బహదూర్‌పురాలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని కిషన్‌బాగ్, అసద్‌బాబానగర్‌లో బుధవారం ఉదయం నుంచిపోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండలం పోలీసుల ఆద్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇంటెలిజెన్స్, ఎస్బీ హెచ్చరికలతో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో అనుమతి లేకుండా నివసిస్తున్న 120 మంది బర్మా దేశస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.