kia industry
-
71 వేల కార్స్ ను రీకాల్ చేసిన కియా ..
-
బంపర్ ఆఫర్: ఆ కారుపై రూ.3.75 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్ మార్కెట్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్రీమియం వేరియంట్ కియా కార్నివాల్ ఎంపీవీ కారుపై రూ.3.75 లక్షల వరకు లబ్ధి చేకూరేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేసిన కష్టమర్లకు ఆఫర్ వర్తిస్తుందని కియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ కారు అసలు ధర రూ.24.95 లక్షలు ఉండగా..షోరూమ్ లో దీని ధరపై రూ .2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు వార్షిక నిర్వహణ ఖర్చులు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలతో పాటు ఇతర ఖర్చుల కింద రూ.1.25లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ కారును రూ .21.20లక్షలకే సొంతం చేసుకోవచ్చు. కాగా ,గతేడాది జరిగిన ఆటో ఎక్స్ పోలో 2020 కియా కార్నివాల్ ఎంపీవీ కారును ఇండియన్ మార్కెట్లో కియా విడుదల చేసింది. ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఈ కారు నాలుగు వరుసలు, తొమ్మిది సీట్లతో ఏర్పాటైంది. కారు లోపలి భాగం నప్పా లెదర్ అప్హోల్స్టరీతో డిజైన్ చేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. 200హెచ్‌పీ పవర్ శక్తిని గరిష్టంగా 440 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, క్యాబిన్లో అత్యాధునిక కార్ల టెక్నాలజీకి సపోర్ట్ చేసే సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. -
అనంతలో భారీ అగ్నిప్రమాదం
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ అనుబంధ స్క్రాప్ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదు వాహనాలు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని అదుపు చేసే సమయంలో తీవ్ర టెన్షన్‌కు గురై కియా ఫైర్‌స్టేషన్ మేనేజర్ పరంధామ (45) మృతి చెందాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి వాహన యజమానులు, కొందరు కూలీలు, గ్రామస్తులు రెండు వాహనాలను బయటకు తరలించగా మిగిలిన ఐదూ దగ్ధమయ్యాయి. సమీపంలోని రైతుల గడ్డివాములు కూడా కాలిపోయాయి. ప్రమాదంలో స్క్రాప్ కేంద్రంలో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లుంటుందని అంచనా. ట్రాన్స్‌కోకు రూ.3లక్షలు నష్టం జరిగిందని ఏఈ పరమేశ్వరరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శంకరనారాయణ పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. -
కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రం సహకరించకు న్నా ఈ ప్రాంత ప్రజల సాకారమయిన రామాయపట్నం పోర్టుతోపాటు షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం దుగరాజపట్నం పోర్టు ఇస్తానని ఇవ్వలేదని.. అందుకే రూ.4,200 కోట్లతో రామాయపట్నం నిర్మిస్తున్నామన్నారు. రామాయపట్నం పోర్టు, ఏషియన్, పల్ప్ అండ్ పేపర్ మిల్లు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2021కి 20.26 మిలియన్ టన్నుల కెపాసిటీతో పోర్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 29కి అనంతపురంలో కియా పరిశ్రమ తొలి కారు రోడ్డు మీదకు వస్తుందన్నారు. ఎన్నికలు ఒక్క నెల ఉన్నాయనగా అగ్రవర్ణాల రిజర్వేషన్లు తెరపైకి తెచ్చారని, అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. -
కియా పేరుతో దగా
పెనుకొండ రూరల్: కరువు పీడిత ‘అనంత’లో నెలకొల్పుతున్న కియా కార్ల పరిశ్రమ నిరుద్యోగుల్లో ఆశలుæ రేపుతోంది. అందులో ఉద్యోగాలంటే భారీ వేతనాలు ఉంటాయని, జీవితంలో స్థిరపడవచ్చని ఎంతోమంది విద్యావంతులు భావిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పెనుకొండ మండలం అమ్మవారుపల్లి సమీపంలో ఏర్పాటయ్యే కియా పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వమే చూస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిరుద్యోగుల అవసరాలను గుర్తించి, వారిని నిలువు దోపిడీ చేసేందుకు కొన్ని సంస్థలు తెగించాయి. కియా కార్ల పరిశ్రమతోపాటు అనుబంధ సంస్థలైన యూంగ్ చాంగ్, కుక్ బూ తదితర కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ‘కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ’ బోర్డు పెట్టింది. ఏ కేటగిరీ ఉద్యోగాలు.. ఎంతమంది అవసరమవుతాయి అనే వివరాలు తెలపకుండానే దరఖాస్తుల స్వీకరణకు తెర తీసింది. ఈ ప్రకటనకు ఆకర్షితులై ఇప్పటి వరకు నాలుగు వేలమందికి పైగా నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆ ఏజెన్సీ వారికి అందజేశారు. అసలు కియా అనుబంధ సంస్థలు ఏర్పాటు కాకముందే, కనీసం వాటి నుంచి టెండర్లు రాకుండానే నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి ఇలాంటి సంస్థలపై విచారణ చేసి నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. బోగస్ సంస్థలను నమ్మొద్దు అమ్మవారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కియాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ బోగస్ సంస్థ. నిరుద్యోగులు అలాంటి సంస్థలను నమ్మి మోసపోవద్దు. కియా పరిశ్రమలోనే కాదు వాటి అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు వెబ్సైట్ నుంచే వెలువడుతాయి. సదరు సంస్థపై విచారణ చేపడతాం. – రామమూర్తి, ఆర్డీఓ, పెనుకొండ -
పట్టా భూమికి పక్కా స్కెచ్
కియా మాటున దందా భూసేకరణ స్కెచ్‌లో తిరకాసు మొదటి స్కెచ్‌లోని 16 ఏకరాలు రెండవ స్కెచ్‌లో మాయం ముఖ్య ప్రజాప్రతినిధికి అనుకూలంగా మార్పులు బహిరంగ మార్కెట్లో 16 ఎకరాల విలువ రూ.24 కోట్లు రైతు నుంచి ఎకరా రూ.30.25 లక్షలకు కొనుగోలు అధికారం ఉంది... చెప్పింది వినే అధికారులూ ఉన్నారు. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. అంతిమంగా బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కియా’ను అడ్డంపెట్టుకుని కోట్లు కొళ్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. అనంతపురం అర్బన్: కియా మోటార్స్ పరిశ్రమకు సంబంధించి భూ సేకరణ మాటున అధికార పార్టీ నేతలు ‘జాదూ’కి తెరలేపారు. రూ.కోట్లు విలువ చేసే భూమిని తమ వశం చేసుకునేందుకు పథకం రచించారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు ‘ఒక్కటై’ వ్యవహారం నడిపారు. భూ సేకరణకు సంబంధించి తొలిగా విడుదల చేసిన స్కెచ్‌లో 16 ఎకరాల పట్టా భూమిని కూడా చేర్చారు. అయితే నాలుగులేన్ల రహదారిపై ఉన్న ఈ భూమిపైన అధికార పార్టీ నాయకులు కొందరు కన్నెశారు. ఒక ముఖ్యప్రజాప్రతినిధి సూచన మేరకు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి స్కెచ్‌లో మార్పులు చేశారు. మొదటి స్కెచ్‌లో సేకరణకు కింద చూసిన 16 ఎకరాల భూమి తప్పించి రెండవ స్కెచ్ సిద్ధం చేశారు. ఇలా కథ నడిపారు కియా మోటర్స్ పరిశ్రమ కోసం పెనుకొండ సమీపంలో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో 179 సర్వే నంబరులోని 16 ఎకరాల భూమిని కూడా సేకరించేలా తొలుత స్కెచ్‌ను విడుదల చేశారు. అయితే ఈ 16 ఎకరాల భూమి పరిశ్రమలకు ఎదురుగా ఉన్న రోడ్డు బిట్ కావఽడంతో తమ వశం చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కథ నడిపారు. రెవెన్యూ అధికారుల సాయంతో రెండవ స్కెచ్‌లో ఈ 16 ఏకరాల భూమిని తప్పించారు. భూమి విలువ రూ.24 కోట్లు ప్రస్తుతం కియా మోటర్స్ పరిశ్రమ పరిసరాల్లో రోడ్డు బిట్ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.1.50 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన 16 ఎకరాల భూమి విలువ రూ.24 కోట్లు ఉంటుంది. వాస్తవంగా భూ సేకరణ కింద భూమిని తీసుకుని ఉంటే ఎకరాకు రూ.10.50 లక్షలుగా ఇచ్చే వారు. భూ సేకరణ కింద 16 ఎకరాలు తప్పించి రైతులతో బేరసారాలు నడిపారు. రైతులు ఒప్పకోకపోతేæ 16 ఎకరాలను భూ సేకరణ కింద తిరిగి చేర్చాలని పథకం రచించారు. భూ సేకరణ కింద పోతే ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున 16 ఎకరాలకు రూ.1.68 కోట్లు మాత్రమే వస్తుందనీ, తాము చెప్పినట్లు వింటే ప్రభుత్వం ఇచ్చేదానికంటే రెండింతలు ఎక్కవగా ఇస్తామన్నారు. దీంతో రైతులు ఎకరా రూ.30.25 లక్షలకు విక్రయించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. 16 ఎకరాలకు గానూ ఇక్కడ రైతులకు వారు ఇచ్చేది రూ.4.84 కోట్లు. రైతులకు రూ.19.16 కోట్లు నష్టం ఈ భూమి వ్యవహారంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అధికార పార్టీకి చెందిన వారు ఇస్తున్న మొత్తమే ఎక్కవగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇందులో రైతులు నష్టపోయేది రూ.19.16 కోట్లు. భూసేకరణ నుంచి తప్పించిన భూమిని రైతులకు వదిలేసి ఉంటే వారికి లబ్ధి చేకూరేది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరా రూ.1.50 కోట్లకు విక్రయించుకునేవారు. ఈ లెక్కన 16 ఎకరాలకు వారికి రూ.24 కోట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు రైతుల నుంచి దక్కించుకున్న 16 ఎకరాల భూమి ద్వారా అధికార పార్టీ నాయకులకు భారీ లబ్ధి పొందారు.