kona seema
-
వరద బాధితులకు అండగా..వలంటీర్ల సైన్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాళ్లరేవు: గోదావరి వరద బాధితులకు వలంటీర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ చేయూతను బాధితుల చెంతకు చేరుస్తున్నారు. నడుం లోతు నీళ్లలోనూ ప్రాణాలకు తెగించి మరీ ముంపు గ్రామాల్లో బాధితులకు భోజనం, మంచినీటి టిన్నులు, నిత్యావసరాలు అందజేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వలంటీర్లు అలుపెరగని సేవలందిస్తున్నారు. మూడురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. రెండు రోజులుగా ప్రభుత్వ సాయాన్ని బాధితులకు అందించడంలో వలంటీర్లు బాధ్యత తీసుకోవడంతో పంపిణీలో వేగం పెరిగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, అల్పాహారం, మంచినీటి టిన్నులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి వాటిని భుజాన వేసుకుని బాధితుల ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటకుండా భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో వలంటీర్లు స్వయంగా వంట వండి వరద బాధితులకు వడ్డించారు. అయినవిల్లి మండలం పొట్టిలంకలో పాము శేషవేణి నడుం లోతు నీటిలో 20 లీటర్ల మంచినీటి టిన్నులను భుజానికెత్తుకుని వెళ్లి బాధిత కుటుంబాలకు అందచేసింది. ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ చింతావానిరేవులో రాత్రి 8గంటల సమయంలో వలంటీర్లు భోజనాలు వండి వడ్డించారు. ముంపు గ్రామాల్లో పడవలపై వెళ్లి సేవలందించారు. తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ శివారు కొత్తలంకలో వలంటీర్ ఐతాబత్తుల గోపాలకృష్ణ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, అవసరమైన వారికి మందులు సరఫరా చేయడంతోపాటు దాతలు అందించే ఆహార పొట్లాలు, కాయగూరలు ప్రతి ఇంటికీ చేరవేస్తున్నాడు. గ్రామంలో 80 శాతానికిపైగా ఇళ్లు వరదలో చిక్కుకోవటంతో పీకల్లోతు నీటిలో ఈదుకుంటూ వెళ్లి ప్రతి ఇంటికీ నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 450 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరికి మంగళవారం నుంచి మరో 150 మంది తోడవనున్నారు. ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లో వరద బాధితులకు వలంటీర్లు ప్రభుత్వ సాయాన్ని గంటల్లోనే అందిస్తున్నారు. బాధితులు వలంటీర్లను గుర్తించేలా ఏలూరు కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ విలేజ్ వలంటీర్ పేరుతో టీ షర్టులు సిద్ధం చేయించి పంపిణీ చేశారు. సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. వలంటీర్లను సత్కరిస్తాం ముంపు మండలాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అధికారులకు పూర్తి సహాయకారులుగా ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ సాయం త్వరితగతిన అందుతోంది. వలంటీర్ల సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వారిని సత్కరిస్తాం. – ప్రసన్నవెంకటేష్, కలెక్టర్, ఏలూరు జిల్లా -
విపత్తు వేళ ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరద ముంపులో చిక్కుకుని.. పీకల్లోతు కష్టాల్లో మునిగిన కోనసీమ లంక గ్రామాల్లోని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. కష్టాల్లో ఉన్నామనే బాధ వారికి తెలియకుండా యంత్రాంగం ద్వారా అన్నివిధాలా ఆదుకుంటోంది. ముంపులో చిక్కుకున్న ప్రతి ఇంటికీ నేరుగా పడవలపై వెళ్లి మరీ సాయాన్ని అందిస్తున్నారు. వరద బాధితులుగా మారిన ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించటంతో ఉన్నతాధికారుల నుంచి వలంటీర్ వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అనునిత్యం లంక గ్రామాల వెంట తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మొక్కవోని దీక్షతో.. వరదలు మొదలయ్యాక రెండు, మూడు రోజులు నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంజన్ బోట్లను సైతం సరంగులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సహాయ సామగ్రిని లంక గ్రామాలకు త్వరితంగా తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదివారం నుంచి వరద ఉధృతి నెమ్మదించడంతో ప్రభుత్వ సాయాన్ని అందించడంలో అధికార యంత్రాంగం వేగాన్ని పెంచింది. బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అటు కోనసీమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాల యంత్రాంగాలు బియ్యం, కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్, పాల ప్యాకెట్లను యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేస్తున్నారు. నిలువెత్తు లోతు నీటిలో ఉన్న లంక గ్రామాలకు సైతం ప్రాణాలకు తెగించి పడవలపై వెళ్లి మీ వెంటే మేమున్నామంటూ బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఉదయాన్నే అల్పాహారం.. 11 గంటల కల్లా వేడివేడి భోజనం ప్యాకెట్లు అందుతున్నాయని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్నారులకు పాలు సైతం అందిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ముంపు గ్రామాల్లోని 45 వేల కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, 21,200 లీటర్ల పామాయిల్, 54,108 లీటర్ల పాలు, 30 టన్నుల టమాటాలు, 30 టన్నుల ఉల్లిపాయలు, 30 టన్నుల బంగాళా దుంపలను ఇప్పటికే పంపిణీ చేశారు. ఏటిగట్లపైనా కిచెన్లు ముంపు గ్రామాలకు అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఎక్కడికక్కడ వంటావార్పు చేయించి బాధితులకు అల్పాహారం, భోజనం వంటివి పంపిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో ముంపులో ఉన్న తీర గ్రామాలైన చింతావానిరేవు, చింతపల్లిలంకల్లో ఉన్న సుమారు 300 మంది బాధితులకు ఏటిగట్లపైనే వంటావార్పు చేస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి బొబ్బర్లంక–పల్లంకుర్రు ఏటిగట్టుపై వంట చేశారు. ఈ గ్రామాల్లో బాధితులకు ఆషాఢ మాసం స్పెషల్‌గా మునగాకు, తెలగపిండి, కందిపప్పుతో ఘుమఘుమలాడే కూరలను వండి వేడివేడిగా పెట్టారు. లంక ఆఫ్ ఠానేల్లంక, గురజాపు లంక, కూనాలంక గ్రామాల్లోని ముంపు బాధితుల కోసం ఠానేల్లంక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వంటలు చేసి భోజనాలు పెడుతున్నారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి, ఊడుమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాల్లో ముంపు బాధితులకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సాయాన్ని అందిస్తున్నారు. వలంటీర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లను బాధితులకు అందజేస్తున్నారు. బాధిత కుటుంబాలకు రెండు విడతల్లో బియ్యం సరఫరా చేశారు. బాధితుల కోసం 74 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 53 కేంద్రాలను తెరిచారు. 24,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 7 వేల మందికి పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించారు. ముంపు బాధితులకు 82,279 ఆహార పొట్లాలు, 4.50 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 79 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 18 మండలాల్లోని 70 గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. పశువులకు మేత కొరత ఏర్పడటంతో ప్రభుత్వం ఇప్పటికే 150 మెట్రిక్ టన్నుల మేతను రైతులకు అందజేసింది. రెండవ విడతగా 324 మెట్రిక్ టన్నుల మేతను రప్పించి ఇప్పటివరకు 264 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. వరద బారిన పడిన 10,737 పశువులకు 475 టన్నుల దాణా సమకూర్చారు. 299 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 450 బోట్లను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. 261 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 699 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇంటికొచ్చి సాయం అందించారు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా పడవలపై వచ్చి మరీ సాయం అందించారు. మాకెలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. వేడివేడి భోజనం పెడుతున్నారు. బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందించారు. లంకల నుంచి బయటకు రావడానికి పడవలు ఏర్పాటు చేశారు. అనారోగ్యం పాలవకుండా ముందుగానే వైద్య శిబిరం పెట్టి మందులు ఇస్తున్నారు. – ఎల్లమిల్లి నాగేశ్వరరావు, కె.ఏనుగుపల్లి, కోనసీమ ప్రభుత్వం వెంటనే ఆదుకుంది వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆదుకుంది. వరదలు మునుపెన్నడూ చూడని రీతిలో వచ్చి ఇళ్లన్నీ మునిగిపోయాయి. తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికారులు వచ్చి రుచికరమైన ఆహారాన్ని అందించారు. సమయానికి భోజనం ప్యాకెట్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించి ఆదుకున్నారు. – పుచ్చకాయల చిన్నబ్బాయి, పి గన్నవరం, కోనసీమ జిల్లా -
యానాంలో వరద ఉధృతి
కాకినాడ జిల్లా: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాంలోని ఓల్డేజ్ హోం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు సరఫరా చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు విస్తృతంగా పర్యటించారు. పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పర్యటించిన మంత్రులు.. అన్నంపల్లి ఆక్విడెక్ట్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. దీనిలో భాగంగా అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఇందులో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాక్షిటీవీ బృందం సాహస యాత్ర ఏలూరు జిల్లా: గోదావరి వరదలో మునిగిన గ్రామాలను సాక్షిటీవి బృందం సందర్శించింది. నాటుపడవ, లాంచీలలో ప్రయాణం చేసి.. గోదావరి ప్రధాన ప్రవాహం మీదుగా కొండల్లోకి వెళ్లారు. గత వారం రోజులుగా కొండల మీద తలదాచుకున్న వారిని సాక్షి బృందం కలిసింది. చిగురుమామిడి, నాళ్లవరం, బోళ్లపల్లి, కన్నాయిగుట్ట గ్రామాల్లో సాక్షిటీవి బృందం పర్యటించి వారి కష్టాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇప్పటివరకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారపదార్ధాలను ప్రభుత్వం వారికి అందించింది. ప్రత్యేక లాంచీలో నిత్యావసర వస్తువులను అధికారులు పంపించారు. -
51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ 25 లక్షలు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లో ఆరుడగుల వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దష్టిసారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీనమైన ప్రాంతాల్లో ఏటి గట్లను పట్టిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏటిగట్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా వాలంటీర్లతో బండ్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కోనసీమ జిల్లాలోని 88 గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. కోనసీమజిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద పరిస్ధితులని కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి మోనిటరింగ్ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 25లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇంతటి వరదను 1986 తర్వాత ఇంతటి వరద చూడలేదని లంక గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం వరద ప్రభావం నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్న చోట అదనంగా సిబ్బందిని మెటీరియల్‌ని సమీకరించాలని ఆదేశించింది. ఏటీ గట్లను మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. -
కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రపప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కాకినాడ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పాలన చేస్తున్నామని, అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నామని అన్నారు. రైతులకు ఉపయోగపడే మొక్కలను అటవీశాఖ ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కురసాల తెలిపారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయ, ఉద్యానవన, అటవీశాఖలు సమన్వయం కావాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ఆయా శాఖలు రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు. -
కోనసీమ రైలుకు పచ్చజెండా
నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్ల తరబడి ఊరిస్తున్న నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ సాకారమయ్యే రోజులొచ్చాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొనడంతో పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించి, స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్‌ల భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించగా.. అందులో ఇది రెండవది. ఇది పూర్తయితే అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం నుంచి ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ నరసాపురం నుంచి కోనసీమలోని అమలాపురం మీదుగా కోటిపల్లి వరకూ వెళ్తుంది. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు ఇప్పటికే రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం మీదుగా చెన్నై పోర్టులను కలుపడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖవిజయవాడ చెన్నై ప్రధాన రైల్వే చాలా రద్దీగా ఉంది. నరసాపురంకోటిపల్లి లైన్ నిర్మాణం పూర్తయితో సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులు తరలించడానికీ పనికొస్తుంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి 199798లో అమలాపురం మీదుగా నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొదట కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కిలోమీటర్ల మార్గాన్ని రూ.74 కోట్లతో వేసి 200304లో ప్రారంభించారు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తారు. దీని కోసం భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యిది. గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టకేలకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం అయ్యే అవకాశం ఏర్పడింది. బ్రాంచ్‌లైన్‌కు రూ.122 కోట్లు విజయవాడభీమవరం నిడదవోలు వరకూ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ రైల్వేలైన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. 221 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. -
కోనసీమ రైలుకు పచ్చజెండా
నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్ల తరబడి ఊరిస్తున్న నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ సాకారమయ్యే రోజులొచ్చాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొనడంతో పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించి, స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్‌ల భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించగా.. అందులో ఇది రెండవది. ఇది పూర్తయితే అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం నుంచి ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ నరసాపురం నుంచి కోనసీమలోని అమలాపురం మీదుగా కోటిపల్లి వరకూ వెళ్తుంది. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు ఇప్పటికే రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం మీదుగా చెన్నై పోర్టులను కలుపడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖవిజయవాడ చెన్నై ప్రధాన రైల్వే చాలా రద్దీగా ఉంది. నరసాపురంకోటిపల్లి లైన్ నిర్మాణం పూర్తయితో సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులు తరలించడానికీ పనికొస్తుంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి 199798లో అమలాపురం మీదుగా నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొదట కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కిలోమీటర్ల మార్గాన్ని రూ.74 కోట్లతో వేసి 200304లో ప్రారంభించారు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తారు. దీని కోసం భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యిది. గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టకేలకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం అయ్యే అవకాశం ఏర్పడింది. బ్రాంచ్‌లైన్‌కు రూ.122 కోట్లు విజయవాడభీమవరం నిడదవోలు వరకూ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ రైల్వేలైన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. 221 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. -
గోదారమ్మా.. శాంతించమ్మా...
అమలాపురం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి ఉద్ధృతితో 16 మండలాల్లోని 59 గ్రామాలను ముంచెత్తిన వరద 1.45 లక్షల మందిపై తన ప్రతాపాన్ని చూపుతోంది. నమ్ముకున్న లంకవాసులకు నిలువునా ముంచింది. అన్నపానీయాలు లేకుండా పస్తులుండేటట్టు చేస్తోంది. నివాసగృహాలను ముంచెత్తి నిలువ నీడ లేకుండా చేసింది. పూరిపాకలే కాకుండా పక్కా ఇళ్లు కూడా కూలిపోతుండడంతో లంకవాసులు తట్టాబుట్టా పట్టుకుని ఏటిగట్లపై పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. కోనసీమలోని లంకల్లో ముంపు మరింత పెరిగింది. డ్రైన్ల నుంచి వరదనీరు పోటెత్తడంతో మరికొన్ని గ్రామాలు ముంపుబారిన పడే ప్రమాదం ఉంది. ఆదివారం రాత్రి భారీ వర్షం పడడంతో అటు లంకవాసులు, ఇటు డెల్టా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరదల వల్ల 10 రోజులుగా ఇళ్లు ముంపుబారిన పడడంతో జిల్లాలో ఇంతవరకు 250 గృహాలు కూలిపోగా దీనివల్ల రూ. 15 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. పాఠశాలల్లోను, ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇవి కూడా ముంపుబారిన పడ్డాయి. దీనితో చాలామంది బాధితులు తమ డాబాలపైకి చేరి టార్పాలిన్ నీడన బతుకుతున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో ఏటిగట్లపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు. పాడిపంటలకు ఆలవాలమై సిరులు కురిపించిన గోదారే నమ్ముకున్న రైతులను, కౌలు రైతులను కుదేలు చేసింది. కోట్ల రూపాయల విలువైన పంటలను తనలో కలుపుకుపోయింది. తుడిచిపెట్టుకుపోయిన కూరగాయలు లంకలంటే అటు కూరగాయల సాగుకు, ఇటు వాణిజ్య పంటల సాగుకు బంగారు భూములు. ఈ సాగు చేసే రైతులు పంటలకు ఎంతైనా వెనకాడకుండా పెట్టుబడి పెడుతుంటారు. అటువంటి రైతులకు ఇప్పుడు చిన్న గడ్డిపోచ కూడా మిగల్చకుండా గోదావరి నట్టే ముంచింది. పెట్టుబడి పెట్టిన రైతుల పంటను ఎత్తుకుపోయి వెంట తెచ్చిన బురద మిగిల్చిపోయింది. జిల్లాలో 4,101 ఎకరాల్లో కూరగాయలు, వాణిజ్య పంటలు తుడిచిపెట్టుకుపోయి సుమారు రూ.13.50 కోట్ల నష్టం వాటిల్లింది. పశువుల పాకలను కూల్చి పశువులను చెల్లాచెదురు చేసింది. పాడిని దూరం చేసి రైతుల పొట్టను కొట్టింది. పశువులకు మేత లేకుండా చేయడంతో అవి ఆకలితో ఆలమటిస్తున్నాయి. సుమారు 10 వేల పశువులు, అదే సంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు వరద బారిన పడడం రైతును నష్టపరుస్తోంది. మత్స్యకారుల పరిస్థితి దుర్భరం గోదావరి లంకల్లో శివారు ప్రాంతాలను ఆనుకుని వేటతో జీవనోపాధి పొందుతున్న మత్స్యకారుల పరిస్థితి దుర్భరంగా మారింది. వరదలు ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు వేట లేకపోవడంతో జిల్లాలో సుమారు 15వేల మంది మత్స్యకారులు పూటగడవని పరిస్థితిలో ఉన్నారు. వేటాడే రోజుల్లో రోజుకు నిర్వహణ ఖర్చు పోను రూ.200 నుంచి రూ.300లోపు సంపాదించుకుంటారు. సుదీర్ఘకాలంపాటు వేట లేకపోవడంతో వీరి బాధలు వర్ణనాతీతంగా మారాయి. పడవలపై అందిస్తున్న అరకొర భోజనంతో బాధితులు పొట్టనింపుకుంటున్నారు. గోదావరి ఒడ్డున వేసుకున్న పాకలు కొట్టుకుపోవడంతో ఏటిగట్లపై తాత్కాలిక గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూకాలం వెళ్లదీస్తున్నారు. వరదలకు తోడు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో గుడారాల్లో తలదాచుకున్నవారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఉపాధి కరువైన వ్యవసాయ కూలీలు లంక ప్రాంతాల్లో నివాసముండేవారిలో అధికశాతం వ్యవసాయ కూలీలే. వరద వల్ల పొలాల్లో పనులు నిలిచిపోయాయి. ఉపాధి పనులు చేసే అవకాశం కూడా లేకపోయింది. దీనితో వీరు కూడా అర్ధాకలితో పొద్దుపుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముంపునకు కొట్టుకు వస్తున్న విషసర్పాలు ఇళ్లల్లో చేరుతుండడంతో లంకవాసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఆదివారం మామిడికుదురు మండలం అప్పనపల్లిలో విషసర్పం కాటేయడం తో ఆకుమర్తి నరసింహమూర్తి మృతిచెందిన విషయం తెలిసిందే. కళ్లముందు ఇంతటి విల యం సృష్టిస్తుండడంతో గోదారమ్మా.. శాంతించ మ్మా అంటూ లంకవాసులు పూజలు చేస్తున్నారు. పదిహేను రోజులుగా ఏటిగట్టుపైనే కాపురం మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన మల్లవరపు జయమ్మ కుటుంబం స్థానికంగా ఉన్న కొబ్బరితోటకు కాపలా కాయడంతోపాటు పశువులను మేపుతూ పొట్టపోసుకుంటున్నారు. మొదటిసారి వచ్చిన వరద ఉద్ధృతికి జయమ్మ ఇల్లు కొట్టుకుపోయింది. దీనితో ఏటిగట్టుపై గుడిసె వేసుకుని ఐదుగురు కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. గత పదిహేను రోజులుగా ఆమె కుటుంబం ఈ గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. గోదావరి వరదల వల్ల కలిగిన ఇబ్బందులు చెప్పమంటే ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘రెండు వారాల నుంచి ఈ గుడిసెలోనే కాపురముంటున్నాం. వరదకు పాములొస్తున్నాయి. ఇంట్లో చంటి పిల్ల కూడా ఉండడంతో ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం’ అంటూ జయమ్మ వాపోయింది.