ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్ బార్బెక్యూ స్టైల్లో వండిపెడుతుంది..
ఉద్ధేశ్యపూర్వకంగా ఆహారాన్ని వృద్ధా చేయడం ఎవరికీ మనస్కరించదు. కాని కొన్ని సార్లు ప్యాకెట్లు కట్ చేశాక తిరిగి ఉపయోగించుకోలేం. ఈ ఎలక్ట్రిక్ పరికరాలు అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తాయి. బార్బెక్యూ స్టైల్లో వండి వార్చెస్తాయి. ఇంకా ఎన్నో.. సరసమైన ధరల్లోనే..
కట్టర్ – సీలర్
ఈ రోజుల్లో పప్పు, ఉప్పు దగ్గర నుంచి స్నాక్స్, మసాలా పౌడర్స్ వరకూ అన్నీ ప్యాకెట్స్‌లోనే లభిస్తున్నాయి. వాటిని ఒక్కసారి కట్ చేస్తే.. ఏదో ఒక మూత ఉన్న బాక్స్‌లో దాచి పెట్టాల్సిందే. లేదంటే పురుగుపట్టడమో, మెత్తపడిపోవడమో, పాడైపోవడమో.. ఇలా ఏదొక సమస్యతో చెత్తబుట్టలో వెయ్యాల్సిన పరిస్థితి. అలాంటి సమస్యని దూరం చేస్తుంది ఈ కట్టర్ – సీలర్. కట్ చేసిన ప్లాస్టిక్ కవర్ని తిరిగి అతికిస్తుంది. లోపలున్నది బయటికి రాకుండా.. బయట గాలి లోపలికి వెళ్లకుండా చేస్తుంది.
అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తుంది. దీన్ని పిన్నుల మెషిన్ వాడినట్లుగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ 2 ఇన్ 1 డివైజ్‌కి చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.పైన ఉన్న రెగ్యులేటర్‌ని అటు ఇటు తిప్పుతూ సరైన రీతిలో అమర్చుకోవడంతో, కట్టర్‌గా లేదా సీలర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెట్‌తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ఇవే మోడల్స్‌లో బ్యాటరీతో నడిచేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి చాలా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. అయితే చార్జింగ్‌తో నడిచే ఇలాంటి డివైజ్‌కి మన్నిక ఎక్కువగా ఉంటుంది.
ధర
28 డాలర్లు
(రూ.2,111)
ర్యాపిడ్ ఎగ్ కుకర్
కూరల నుంచి కేక్స్ వరకూ వంటకాల్లో గుడ్డు మస్ట్ అంటారు కొందరు. ది బెస్ట్ అంటుంటారు ఇంకొందరు. అలాంటి వారి కోసమే ఈ ర్యాపిడ్ ఎగ్ కుకర్. ఇందులో సుమారు తొమ్మిది గుడ్లను ఒకేసారి ఉడికించుకోవడానికి కుకింగ్ ర్యాక్ ఉంటుంది. అడుగున నీళ్లు పోసుకుని, పైన ఆ ర్యాక్ పెట్టుకుని గుడ్లు ఉడికించుకోవచ్చు. లేదంటే ఐదు గుంతలతో కూడిన ఎగ్ పౌచింగ్ ట్రేలో టేస్టీ ఎగ్ పౌచ్‌లు తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఆమ్లెట్ ట్రే అదన ంగా లభిస్తాయి.
ఈ డివైజ్ మొత్తం నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందింది. పౌచింగ్ ట్రే ఒక్కటే నాన్ స్టిక్ మెటీరియల్‌తో తయారైంది. ఇక దీనిపైన మూత కూడా చాలా ప్రత్యేకంగా చూడటానికి క్లాస్ లుక్‌తో ఉంటుంది. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది.
ధర
44 డాలర్లు
(రూ.3,302)
గ్యాస్ ఓవెన్ గ్రిల్
స్నేహితులతో, బంధువులతో దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు.. స్వయం పాకాలే బెటర్ అంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ గ్యాస్ ఓవెన్ గ్రిల్. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనిపై చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ ఐటమ్స్‌తో పాటు వెజ్ ఐటమ్స్‌ని కూడా.. బార్బెక్యూ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే 400 డిగ్రీల సెన్సియస్ టెంపరేచర్‌కు చేరుకుంటుంది.
దీని రేడియేషన్ టెక్నాలజీ చాలా వేగంగా ఎముకులను సైతం మెత్తగా ఉడికించేస్తుంది. దీనిపైన కబాబ్స్, కట్లెట్స్ వంటి వెరైటీలతో పాటు.. పెద్ద పిజ్జాని తయారుచేసుకోవచ్చు. గాడ్జెట్‌కి ముందువైపు టెంపరేచర్ సెట్ చేసుకునే రెగ్యులేటర్ ఉంటుంది. పైన ఏ టెంపరేచర్లో నడుస్తుందో సూచించే ఇండికేటర్ కనిపిస్తుంది. దీని అటాచ్డ్ లిడ్(మూత).. కదలకుండా ఉండేందుకు కుడివైపు లాక్ చేసుకునే వీలుంటుంది. వెనుక వైపు మినీ గ్యాస్ సిలెండర్ పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు.
ధర
178 డాలర్లు
(రూ.13,356)
చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..