kidney victims
-
కిడ్నీ బాధితులకు ‘భరోసా’
సాక్షి, అమరావతి/శ్రీకాకుళం (పాత బస్టాండ్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకున్న రోజులవి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసే నాటికి కిడ్నీ బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.2,500 ఇచ్చేది. ఆయన పాదయాత్ర అనంతరం మరో వెయ్యి పెంచి ఎన్నికల ముందు నుంచి రూ.3,500 చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల బాధను మరచిపోయేలా చేశాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేలాది కుటుంబాలకు ఆసరాగా.. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1నుంచి రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లించనున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. మా పాలిట దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు అప్పుల ఊబిలో మునిగిపోయిన మాకు పింఛను నెలకు రూ.10 ఇవ్వనుండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. – కొరికాన లక్ష్మీకాంతం, పెద్ద శ్రీరాంపురం, కంచిలి మండలం -
కిడ్ని బాధితులను పరామర్శించిన బీవీ రాఘవులు
-
కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి
-
కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి
రాష్ట్ర సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో కిడ్నీ జబ్బుల తీవ్రత, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందకపోవడానికి గల కారణాలపై ఈ నెల 31వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘వేలాది మంది కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. వీళ్లకు సరైన చికిత్స అందడం లేదు. దీనికి కారణాలనూ చెప్పడం లేదు’ అనే అంశాలతో పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి ఈ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దాపురం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో మూత్రపిండాల జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. ఈ మండలాల్లో సుమారు 16 వేల మంది తీవ్రమైన కిడ్నీ జబ్బుల (క్రానిక్ కిడ్నీ డిసీజెస్)తో బాధపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి నివేదిక ఎలా ఇవ్వాలని సర్కారు పెద్దలు, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
కిడ్నీ బాధితులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
ఉద్దానం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఉద్దానం కిడ్నీ బాధితులతో ముఖాముఖీ అయ్యారు. ఆయన శనివారం జగతి గ్రామంలో కిడ్నీ బాధితులను కలిసి, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వైఎస్ జగన్ ఎదుట వెళ్లబోసుకున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు నుంచి రూ.20వేలు అవుతోందన్నారు. అంత ఆర్థిక స్తోమత తమకు లేదని, చావే దిక్కని వారు వాపోయారు. ప్రభుత్వం కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు. విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వెల్లడించారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
'కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి'
ఢిల్లీ: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలో కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కిడ్నీరోగులకు వైద్యం కోసం మోదీకి వినతి