సుదీర్ఘంగా ఏపీ కేబినెట్, రైతుల సమస్యలపై చర్చే లేదు | Andhra pradesh cabinet does not discuss on farmer problems | Sakshi

సుదీర్ఘంగా ఏపీ కేబినెట్, రైతుల సమస్యలపై చర్చే లేదు

Published Sat, Jul 4 2015 7:49 PM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆరు గంటల పాటు కొనసాగినా రైతుల సమస్యలపై అసలు చర్చించలేదు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆరు గంటల పాటు కొనసాగినా రైతుల సమస్యలపై అసలు చర్చించలేదు. అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై ఏపీ కేబినెట్ చర్చించకపోవడం గమనార్హం. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విత్తనాల కొరతపై రాష్ట్ర కేబినేట్ దృష్టిసారించ లేదు.

పంటలకు మద్ధతు ధర పెంచుతున్నట్లు కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి బోనస్ ప్రకటనలపై మంత్రులు చర్చించలేదు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన యువరైతు ఉరవకొండలోని బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement