అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే! | If there is in heaven! | Sakshi
Sakshi News home page

అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే!

Published Thu, Oct 1 2015 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

అక్కడికెళితే  స్వర్గంలో ఉన్నట్లే!

అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే!

కిచిడి అంటే అనుష్కా శర్మకు బోల్డంత ఇష్టం. అది కూడా అమ్మ చేతి కిచిడీ అంటే చాలు ఇష్టంగా లాగించేస్తారు. జీన్స్, టీ-షర్ట్ ఆమె ఫేవరెట్ డ్రెస్. సౌందర్య సాధనాలంటే చాలా ప్రీతి. ముఖ్యంగా లిప్‌స్టిక్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అనుష్కా శర్మకు ‘ఫేవరెట్స్’ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
 
►రంగుల్లో అనుష్కా శర్మకు ఎరుపు, నలుపు, తెలుపు ఫేవరెట్స్.
►ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అంటే ‘కుచ్ కుచ్ హోతా హై, ‘దిల్ తో పాగల్ హై’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’.
►అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ అంటే అనుష్కా శర్మకు చాలా ఇష్టం. హాలీవుడ్ స్టార్స్‌లో జానీ డెప్‌కి ఫేవరెట్. నటీమణుల్లో రాణీ ముఖర్జీ, రేఖ, కాజోల్ అంటే అభిమానం.
►ఫేవరెట్ పెర్‌ఫ్యూమ్స్ ‘డోల్స్ అండ్ గబ్బన్నా లైట్ బ్లూ’,  ‘బర్బెర్రీ’.
► ‘ఫెరారీ’, ‘రేంజ్ రోవర్’ కార్స్ అంటే ఇష్టం.
►ఫేవరెట్ హాలిడే స్పాట్స్ గోవా, లండన్, ప్యారిస్. ఈ మూడు ప్లేసెస్‌ని స్వర్గం అంటారు అనుష్కా శర్మ. అక్కడికెళితే స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుందట.
►ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టర్ ఎ.ఆర్. రహమాన్, గాయకుడు హరిహరన్.
►ఫేవరెట్ డిషెస్‌లో హైదరాబాద్ బిర్యానీ ఉండటం విశేషం. భాగ్యనగరానికి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ బిర్యానీని ఓ పట్టుపడతారు. చికెన్ బటర్ మసాలాని ఇష్టంగా తింటారు.
► టామ్ అండ్ జెర్రీ అంటే ఇష్టం. ఈ కార్టూన్ షో తన ఆల్ టైమ్ ఫేవరెట్‌గా అనుష్కా శర్మ చెబుతారు.
► జె.డి. సలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రై’ నవలను ఇప్పటివరకూ చాలాసార్లు చదివారు. ఎన్ని నవలలు చదివినా ఆల్ టైమ్ ఫేవరెట్ మాత్రం అదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement