kidnaped boy
-
అబ్బాయికి 20.. ఆమెకు 32.. ‘ప్రేమ’ ఎంత పని చేసిందంటే!
ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న విషయం చాలా సార్లు వింటుంటాం. అయితే తల్లిదండ్రులను కాదని ఇంటి నుంచి పారిపోతారు. ఎవరికి కంట కనబడకుండా వారి ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచుతారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేస్తే.. ఇంటి ముందు ధర్నాకు దిగుతారు. అయితే ఇక్కడ ఓ ఘటన మాత్రం వాటికి భిన్నంగా చోటు చేసుకుంది. అసలు విషయం తెలిసిన పోలీసులే ఆశ్చర్యపోయారు. తన ప్రియుడు కొన్ని నెలల నుంచి మాట్లాడటం లేదని ఆ ప్రేయసి ఏకంగా ప్రియుడి తమ్ముడినే కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్ పరిధితో చోటు చేసుకుంది. పక్కపక్కనే ఉన్న గ్రామాలకు చెందిన 20 ఏళ్ల హిరాలాల్, 32 ఏళ్ల పింకీ ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే కొన్ని నెలల కిందట హిరాలాల్కి ఉద్యోగం రావటంతో అతను గుర్గావ్కి వేళ్లాడు. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ పింకీని దూరం పెట్టాడు. అప్పటి వరకు తనతో సన్నిహితంగా ఉన్న హిరాలాల్‌ను ఎలాగైనా కలవాలనుకుంది పింకీ. అందుకోసం ఏకంగా ఓ కిడ్నాప్ ప్లాన్ వేసింది. ఆరేళ్ల హిరాలాల్ తమ్ముడు డోరిలాల్‌ను పింకీ తన అల్లుడి సాయంతో కిడ్నాప్ చేసింది. అక్కడితో ఆగకుండా డోరిలాల్‌ను కిడ్నాప్ చేసినట్లు తన ప్రియుడు హిరాలాల్కు ఫోన్ చేసి తెలిపింది. దీంతో కంగారుపడిన హిరాలాల్, అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులకు అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. హిరాలాల్ పక్క గ్రామానికి చెందిన పింకీనే డోరిలాల్‌ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పింకీ ఫోన్ ట్రేస్ చేసి బాలుడిని సురక్షితంగా పట్టుకున్నారు. పింకీ పోలీసులు ముందు తన చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఈ ఘటనలో పింకీతో పాటు ఆమె అల్లుడిని, పింకీ ప్రియుడు హిరాలాల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు డోరిలాల్‌ను.. పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. -
సూర్యపేట: బాలుడి అదృశ్యం కలకలం
-
బాలుడి అదృశ్యం కలకలం
సాక్షి, సూర్యపేట: జిల్లా కేంద్రంలో బాలుడి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. దీపావళి టపాకాయల కోసం వెళ్లిన 5 ఏళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాకపోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పరికపల్లి నగేష్, నాగలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు గౌతమ్. ఆ బాలుడు నిన్న( శనివారం) సాయంత్రం వారి ఇంటికి పక్కనే ఉన్న ఓ కిరాణం షాపులో దీపావళి బాంబుల కోసం తన సైకిల్‌పై వెళ్లాడు. కిరాణ షాప్‌లో బాణాసంచా కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. తమ కుమారుడు ఎంతకు ఇంటికి రాకపోవటంతో ఆందోళనపడిన తల్లిదండ్రులు బాలుడు కోసం గాలించగా కిరాణం షాప్‌కి కొద్ది దూరంలో బాలుడు తీసుకువెళ్లిన సైకిల్ మాత్రం కింద పడిపోయి ఉంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని ఎవరైనా కిడ్నప్ చేసారా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం
-
అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం హైదరాబాద్: శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది. అలియాబాద్ మేకలబండలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులకు చిక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శబరీష్ తమ ఆధీనంలో ఉన్నట్లు బాపట్ల పోలీసులు తమకు సమాచారం అందించారని, పోలీసులను అక్కడికి పంపుతున్నట్లు తెలిపారు. బాపట్లలో రైలులో ఏడుస్తున్న శబరీష్‌ను గుర్తించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అందించగా, వారు అతడిని అదుపులోకి తీసుకొని తమకు సమాచారం అందించారన్నారు. వివరాల్లోకి వెళితే... మేకబండకు చెందిన బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు పొన్న వెంకటరమణ కుమారుడు పొన్న శబరీష్(15) శంషీర్‌గంజ్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లిన శబరీష్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో శబరీష్‌ను సికింద్రాబాద్ 1వ నంబర్ ప్లాట్ ఫారంపై చూసినట్లు సోమవారం అతని తండ్రికి తెలిపింది. దీంతో పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఎలాంటి ఫలితం కనిపించలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆరు బృందాలతో గాలింపు బాలుడి అదృశ్యాన్ని సీరియస్‌గా తీసుకున్న శాలిబండ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా అతను చదువుతున్న స్కూల్‌కు వెళ్లి విద్యార్థులను ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దే శబరీష్‌ను చివరి సారిగా చూసిన ముగ్గురి సాక్షులను కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడితో మాట్లాతుండగా చూసినట్లు పొన్న ప్రకాష్ అనే బాలుడు తెలిపాడు. ఎనిమిది మంది కలిసి కిడ్నాప్ చేశారు: శబరీష్ అలియాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఎనిమిది మంది కలిసి తన మూతికి బట్ట కట్టి కిడ్నాప్ చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వారి దృష్టి మరల్చి తాను విశాఖపట్నం రెలైక్కానని... విశాఖపట్నం నుంచి తిరిగి ‘బొకారో’ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి వస్తూ..బాపట్లలో రైలులో ఏడుస్తుండగా తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు బాలుడు శబరీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.