2 శాతం డీఏ పెంచనున్న కేంద్రం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దా రులకు 2 నుంచి 4 శాతం వరకు కరువు భత్యం (డీఏ) పెరగనుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 58 లక్షల మంది పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు.
కేంద్రం ఆమోదించిన ప్రకారం డీఏ పెంపు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏ పెంపు లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిత్యా వసరాలు ఆకాశాన్నం టుతుంటే కేంద్రం తక్కు వగా పెంచుతోందని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.కె.ఎన్ .కుట్టీ మండిపడ్డారు.