యూపీ పోలీసు అధికారులకు ఢిల్లీ కోర్టు వారంట్లు
న్యూఢిల్లీ: కారాగారంలో ఉన్న నక్సల్ నాయకుడు కోబడ్ గాంధీ కేసుకు సంబంధించి వాంగ్మూలమివ్వడానికి రానందుకుగాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులపై స్థానిక న్యాయస్థానం బెయిల్ మంజూరు కాగల వారంట్లను జారీచేసింది. విచారణ ఉన్నప్పటికీ గైర్హాజరైన యూపీకి చెందిన పోలీసు అధికారులు రాజేశ్ శ్రీవాస్తవ, సమీర్ సౌరభ్, రాజీవ్ ద్వివేదీలకు ఒక్కొక్కరికీ రూ. 5,000 బెయిలబుల్ వారంట్లను జారీచేస్తూ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రితేశ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేశారు.