శివకుమార్‌కు సేవారత్న అవార్డు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పంచాయతీని అభివృద్ధి చేయడమేకాకుండా పలు ప్రజాహిత కార్యక్రమాల్లో చేపట్టిన పంచాయతీ అధ్యక్షుడు కేఎంఎస్ శివకుమార్ సేవారత్న అవార్డు ను అందుకున్నారు, గుమ్మిడిపూండి యూనియన్ పరిధి ఈగువారిపాళెం పంచాయతీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండు రోజుల కిందట రాష్ర్ట గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. తెలుగు గ్రామమైన ఈగువారిపాళెంకు 2012లో శివకుమార్ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఎంకామ్ చదవిన ఈయన ఒక పక్క పంచాయతీని అభివృద్ధి చేస్తూనే మరో పక్క పంచాయతీ పరిధిలోని ప్రైవేటు కంపెనీల సహాకారంతో ప్రజాహిత కా ర్యక్రమాలు చేపట్టారు. వైద్యశిబిరాలు, ప్లాస్టిక్ నిషేదం,మద్య నిషేదం,బడిమానివేసిన పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.
అం తేకాకుండా బాల్యవివాహాలు,అంటరానితనంపై ప్రజల్లో అవగాహన కల్పిం చారు. పంచాయతీ పరిధిలో వంద శా తం మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగు, ప్రతి గ్రామంలో సభలో నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతూ అతి కొద్ది కాలంలోనే ఈ యువ పంచాయతీ అధ్యక్షుడు ప్రజల మన్నలు పొం దారు. అంతేకాకుండా చెన్నైకి చెందిన చెన్నై మెట్రో వార్త పత్రికలో ఈ పంచాయతీ అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక వ్యాసాలు రాశారు.
వీటికి గుర్తింపుగా చెన్నై మెట్రో పత్రిక 2013 సంవత్సరంకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీ అభివృద్ధి చేసిన అధ్యక్షుడు ఎంపిక చేసింది. అందుకుగాను ఈ తెలుగు గ్రామ అధ్యక్షుడు శివకుమార్ సేవారత్న 2013 అవార్డును పొందారు. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదగా శివకుమార్ రెండు రోజుల క్రితం అందుకున్నారు. ఈ సం దర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. తన సేవలను గుర్తించి సంస్థ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలి పారు. పంచాయతీ అభివృద్ధిలో తనకు సహకరించిన వార్డు సభ్యులు, గ్రామ నిర్వాహణాధికారి, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.