కిండర్ గార్డెన్లో బాంబుపేలుడు
జియాంగ్సూ :
చైనాలోని ఓ కిండర్ గార్డెన్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లోని క్సుజోహూలోని కిండర్ గార్డెన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 50మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత పిల్లలు, పెద్దలు గాయాలతో నేలపై పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడుకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.