ఒంటిమిట్టలో ఘనంగా చక్రస్నానం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయ కోనేరు వద్ద శనివారం ఉదయం అర్చకులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు. ఆలయం నుంచి సుదర్శన చక్రాన్ని కోనేరు వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.