నిద్రించే అందాలు..!
మెడిక్షనరీ
ఆ వ్యాధి పేరే ‘నిద్ర అందాలు’. ఇంగ్లిష్లో చెప్పాలంటే ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’. దీనికి క్లెయిన్ లెవిన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. స్లీపింగ్ బ్యూటీ అన్న మాట విన్నప్పుడు ఇది యువతుల్లో ఎక్కువగా వస్తుందని అనిపించవచ్చు.
కానీ యువతీ యువకులిద్దరిలోనూ ఇది వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత ఇది వస్తుంటుంది. అయితే ఎలాంటి చికిత్సా తీసుకోనవసరం లేకుండానే దానంతట అదే తగ్గుతుంది.