఫ్ పంట రుణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం అనేక కొర్రీలను పెట్టింది. దీంతో రైతులకు సకాలంలో పంటరుణాలు అందడం లేదు. పహాణీ కాపీ, రుణమాఫీ పత్రం, ఫొటో జత చేసి ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌కార్డు జీరాక్స్‌ను బ్యాంకు లో సమర్పిస్తేనే తిరిగి పంటరుణాలను ఇవ్వాలని మెలికపెట్టడం రైతుల పాలిట శాపంగా మారింది. కొన్ని ప్రాంతాలలో రైతుల భూముల వివరాలను కంప్యూటరీకరణ చేయకపోవడంతో మీసేవ కేంద్రాలలో పహాణీ కాపీలు రావడం లేదు. పహాణీని రాసి ఇవ్వాలని రైతులు కోరినా సాధ్యం కాదని రెవెన్యూ సిబ్బం ది ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటి కోసం మీసేవ కేంద్రాలలో పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికీ తీసుకోవడం సాధ్యం కాక చాలామంది రైతులు వెనుదిరిగి వెళ్తున్నారు. అదే విధంగా రుణమాఫీపత్రం, ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత గ్రామాల వీఆర్ఓలు సర్టిఫై చేస్తే మండల తహసీల్దార్ సంతకంతో ఇవ్వాల్సి ఉంది. ఇబ్బందులకు గురిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది రైతులు సంబంధిత సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాలకు తిరిగిపోతున్నప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఉన్నా సర్టిఫికెట్లను ధ్రువీకరించడానికి నానా కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వీఆర్ఓల సంతకాల కోసమే రెండుమూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, తీసుకున్న వాటిని బ్యాంకులో ఇవ్వడానికి కనీసం వారం రోజులు పడుతుందని పేర్కొం టున్నారు. అధికారుల పనితీరు ఇలా ఉంటే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ పంటరుణ లక్ష్యం పూర్తికి రెండు రోజులే గడువు ఖరీఫ్‌లో రైతులకు రూ.1226 కోట్ల పంటరుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. బ్యాంకుల అనాసక్తి, రెవెన్యూ సిబ్బంది సకాలంలో సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం కారణంగా నేటివరకు రూ.812 కోట్ల మేర పంట రుణాలను 2లక్షల 2 వేల 822 మంది రైతులకు అందజేశారు. ఈ నెల 30వ తేదీ వరకు నిర్దేశించిన పంటరుణాలను పంపిణీ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్ని కొర్రీలు పెడుతూ ఉంటే రెండు రోజులలో ఇంకా రూ. 414 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయడం ఎలా సాధ్యమో అధికారులకే తెలియాలి. కొర్రీలను తొలగించాలి పంటరుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొర్రీలను వెంటనే తొలగించడంతోపాటు గడువును పెంచి అందరికీ పంట రుణాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ కాలం పూర్తయ్యే వరకు కూడా పంట రుణాల కోసం బ్యాంకులు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడానికి సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పంటరుణాలకు.. ముగిసిన గడువు
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు రుణాలు మాఫీ చేసి తిరిగి రుణాలను ఇప్పిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కేవలం 25 శాతం నిధులు రూ.633 కోట్లను మాత్రమే బ్యాంకులలో జమచేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలను మాఫీ చేస్తుందన్న భరోసాతో రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లించకుండా జాప్యం చేశారు. ప్రభుత్వం కూడా రుణమాఫీపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాం కులు రుణాలను ఇవ్వకుండా మొండికేశాయి. సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ పంట రుణాల చెల్లింపునకు గడువు ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలను ఇవ్వకుండా నిరాకరిస్తూ జాప్యం చేయడంతో అధికారులు ఈ నెల 15 వరకు రుణాలను చెల్లించడానికి గడువు పెంచారు. జిల్లాలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.1126 కోట్లకు గాను బుధవారం గడువు ముగిసే నాటి వరకు రూ.672.76 కోట్లను 1,51,452 మంది రైతులకు మ్రాతమే బ్యాంకర్లు పంట రుణాలను మంజూరు చేశారు. ఇందులో రాష్ర్ట ప్రభుత్వం రుణాల మాఫీలో భాగంగా బ్యాంకులలో జమచేసిన నిధులనే రైతులకు రుణాలుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గత ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.1011.80 కోట్లకు గాను రికార్డు స్థాయిలో రూ.1041.56 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఫలించని ప్రయత్నాలు.. ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో రైతులకు పంటరుణాలను ఇప్పించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను నియమించింది. ఇందులో రెవెన్యూ, వ్యవసాయ శాఖతో పాటు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. గ్రామాల వారీగా పర్యటించి క్షేత్ర స్థాయిలో అర్హులైన రైతులను గుర్తించి ఆయా బ్యాంకుల వారీగా జాబితాలను సిద్ధం చేసి వారందరికీ రుణాలను ఇప్పించే బాధ్యతలను అప్పగించారు. ఆయా బృందాలు గత 20 రోజులుగా గ్రామాలలో పర్యటించి అర్హులైన జాబితాలను రూపొందించి ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం రాకుండా పోయింది. వడ్డీవ్యాపారులను ఆశ్రయించిన రైతులు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకుండా జాప్యం చేయడంతో అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను, ఫైనాన్స్‌లను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో సాదారణ సాగు 4లక్షల 83 వేల హెక్టార్లకు గాను సుమారు 5లక్షల హెక్టార్లలో పత్తి, వరితో పాటు ఇతర పంటలను సాగు చేశారు. దీని కోసం నూటికి రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలను చెల్లించడానికి సిద్దపడి కోట్లాది రూపాయలను అప్పు లు చేసి పెట్టుబడులను పెట్టారు.