kindergarden
-
చైనాలో గ్యాంగ్‌స్టర్ కత్తులతో దాడి...ముగ్గురు మృతి
బీజింగ్: చైనా జియాన్స్ ప్రావిన్స్‌లోని కిండర్‌గార్డెన్‌లో ఒక గ్యాంగస్టర్ కత్తులతో దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్యాగ్‌స్టర్ టోపీ, ముసుగు ధరించి ఉదయం 10 గంటలకు దక్షిణ చైనాలోని కిండర్ గార్డెన్‌లోకి చొరబడి ఈ దాడులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. చైనాలో ఇలాంటి నేరాలు జరగడం అత్యంత అరుదు. పౌరులు తుపాకీలను కలిగి ఉండడాన్ని చైనా కఠినంగా నిషేధిస్తుంది. కానీ చైనాలో గతకొంకాలంగా ఈ దాడులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్ నెలలో కూడా ఇదే కిండర్‌గార్డెన్ కత్తుల దాడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని, సుమారు 16 మంది దాక గాయపడ్డారని చెప్పారు. అంతేకాదు షాంఘై ప్రభుత్వాస్పత్రుల్లో కూడా నలుగురు వ్యక్తులు కత్తిపోటుకు గురయ్యరని, గతేడాది జూన్‌లో పాదాచారుల పై కూడా ఇలానే ఒక వ్యక్తి కత్తుల దాడులకు తెగబడటంతో ఆరుగురు మృతి చెందారని, సుమారు 14 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ చైనాలో కిండర్‌గార్డెన్‌లో దాడులకు పాల్పడ్డా 48 ఏళ్ల వ్యక్తి పరారీలోనే ఉన్నాడని, అతని ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు) -
నాలుగేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకం...
ముంబై : లింగ బేధం లేదు, వయసు తేడా లేదు.. పసివాళ్లన్న జాలి, దయ ఏమాత్రం లేకుండా మానవ మృగాలు రెచ్చిపోతుంటే భద్రతకు తావేది..? గుడి కన్నా బడి పదిలం అన్నారు. కానీ బడిలోనూ రక్షణ లేదు. ఓ వైపు చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని చట్టాలు తెస్తుంటే మరో పక్క పసివాళ్లపై జరిగే దారుణాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఉన్నత వర్గాల వారు నివసించే మజగావ్ ప్రాంతంలోని ఓ కిండర్‌గార్డెన్ స్కూల్లో ఆయాగా పని చేసే 60 ఏళ్ల మహిళ నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిండర్‌గార్డెన్ స్కూల్లో చదువుతున్న ఓ చిన్నారి గత రెండు నెలల నుంచి పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బడి అంటేనే వణికిపోతుంది. నిన్న ఆదివారం రాత్రి పాప తల్లిదండ్రులు చిన్నారిని బుజ్జగించి కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ చిన్నారి చెప్పిన విషయాలు వారికి వణుకు పుట్టించాయి. వైద్య పరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి పరిక్షించగా చిన్నారి వ్యక్తిగత శరీర భాగాల వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాప తల్లిదండ్రులు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలికి ఫోను చేసి విషయం చెప్పారు. దాంతో సోమవారం విధులకు హజరయిన ఆయను అదుపులోకి తీసుకుని బైకుల్లా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నది. పోలీసులు ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు. -
కిండర్ గార్డెన్లో బాంబుపేలుడు
జియాంగ్సూ : చైనాలోని ఓ కిండర్ గార్డెన్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లోని క్సుజోహూలోని కిండర్ గార్డెన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 50మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పిల్లలు, పెద్దలు గాయాలతో నేలపై పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడుకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.