king fisher airlines
-
పీఎన్బీకి మరోసారి ఆర్బీఐ షాక్
సాక్షి, ముంబై : ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఖాతాలో మోసం జరిగినట్లు నివేదించడంలో ఆలస్యం చేసినందుకుగాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పీఎన్బీకి రూ .50 లక్షల భారీ పెనాల్టీ విధించింది. ఈ విషయాన్ని శనివారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పీఎన్బీ వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ ఖాతాకు సంబంధించి జూలై 10, 2018 న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమర్పించిన ఫ్రాడ్ మానిటరీ రిపోర్ట్-1లో ఆలస్యాన్ని ఆర్బీఐ గుర్తించిందని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని వివిధ సెక్షన్ల కింద బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. మరోవైపు ఫ్రాడ్‌పై నివేదించడంలో జరిగిన ఆలస్యానికి గాను ఆర్బీఐ రూ .50 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రత్యేక దాఖలులో పేర్కొంది. కాగా ఇటీవల కరెంట్ బ్యాంకు అకౌంట్ల విషయంలో అవసరమైన కెవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూసీఓ బ్యాంకులకు ఒక్కోదానిపై రూ.50 లక్షలు జరిమానా విధించగా, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
నాకే ఎందుకిలా..? మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ ట్విటర్ అందుకున్నారు. బ్యాంకులకు 100 శాతం తిరిగి చెల్లిస్తానంటూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కోసం తీసుకున్నమొత్తం రుణాన్ని చెల్లించడం కోసం తాను సిద్దంగా ఉన్నా.. బ్యాంకులు ఎందుకు అంగీకరిచడంలేదంటూ మరోసారి వాపోయారు. జెట్ ఎయిర్వేస్ దుస్థితిపై టీవీల్లో చర్చల్ని చూశాను. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కష్టాలు బాధాకరమని మాల్యా పేర్కొన్నారు. కొన్ని వ్యాపార తప్పిదాల వల్ల కింగ్ ఫిషర్‌తోపాటు భారతీయ విమానయాన సంస్థలు కుప్పకూలడం విచారకరం. ఇపుడు అనూహ్యంగా జెట్ పతనం. 100శాతం రుణాలు చెల్లిస్తానని చెబుతున్నా..కానీ సీబీఐ, ఈడీ తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాకే ఎందుకు ఇలా అంటూ మాల్యా అసహనం వ్యక్తం చేశారు. Watched TV debate on the sad collapse of Jet which included unpaid employees and Industry veterans. Important issues on unemployment and suffering, security available to Banks, prospects of revival etc. Here I am offering 100 % payback of KFA loans which Banks wont take. Why ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 Several Indian airlines collapsed sadly including KFA. Now the previously unthinkable has happened with the collapse of Jet. Genuine business failures. But I am criminally charged by CBI/ED despite offering 100% payback. Wonder why only me ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 -
నన్ను అరెస్ట్ చేస్తే.. ఒక్క రూపాయీ రాదు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశంవిడిచి పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం తాను ఇంగ్లండ్‌ను వదిలివచ్చే ఉద్దేశ్యంలేదని చెబుతున్నాడు. తన పాస్‌పోర్టు తీసుకున్నా, అరెస్ట్ చేసినా బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా రాదని చెప్పాడు. బ్యాంకులకు ఎంతో కొంత చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విజయ్ మల్యా పలు బ్యాంకులకు దాదాపు 9500 కోట్ల రూపాయలు బకాయిపడిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పాస్ట్ పోర్టును కూడా రద్దు చేసింది. ఇక మాల్యా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.