మెడిసిన్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సహవిద్యార్థులు
బెంగళూరు: కర్ణాటకలోని కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి కామేష్‌పై సహ విద్యార్థులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
70 శాతం గాయాలతో కామేష్ బెంగళూరు కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కామేష్‌పై దాడిచేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తండ్రి హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు.