konai palli
-
కేసీఆర్ సెంటిమెంట్ టెంపుల్ !
-
నేడే ముహూర్తం
సాక్షి, సిద్దిపేట: గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి ఆదివారం బీ ఫారం అందుకున్న జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వే ల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థులు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సరిగ్గా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా తల్లిదండ్రులను, ఇష్ట దైవాలను కొలుచుకొని, పూజలు నిర్వహించి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్ కేంద్రాలకు వెళ్లనున్నారు. కోనాయిపల్లిలో కేసీఆర్, హరీశ్‌రావు పూజలు సెంటిమెంట్లకు, జాతకాలు, ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా కేసీఆర్ బీ ఫారంపై సంతకం పెడతారు. అనంతరం దానికి పూజారులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేరుగా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌తోపాటు, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లి తన బీ ఫారంకు పూజలు చేయిస్తారు. హరీశ్‌రావు మందుగా హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకొని, ఆ తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటారని ఆయన ఆనుచరులు చెబుతున్నారు. అనంతరం కోనాయిపల్లిలో పూజలు చేయించిన బీ ఫారం తీసుకొని నేరుగా సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడ అర్చకులు, పూజారులు, హిందూ మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అక్కడి నుండి గద్దెబొమ్మ సమీపంలోని పెద్ద మసీద్‌లోకి వెళ్లి హరీశ్‌రావు ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లీం పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయిస్తారు. అక్కడ క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇలా సర్వమత ప్రార్థనలు చేసిన తర్వాత సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఇంటి దైవాన్ని కొలిచిన తర్వాత సతీష్ నామినేషన్ హుస్నాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్‌కుమార్ తన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని కొలిచిన తర్వాత నామినేషన్ వేస్తారు. ముందుగా తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామమైన హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో వీరి పూర్వీకులు నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అట్నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి సతీష్‌కుమార్ నామినేషన్ వేయనున్నారు. సాదాసీదాగా సోలిపేట నామినేషన్ ఎప్పటి మాదిరిగానే దుబ్బాక నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సాదాసీదాగా బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మంచిరోజు ఉన్నదని అధినేత కేసీఆర్ చెప్పిన నేథప్యంలో అందరితోపాటు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూడవెల్లి ఆలయంలో పూజల అనంతరం ముఖ్య అనుచరులతో బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అధికారికి అందజేస్తారు. ఎల్లమ్మను మొక్కి ముత్తిరెడ్డి నామినేషన్ జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇష్ట దైవం ఎల్లమ్మ తల్లిని మొక్కి బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం యశ్వంతాపూర్ ఎల్లమ్మ తల్లి అంటే యాదగిరిరెడ్డికి భక్తి ఎక్కువ. అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ పూజలు నిర్వహించి పనిమొదలు పెట్టడం ఆనవాయితీ. అందులో భాగంగా బుధవారం ఉదయం యాదగిరిరెడ్డి కుటుంబసమేతంగా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. బీఫారం అక్కడ పెట్టి తల్లి దీవెనలు కోరుతారు. అక్కడి నుంచి జనగామ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందచేస్తారు. -
గ్రామస్తులే స్వాగతం పలకాలి
నంగునూరు (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు స్థానిక గ్రామ మహిళలే స్వాగతం పలకాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఇతర గ్రామాల ప్రజలెవరూ రావద్దని కోరారు. మంగళవారం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో హరీశ్‌రావు ప్రత్యేకపూజలు చేసిన అనంతరం మాట్లాడారు. పూజా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ బస్సులో వచ్చే అవకాశమున్నందున రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో పూజాఏర్పాట్లు చేయాలని స్థానిక నేతలకు సూచించారు. సీఎం రాక కోసం గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున గ్రామస్తులే ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. బస్సు మార్గంలో ఆలయానికి రావడానికి మార్గాలను సూచించాలని అధికారులను కోరడంతో బందారం దర్గా నుంచి వెల్కటూర్ మీదు గా లేదా రంగధాంపల్లి నుంచి ముండ్రాయి మీదుగా కోనాయిపల్లికి చేరుకోవచ్చని వివరించారు. గ్రామంలో సీఎం మాట్లాడేలా చూడాలని స్థానిక నాయకులు కోరడంతో మాట్లాడటం వీలు కాదని మంత్రి చెప్పారు. ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించే సమయంలో కేవలం ముఖ్య నాయకులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. -
విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల
⇒సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి ⇒15 మందికి గాయాలు ⇒మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి ⇒పోలీసుల హామీతో ఆందోళన విరమణ ⇒ఫిర్యాదు చే స్తున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు తూప్రాన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండి ప్రాణాన్ని బలిగొనడమే గాక మరో 15 మంది గాయపడ్డారు. అయితే సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. ఈ సంఘటన మండలంలోని కోనాయిపల్లి (పీటీ)లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శెట్టి నరసింహులు, భారతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు కాగా కుమారుడు శ్రీకాంత్ (20) కాళ్లకల్ గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో శ్రీకాంత్ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దీంతో విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్పటికే పనులకు వెళ్లిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవే స్తూ బాధితుడిని కొంపల్లిలోని లీలా ఆస్పత్రికి తరలిం చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందాడ ని ధ్రువీకరించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళన శ్రీకాంత్ మృతికి ట్రాన్స్‌కో అధికారులే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు మృతదే హాన్ని గ్రామ సమీపంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడి గదుల కిటికీల అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే యత్నం చేయడంతో వారు తిరగబడ్డారు. దీంతో ఎస్ఐ విషయాన్ని సీఐ సంజయ్ కుమార్‌కు తెలపడంతో ఆయన శివ్వంపేట ఎస్ఐ రాజేష్, సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో చర్చించి నష్టపరిహారంతో పాటు విద్యుత్ అధికారులపై కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే.. గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎర్తింగ్ లోపంతోనే దీని పరిధిలోని ఇళ్లకు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షాక్ రావడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త మన్నే సురేఖ ఇంట్లో ఉదయం వంట చేసేందుకు రైస్ కుక్కర్‌తో అన్నం వండేందుకు స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రా ణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఇలా గ్రామానికి చెందిన బక్క శోభ, మ హిపాల్, మన్నే రవి, మల్లిక, పృథ్వీరా జ్, మంగమ్మలతో పాటు మరికొందరు గ్రామస్తులు విద్యుదాఘాతానికి గురై గా యపడ్డారు. ఈ విషయంపై ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా విద్యుదాఘాతంతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి తమ శాఖ తరఫున రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని మూడు నెలల్లో అందిస్తామని తెలిపారు. మండలంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు గల ఎర్తింగ్లను సరి చేస్తామన్నారు.