kohinoor dimond
-
‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు!
రిషి సునాక్(Rishi Sunak).. గత రెండు రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో..అది కూడా తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకుని సంచలనం సృష్టించారు. ఆయన భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం, పైగా మన దేశపు అల్లుడు కావడంతో భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు రిషి సునాక్‌పై మీమ్స్ వడ్డన కూడా మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికైన సంగతి తెలిసిందే . ఇక అప్పటి నుంచి కోహినూర్ వజ్రం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సైతం ఈ అంశంపై ఫన్నీగా స్పందించారు. బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఇలా ట్రై చేయండంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో ఏముందంటే.. 'కోహినూర్‌ను తిరిగి పొందాలంటే నా స్నేహితుడి ఆలోచన ఇదే... రిషి సునాక్‌ను భారతదేశానికి ఆహ్వానించండి. ఆయన అత్తమామల ఇంటికి వెళ్లేటప్పుడు బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కిడ్నాప్ చేయండి. రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానమంత్రిగా పంపండి, అలా చేసినా ఎవరూ గుర్తుపట్టరు. వెంటనే కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్‌ను నెహ్రా పాస్ చేయిస్తాడని’ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్త ఇది నెట్టింట హల్ చేస్తోంది. కాగా రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. My friend’s idea to get back #Kohinoor: 1. Invite #RishiSunak to India 2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws 3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it. 4. Nehra will be told to pass the bill to return Kohinoor 💎 in 🇮🇳! 😀😀 — Harsh Goenka (@hvgoenka) October 25, 2022 చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే! -
కోహినూర్ కాంట్రవర్సీ: హైకోర్టు కీలక ఉత్తర్వులు
'కోహినూర్ డైమండ్ ను బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు.. బహుమతిగా ఇచ్చాం అంటోంది. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వజ్రాన్ని బహుమతిగా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. పరిశీలించాల్సిన అంశమేమంటే..అసలు ఒక కంపెనీకి, రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అసలు అవిభాజ్య పంజాబ్ లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకు ఇవ్వడం సరైందేనా? ఈస్టిండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్రసమాచారాన్ని మాకు ఇవ్వండి' అంటూ కోహినూర్ వజ్రం విషయంలో లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 'కోహినూర్ పాకిస్థాన్ దే..' ప్రపంచఖ్యాతి పొందిన కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కే చెందుతుందని, ప్రస్తుతం బ్రిటిష్ రాజవశస్తుల నివాసం 'టవర్ ఆఫ్ లండన్'లో ఉన్న కోహిన్ వజ్రాన్ని పాక్ కు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం కోర్టుకు సమాధానం ఇస్తూ.. 'లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కు బహుమానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి పిటిషనర్.. దులీప్ సింగ్, ఈస్టిండియాల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుబాటుకాదని వాదించారు. కామన్ వెల్త్ సభ్యుడిగా పాక్ మళ్లీ కోహినూర్ ను పొందే అవకాశం ఉంటుందని, ఆమేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ మాదేనంటూ భారత్, పాకిస్థాన్ లేకాక ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ లు కూడా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్‌తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. 1840లో నాటి అవిభక్త పంజాబ్ లో జరిగిన సిక్కుల యుద్ధంలో తనకు సహకించినందుకుగానూ దులీప్ సింగ్ అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడని కొందరు చెబుతారు. అయితే దులీప్ నుంచి ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు కొట్టేశారని మరొకొందరు వాదిస్తారు. ఏదిఏమైనప్పటికీ 1913లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్‌లోనే ఉండిపోయిన కోహినూర్ ను తిరిగి తేలేమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పంది. -
కోహినూర్‌పై మీ వైఖరేంటి?
కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావడంపై దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు శుక్రవారం విచారించింది. దీనిపై తమ వైఖరేమిటో వారంలోగా చెప్పాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ‘పాకిస్తాన్, బంగ్లాదే శ్, దక్షిణాఫ్రికాలు కోహినూర్ మాదే అంటున్నాయి. మనదేశంలోనూ కొంతమంది కోహినూర్ కావాలని అడుగుతున్నారు. ఇలా ఎన్ని దేశాలు అంటాయి?’ అని ప్రశ్నించింది. దీనిపై సమాధానమివ్వడానికి కొంత సమయం కావాలని ఆయన కోరారు. ఇలాంటి డిమాండ్లను తాము అంగీకరిస్తూ పోతే త్వరలోనే బ్రిటిష్ ప్రదర్శన శాలలు ఖాళీ అవుతాయని బ్రిటన్ ప్రధాని అన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయని టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఈ విషయంపై మీరు ప్రభుత్వాన్ని ఎందుకు ఆశ్రయించరు? ప్రభుత్వం పట్టించుకోలేదా? ప్రభుత్వం చేయదగినదంతా చేసింది’ అని పిటీషనర్ను ఉద్దేశించి కోర్టు పేర్కొంది. కోహినూర్‌తో పాటు టిప్పు సుల్తాన్ ఉంగరం, కత్తి, ఇతర భారతీయ రాజుల సంపదలనూ వెనక్కు తేవాలని పిటిషనర్ కోరారు.