Kichadi
-
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
అండుకొర్రల వంటలు
అండు కొర్రల కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు అండు కొర్రల రవ్వ – ఒక కప్పు ఉప్పు – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – అర కప్పు తరిగిన పచ్చి మిర్చి – 4 అల్లం తురుము – అర టీ స్పూను వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను తరిగిన టొమాటో – 1 కరివేపాకు – రెండు రెమ్మలు పసుపు – కొద్దిగా నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించాలి. గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? అండుకొర్రలు (Browntop Millet) నియాసిన్ (Niacin)mg (B3) 18.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.027 థయామిన్ (Thiamine) mg (B1) 3.2 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 0.65 కాల్షియం (Calcium)g 0.01 ఫాస్పరస్ (Phosphorous)g 0.47 ప్రొటీన్ (Protein)g 11.5 ఖనిజాలు(Carbo Hydrate) g 69.37 పిండిపదార్థం (Fiber) g 12.5 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 5.54 అండు కొర్రల పొంగలి కావలసినవి: అండు కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పుకొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంతమిరియాల పొడి – పావు టీ స్పూను జీలకర్ర – ఒక టీ స్పూను, జీడి పప్పులు – 10కరివేపాకు – 2 రెమ్మలు, నెయ్యి/నూనె – తగినంత తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఊతప్పం కావలసినవి: అండు కొర్రలు – పావు కప్పు మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఅల్లం పచ్చిమిర్చి ముద్ద – ఒక టీ స్పూను ఉప్పు – తగినంత, నూనె – తగినంతటొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఉప్మా కావలసినవి: అండు కొర్రల రవ్వ – 3 కప్పులు, నూనె – రెండు టేబుల్ స్పూన్లుపచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను, మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – 4, క్యారట్ తరుగు – పావు కప్పు, టొమాటో తరుగు – పావు కప్పుకరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత తయారీ: స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి (నూనె వేయకూడదు) దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యారట్ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. -
పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే...
దొగ్గలి ఆకు... తెల్ల గర్జల ఆకు... చెన్నంగి ఆకు... పప్పు కూర ఆకు... గునుకు ఉత్తరేణి ఆకు... వీటి పేర్లు విన్నారా? తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఆకు కూరలని, వీటిని మాత్రమే తినాలని అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది!ప్రకృతిలో చాలా ఆకుకూరలున్నాయి. తెలిసిన వారికి అవి మంచి కూరలు. తెలియని వారికి పిచ్చి కూరలు. ఈ ‘పిచ్చి’ మొక్కలకు ఉన్న రుచి ఏమిటో చూడండి. పప్పు కూర పకోడీ కావలసినవి: పప్పు కూర – రెండు కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి + ఉల్లి పేస్ట్ – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙పప్పుకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో తరిగిన పప్పు కూర వేసి, నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పప్పు కూర పకోడీ సిద్ధమైనట్లే. గునుగు/ ఉత్తరేణి కిచిడీ కావలసినవి: గునుగు/ఉత్తరేణి ఆకు కూర – ఒక కట్ట (రెండు కప్పుల ఆకు); మెంతి కూర – పావు కప్పు; పాల కూర – పావు కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; పచ్చి మిర్చి – 5; పెసర పప్పు – ఒక కప్పు; పుదీనా – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – అర కప్పు; బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని తయారీ: ∙ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో బియ్యం, పప్పులు, పల్లీలు, ఆకు కూరల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙మూత తీసి, కొత్తిమీరతో అలంకరించాలి ∙ఉల్లిపాయ పెరుగు పచ్చడితో అందించాలి. చెన్నంగి పచ్చడి కావలసినవి: చెన్నంగి ఆకు – మూడు కప్పులు; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న చెన్నంగి ఆకు వేసి పచ్చి దనం పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి ∙చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙వేయించి ఉంచుకున్న ఆకు, ఉప్పు జత చేసి మరోమారు మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙రొట్టెలు, అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. గురుమడి ఆకు వేపుడు కావలసినవి: గురు మడి ఆకు – రెండు కప్పులు; పెసర పప్పు – అర కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙గురుమడి ఆకును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి ∙సన్నగా తరగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక గురుమడి ఆకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ కొద్దిసేపయ్యాక నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఆకు బాగా వేగిందనిపించాక ఉల్లి తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మగ్గిన తరవాత దింపేయాలి. ఆకుకూర సజ్జ/జొన్న రొట్టె కావలసినవి: మనకు ఇష్టమైన ఆకు కూర తరుగు – రెండు కప్పులు; జొన్న పిండి లేదా సజ్జ పిండి – నాలుగు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – రొట్టెలు కాల్చడానికి తగినంత తయారీ: ∙ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆకు కూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆకు కూర బాగా చల్లారాక సజ్జ పిండి లేదా జొన్న పిండి, ఉప్పు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో రొట్టె మాదిరిగా తయారుచేసి, పెనం మీద వేసి కాల్చాలి. తెల్ల గలిజేరు ఆకు పప్పు కావలసినవి: తెల్ల గలిజేరు ఆకు – ఒక కప్పు; కందిపప్పు లేదా పెసర పప్పు – రెండు కప్పులు; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; ఇంగువ – కొద్దిగా. పోపు కోసం... ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙ముందుగా తెల్ల గలిజేరు కూర ఆకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙ కంది పప్పు లేదా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి ∙తరిగి ఉంచుకున్న తెల్ల గలిజేరు కూర ఆకు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙ఆకు కూర బాగా మగ్గిన తరవాత ఉడికించిన పెసర పప్పు/కందిపప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙వేడి వేడి అన్నంలోకి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీనినే పునర్నవ అని కూడా అంటారు. - నిర్వహణ వైజయంతి పురాణపండ -
అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే!
కిచిడి అంటే అనుష్కా శర్మకు బోల్డంత ఇష్టం. అది కూడా అమ్మ చేతి కిచిడీ అంటే చాలు ఇష్టంగా లాగించేస్తారు. జీన్స్, టీ-షర్ట్ ఆమె ఫేవరెట్ డ్రెస్. సౌందర్య సాధనాలంటే చాలా ప్రీతి. ముఖ్యంగా లిప్‌స్టిక్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అనుష్కా శర్మకు ‘ఫేవరెట్స్’ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం... ►రంగుల్లో అనుష్కా శర్మకు ఎరుపు, నలుపు, తెలుపు ఫేవరెట్స్. ►ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అంటే ‘కుచ్ కుచ్ హోతా హై, ‘దిల్ తో పాగల్ హై’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’. ►అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ అంటే అనుష్కా శర్మకు చాలా ఇష్టం. హాలీవుడ్ స్టార్స్‌లో జానీ డెప్‌కి ఫేవరెట్. నటీమణుల్లో రాణీ ముఖర్జీ, రేఖ, కాజోల్ అంటే అభిమానం. ►ఫేవరెట్ పెర్ఫ్యూమ్స్ ‘డోల్స్ అండ్ గబ్బన్నా లైట్ బ్లూ’, ‘బర్బెర్రీ’. ► ‘ఫెరారీ’, ‘రేంజ్ రోవర్’ కార్స్ అంటే ఇష్టం. ►ఫేవరెట్ హాలిడే స్పాట్స్ గోవా, లండన్, ప్యారిస్. ఈ మూడు ప్లేసెస్‌ని స్వర్గం అంటారు అనుష్కా శర్మ. అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుందట. ►ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టర్ ఎ.ఆర్. రహమాన్, గాయకుడు హరిహరన్. ►ఫేవరెట్ డిషెస్‌లో హైదరాబాద్ బిర్యానీ ఉండటం విశేషం. భాగ్యనగరానికి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ బిర్యానీని ఓ పట్టుపడతారు. చికెన్ బటర్ మసాలాని ఇష్టంగా తింటారు. ► టామ్ అండ్ జెర్రీ అంటే ఇష్టం. ఈ కార్టూన్ షో తన ఆల్ టైమ్ ఫేవరెట్‌గా అనుష్కా శర్మ చెబుతారు. ► జె.డి. సలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రై’ నవలను ఇప్పటివరకూ చాలాసార్లు చదివారు. ఎన్ని నవలలు చదివినా ఆల్ టైమ్ ఫేవరెట్ మాత్రం అదే.