kodandaramireddy suicide
-
సుదీర్ఘంగా ఏపీ కేబినెట్, రైతుల సమస్యలపై చర్చే లేదు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆరు గంటల పాటు కొనసాగినా రైతుల సమస్యలపై అసలు చర్చించలేదు. అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై ఏపీ కేబినెట్ చర్చించకపోవడం గమనార్హం. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విత్తనాల కొరతపై రాష్ట్ర కేబినేట్ దృష్టిసారించ లేదు. పంటలకు మద్ధతు ధర పెంచుతున్నట్లు కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి బోనస్ ప్రకటనలపై మంత్రులు చర్చించలేదు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన యువరైతు ఉరవకొండలోని బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. -
ఏపీ మంత్రి గారు చాలా బిజీ..!
గుంటూరు : అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి (29) ఆత్మహత్య ఘటనపై స్పందించడానికి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరాకరించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆయన నివాసం వద్ద మంత్రి స్పందన కోసం 'సాక్షి' మీడియా ప్రతినిధి రెండు గంటలకు పైగా వేసి చూసినా ముఖం చాటేశారు. మంత్రి ప్రత్తిపాటి నివాసం వద్ద చాలా సమయం ఎదురుచూసిన తర్వాత మంత్రి బిజీగా ఉన్నారంటూ చెప్పిన ఆయన పీఏ, గన్‌మన్ లు సాక్షి' ప్రతినిధిని పంపించేశారు. బ్యాంకు మేనేజర్ ఒత్తిళ్లు భరించలేక ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో రైతు కోదండరామిరెడ్డి పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఉద్యోగం రాక చివరకు వ్యవసాయమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఆ యువరైతు చదివింది ఎంబీఏ కావడం గమనార్హం.