killed in
-
వినాయక శోభాయాత్రలో అపశ్రుతి
దోమకొండ : దోమకొండ మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దోమకొండలో మంగళవారం రాత్రి గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నటరాజ్ యూత్‌క్లబ్ గణేష్ మండపం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై నిలిపి ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలకు కరెంట్ సరఫరా కోసం విద్యుత్ స్తంభం వద్ద వైర్లను వేస్తుండగా ఐరేని వివేక్l(16) ప్రమాదానికి గురయ్యాడు. వివేక్lమొదట ఒక వైరును విద్యుత్ స్తంభం వైర్లపై వేశాడు. కింద ఉన్న మరో వైరుపై కాలు వేయడంతో కరెంట్ షాక్ తగిలింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కామరెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వివేక్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వివేక్ కామారెడ్డిలోని సాంధీపని కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి రాజ్వీర్ దినసరి కూలీ. తల్లి కమల బీడీలు చడుతుంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా వివేక్ చిన్నవాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాఛాయలు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో బీట్ ఆఫీసర్ మృతి
కుదునూరు(చర్ల) : రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మృతిచెందిన సంఘటన కుదునూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుమ్ముగూడెం అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బోదనెల్లి సెక్షన్లో గల ఆర్.కొత్తగూడెం బీర్లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాయం వెంకటేశ్వర్లు(51) ఆర్.కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపునకు తన బైక్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుదునూరు దాటుతుండగా.. రోడ్డు పక్కన నాగలితో వెళ్తున్న ఎద్దులను తప్పించబోయి.. నాగలి కాడికి బైక్ హ్యాండిల్ తగిలి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు 108 వాహనంతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. 108 వచ్చేలోపే స్థానికుల సాయంతో అటవీ శాఖ సిబ్బంది క్షతగాత్రుడిని ఆటోలో సత్యనారాయణపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి 108 వాహనంలో భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతిచెందాడు. కాగా, వాజేడు మండలం చినగొల్లగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు.. రాజుపేటలో నివాసం ఉంటూ ఆర్.కొత్తగూడెం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సందర్శించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.